నిబంధనవళి

నిబంధన -1
పార్టీ పేరు
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్స్కిస్టు )
నిబంధన -2
ఆశయము
భారత కార్మికవర్గ విప్లవాగ్రదళం భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు).కార్మికవర్గ నియంతృత్వ రాజ్యాంగ యంత్ర స్దాపన ద్వారా సోషలిజాన్ని, కమ్యూనిజాన్నీ సాధించడం దాని లక్షం.
నిబంధన -3
జెండా
పార్టీ జెండా ఎర్రజెండా , దీని నిలువు వెడల్పు కంటే 11/2 రెట్లు వుంటుంది. జెండా మధ్యలో క్రాస్ గా వున్న తెల్లటి సుత్తి, కొడవలి వుంటాయి .
నిబంధన -4
సభ్యత్వం
భారతదేశంలో నివసిస్తూ 18 ఏండ్ల వయస్సు దాటి, పార్టీ కార్యక్రమాన్ని నిబంధనావళిని అంగీకరించి, పార్టీ సంస్థలలో ఏదో ఒక దానిలో పని చేయడానికి అంగీకరించి, పార్టీభ్యత్వ రుసుమును ( నిర్ణయించిన రుసుమునూ, లెవీని ) క్రమంగా చెల్లిస్తానని ఒప్పకొని, పార్టీ నియమాలను అమలు జరపడానికి అంగీకరించిన ఏ వ్యక్తియైనా పార్టీ సభ్యత్వమునుకు అర్హుడవుతాడు.
నిబంధన -5
పార్టీ ప్రమాణ పత్రం
పార్టీలో జేరే ప్రతి వ్యక్తి పార్టీ ప్రమాణ పత్రంపై సంతకం పెట్టాలి. ఆ ప్రమాణ పత్రం యిలా వుంటుంది.“పార్టీ లక్ష్యాలను, ఆశయాలను నేను ఆమోదిస్తూన్నాను. పార్టీ నిబంధనావళికి కట్టుబడి వుండటానికి,పార్టీ నిర్ణయాలను విధేయతతో అమలు జరపడానికి కృషి చేస్తున్నాను.
నిబంధన -6
పార్టీ సభ్యత్వ రికార్డులు
( పార్టీ సభ్యత్వ రికార్డులన్నిటిన్ని జిల్లా కమిటి పర్యవేక్షణలో వుంచాలి. )
నిబంధన -7
పార్టీ సభ్యత్వాన్ని సరిచూడటం
పార్టీ సభ్యడు ఏ పార్టీ సంస్ధకు చెందుతాడో ఆ పార్టీ సంస్ధ ప్రతి సంవత్సరం పార్టీ సభ్యత్వాన్ని సరి చూస్తుంది.ఏ పార్టీ సభ్యడైనా వరుసగా,సకారణం లేకుండా పార్టీ జీవితంలోగాని,కార్యకలాపాలలోగాని పాల్గొనకపోయినా,పార్టీ బాకీలు చెల్లింపక పోయినా పార్టీ సభ్యత్వం నుండి మినిహయింపబడుతాడు.
నిబంధన -8
పార్టీ సభ్యత్వం నుండి రాజినామా
పార్టీ నుండి రాజీనామా యివ్వదలచుకొన్న పార్టీ సభ్యుడు తాను ఏ పార్టీ శాఖకు లేక పార్టీ కమిటీకి చెందుతాడో దానికి తన రాజినామాను అందజేయాలి.
నిబంధన -9
సభ్యత్వ రుసుం
క్యాండిడేటు సభ్యులతో సహా ప్రతిపార్టీ సభ్యుడూ ఏడాదికి రెండు రూపాయలు పార్టీ సభ్యత్వ రుసుం క్రింద చెల్లించాలి.
నిబంధన -10
పార్టీ లెవీ
ప్రతి పార్టీ సభ్యుడూ ప్రతినేల కెంద్రకమిటీ నిర్ణయించినట్లుగా పార్టీ లెవీని చెల్లించాలి. వార్షికాదాయం, లేక దఫదఫాలుగా వచ్చే ఆదాయం గలవారు ఆ ఋతువు ప్రారంభంలో గాని, పావు సంవత్సరం ప్రారంభంలోగాని , నిర్ణీత శాతం ప్రకారం చెల్లించాలి.
నిబంధన -11
పార్టీ సభ్యుల భాధ్యతలు
- పార్టీ సభ్యుల భాధ్యతలు ఈ క్రింది విధంగా వుంటాయి. - తాము సభ్యులుగా వున్న పార్టీ సంస్ద కార్యకలపాల్లో క్రమబద్దంగా పాల్గొంటూ, పార్టీ విధానాన్ని, నిర్ణయాలను ,ఆదేశాలను విశ్వాసంతో నెరవేర్చాలి. - మార్క్సిజం-లెనినిజంను అధ్యయనం చేస్తూ తమ అవగాహనను పెంపొందిచుకొనేందుకు కృషి చేయాలి.పార్టీ పత్రికలను, పార్టీ ప్రచురణలను చదవాలి. వాటిని బలపర్చుతూ ప్రచారం చేయాలి. - పార్టీ నిబంధనావళిని, పార్టీ క్రమశిక్షణను పాటించాలి. కమ్యూనిజం మహత్తరాశయాలకు అనుగుణంగా, శ్రామికవర్గ అంతర్జాతీయతను పాటిస్తూ వ్యవహరించాలి. - పార్టీ ప్రయోజనాలను, ప్రజల ప్రయోజనాలు స్వప్రయోజనాల కన్నా మిన్నగా పాటించాలి. - పార్టీలో ఒకరికొకరు తోడ్పడాలనే దృష్టితోనూ, వ్యష్టీ,సమిష్టి కార్యవిధానాన్ని అభివృద్ది చేసుకోవాలన్న దృష్టితోనూ, విమర్శన అలవర్చుకోవాలి.
నిబంధన -12
పార్టీ సభ్యుల హక్కులు
పార్టీ సభ్యుల హక్కులు ఈ విధంగా వుంటాయి. - పార్టీ సంస్ధలను,పార్టీ కమిటీలను ఎన్నుకునేందకు, వాటికి ఎన్నికయ్యేందుకు - పార్టీ విధానాన్ని , పార్టీ నిర్ణయాలను రూపొందించడంలో తోడ్పడటానికి గాను చర్చలలో స్వేచ్ఛగా పాల్గొనడానికి - పార్టీ సభ్యుడు తాను పార్టీలో నిర్వహించే పనిని గురించి సూచనలు చేయడానికి - పార్టీ సమావేశాలల్లో పార్టీ కమిటీలను గురించి, పార్టీ కార్యకర్తలను గురించి విమర్శలను చేయడానికి - తన పై క్రమశిక్షణా చర్యను గైకొనుటకు పార్టీ యూనిట్‌లో చర్చ జరుగుతున్నప్పుడు అన్ని పార్టీ కమిటీలూ పనిచేయాలి.తన యూనిట్‌లో స్వయంగా హాజరై తన వాదనను చెప్పుకొనేందుకు హక్కుంది.
నిబంధన -13
కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలు
కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రల మీద పార్టీ నిర్మాణ స్వరూపం ఆధారపడి వుంటుంది.ఆ సూత్రాలనునుసరించి పార్టీ అంతరంగిక జీవితం కొనసాగుతుంది. కేంద్రీకృత ప్రజాస్వామ్యం సంపూర్ణమైన అంతరంగిక పజాస్వామ్యం మీద ఆధారపడిన నాయకత్వమూ, కేంద్రీకృత నాయకత్వ సలహ సంప్రదింపులపై ప్రజాస్వామ్యం నిర్వహించడమూను. పార్టీ నిర్మాణ స్వరూపంలో అనుసరించవలసిన కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలు ఇలా ఉంటాయి. - పై నుండి క్రిందివరకూ పార్టీ నాయకత్వ సంస్థలన్నీ ఎన్నిక కావాలి. - అధిక సంఖ్యాకుల ఆమోదం పొందిన నిర్ణయాలను అల్పసంఖ్యాకులు అమలు జరపాలి. పై పార్టీ కమిటీలు చేసిన నిర్ణయాలను,ఆదేశాలను క్రింది పార్టీ యూనిట్లు అమలు జరపాలి. సమిష్టి అభిప్రాయానికి ప్రతివ్యక్తి లోబడి పనిచేయాలి. అన్ని పార్టీయూనిట్లూ పార్టీ మహాసభ, కేంద్రకమిటీ చేసిన నిర్ణయాలను ఆదేశాలను అమలు జరపాలి.
నిబంధన -14
అఖిల భారత పార్టీ మహసభ
- దేశం అంతటికీ ఉన్నతోన్నమైన పార్టీ నాయకత్వ సంస్ధ అఖిల భారత పార్టీ మహసభ. - సాధారణంగా పార్టీ మహసభను మూడు సవత్సరములకు ఒకసారి కేంద్ర కమిటీ ఏర్పాటు చేయాలి.తాను అవసరమని భావించే పక్షంలో కేంద్ర కమిటీ ప్రత్యేక పార్టీ మహసభను తనకిష్టమెచ్చినప్పడు జరపచ్చు లేదా మెత్తం పార్టీ స భ్యత్వం‌లో మూడవ వంతుకు తగ్గని ప్రాతినిధ్యం గల రెండు లేక అంతకన్న ఎక్కువ రాష్ట్ర పార్టీసంస్ధలు డిమాండ్ చేసినప్పుడు కూడా పార్టీ ప్రత్యేక మహసభను జరపాలి. - మామూలుగా జరిగే పార్టీ మహాసభకు రాష్ట్ర పర్టీ మహాసభల్లో ఎన్నికైన వారూ అఖిల భారత పార్టీ కేంద్రం ఆధీనంలో వున్న పార్టీ యూనిట్ల సమావేశాల్లో ఎన్నికైన వారూ ప్రతినిధులుగా ఉంటారు.
నిబంధన -15
కేంద్రమమిటీ
- కేంద్ర కమిటీ సభ్యులను పార్టీ మహసభ ఎన్నుకోవాలి. కేంద్ర కమిటీలో ఎంతమంది సభ్యులు వుండాలో పార్టీ మహసభ నిర్ణయిస్తుంది. రద్దవుతున్న కేంద్ర కమిటీ నూతన కమిటీలో వుండవలసిన సభ్యుల జాబితాను మహసభ ముందు ఉంచుతుంది. .పార్టీ అఖిల భారత మహాసభకూ మధ్యకాలంలో పార్టీ అత్యున్నతాధికార సంస్థగా కేంద్ర కమిటీ వుంటుంది. - నిబంధనావళిని అమలు జరపడానికి, పార్టీ మహాసభలో ఆమోదించిన రాజకీయ విధానాన్ని, నిర్ణయాలను అమలు జరపటానికి కేంద్ర కమిటీ బాధ్యత వహించుతుంది.
నిబంధన -16
రాష్ట జిల్లా పార్టీ సంస్ధలు
- రాష్ట్రం లో లేదా జిల్లాలో ఆయా రాష్ట్ర, జిల్లా మహసభమే అత్యున్నతమైన పార్టీ సంస్ధ.ఆ మహసభల్లో రాష్ట్ర కమిటీని లేదా జిల్లా కమిటీని ఎన్నుకుం‌టారు. - రాష్ట్ర లేదా జిల్లా పార్టీ కమిటీల నిర్మాణ స్వరూపం, వాటి హక్కులూ , విధులూ అఖిల భారత స్ధాయిని, పైన నిర్ణయించిన నిబంధనలను
నిబంధన -17
ప్రాథమిక యూనిట్
- పార్టీ ప్రాథమిక యూనిట్ గా పార్టీ శాఖ వుంటుంది. అది వృత్తిగానీ లేక ప్రాంతాన్ని గాని ఆధారం చేసుకొని ఏర్పాటవుతుంది. - ఒక ఫ్యాక్టరీలోగాని, ఒక సంస్ధలోగాపార్టీ ప్రాథమిక యూనిట్ గా పార్టీ శాఖ వుంటుంది. అది వృత్తిగానీ లేక ప్రాంతాన్ని గాని ఆధారం చేసుకొని ఏర్పాటవుతుంది అని లేదా ఒక పరిశ్రమలోగాని ఉన్న పార్టీ సభ్యులను వారి వారి వృత్తులను లేదా చేసే పనిని బట్టి శాఖలను ఏర్పాటు చేయాలి. ఆ విధంగా పార్టీ శాఖలు ఏర్పడినప్పుడు అలాంటి పార్టీ శాఖ లోని సభ్యులు తాము నివసించే ప్రాంతాల్లోని పార్టీ శాఖల్లో అసొసియేట్ సభ్యులుగా ఉంటారు.లేదా ఆ ప్రాంతల్లో సహయ శాఖలుగా వ్యవహరించవచ్చు.వారు నివసించే ప్రాంతాల్లో వారికి అప్పజెప్పే పనులు ఫ్యాక్టరీ లో లేదా వారు పని చేసే సంస్ధ ల్లో పార్టీ శాఖకు అప్పగించిన పనులకు ఆటంకం కలిగించే విధంగా ఉండరాదు
నిబంధన -18
కేంద్ర రాష్ట్ర కంట్రోలు కమీషనులు
- కేంద్ర కమిటీ ఎక్స్ - అఫీషియో సభ్యుడే కేంద్ర కంట్రోలు కమిషన్ కు అధ్యుక్షులుగా వుంటారు.అయిదుగురు సభ్యులకు మించిన కేంద్ర కంట్రోలు కమిషన్ ను పార్టీ మహసభ నేరుగా ఎన్నుకొంటుంది.
నిబంధన -19
పార్టీ క్రమ శిక్షణ
పార్టీ ఐక్యతను సంరక్షించి బలోపేతం చేయడానికి , దాని బలాన్నీ, పోరాట పటిమను, ప్రతిష్టను పెంపొందించటానికి, కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలను అమలు జరపడానికి క్రమశిక్షణ తప్పనిసరిగా అవసరం.పార్టీ క్రమశిక్షణ ను ఖచ్చితంగా అంటి పెట్టుకొని వుండకపోతే ప్రజలను,వారి పోరాటాలనూ, కార్యకలాపాలనూ పార్టీ నడపలేదు. ప్రజల పట్ల తనకున్న బాధ్యతలను పార్టీ నిర్వర్తించలేదు.
నిబంధన -20
ప్రజా సంస్ధలకు ఎన్నికైన పార్టీ సభ్యులు
పార్లమెంటుకు, రాష్ట్ర శాససభకు లేదా స్ధానిక పరిపాలనా సంస్ధలకు ఎన్నికైన పార్టీ సభ్యులు ఒక పార్టీ గ్రూపుగా ఏర్పడి, అందుకు సంబంధించిన పార్టీ కమిటీ క్రింద, పార్టీ విధనాలకు, కార్యక్రమానికి, అదేశాలకు ఖచ్చితంగా అంటి పెట్టుకొని వుంటూ పని చేయాలి.
నిబంధన -21
పార్టీ అంతరంగిక చర్చలు
పార్టీని సమైక్యపరచటానికై పార్టీ మొత్తం వివిధ సంస్ధలలోనూ, పార్టీ విధానంపై స్వేచ్ఛగానూ,క్రమంగా చర్చలు జరపటం ఉపయోగకరమూ,అవసరం కూడా . ఇది పార్టీ అంతరింగిక ప్రజాస్వామ్యం నుండి ఉదయించే పార్టీ సభ్యుల విడదీయరాని హక్కు అయితే పార్టీ విధాననికి సంబంధించిన సమస్యలపై ఎడతేగని చర్చలు జరపడం పార్టీ అంతరింగిక ప్రజాస్వామ్యాన్ని.గోరంగా దుర్వినియోగం చేయటమేఅవుతుంది.
నిబంధన -22
పార్టీ మహసభకు, ఇతర మహసభలకు ముందు జరిగే చర్చ
అఖిల భారత పార్టీ మహసభ జరిగేనాటికి రెండు నెలల ముందుగానే పార్టీ యూనిట్లన్నీ చర్చించేందుకుగాను ముసాయిదా తీర్మానాలను కేంద్ర కమిటి పంపిస్తుంది. ఆ తీర్మానాలకు ప్రతిపాదించిన సవరణలన్నింటినీ నేరుగా కేంద్ర కమిటీకి పంపాలి. అప్పుడు కేంద్ర కమిటీ వాటి పై రిపోర్టు తయారు చేసి పార్టీ మహసభ ముందు పెడుతుంది. తమ చిత్తు తీర్మానాన్ని వివిధ భాషలలో తర్జుమా చేసి అన్ని పార్టీ శాఖలకు కేంద్ర కమిటీ విడుదల చేసిన తర్వాత సాధ్యమైనంత తక్కువ కాలంలో చర్చల సారాంశాన్ని అందచేయవసిన బాధ్యత రాష్ట్ర కమిటీలపైఉన్నది.
నిబంధన -23
ప్రజాసంఘాల్లో పని చేసే పార్టీ సభ్యులు
ప్రజాసంఘాల్లోనూ, ఆ సంఘాల కార్యనిర్వహక వర్గాల్లోను, పని చేసే పార్టీ సభ్యులు అందుకు సంబంధించిన పార్టీ కమిటీ నాయకత్వాన ఫ్రాక్షన్ కమిటీలుగా ఏర్పడి పని చేయాలి. వారు తాము పని చేసే ప్రజాసంఘాల ప్రజాపునాదిని, పోరాట పటిమను బలోపేతం‌ చేయడానికి సదా కృషిని సాగించాలి.
నిబంధన -24
ఉపనిబంధనలు
పార్టీ నిబంధనవాళి క్రింద దానికి అనుగుణంగా కేంద్ర కమిటీ కొన్ని నియామాలను,కొని నిబంధనలను ( బైలాలు ) తయారు చేయవచ్చు అలాగే కేంద్ర కమిటీ ధృవీకరణకు లోబడి రాష్ట్ర కమిటీ కూడా పార్టీ నిబంధనావళి క్రింద దానికనుగుణంగా కొన్ని నియమాలను ఉపనిబంధనలను తయారు చేసుకోవచ్చు.
నిబంధన -25
పార్టీ నిబంధనావళికి రూల్స్
వివరణ : ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి సభ్యత్వం బదలీ కేంద్ర కమిటీ ద్వారానే జరుగుతున్నప్పటికి అం దుకై పేర్కొంటున్న వివరాలు సాధారణంగా సంపూర్ణంగా వుండటం లేదు. అందువల్ల రాష్ట్రాలు ఒక కామ్రేడ్ సభ్యత్వాన్ని ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి బదలీ చేయమని కోరేటప్పడు ఆ రాష్ట్రం ఈ క్రింది విషయాలను స్పష్టంగా పేర్కొనాలి. ప్రతి స్ధాయిలో పార్టీ సభ్యుని రికార్డు సక్రమంగా వుంచడానికి అది అవసరం. అదే విధంగా రాష్ట్రంలో బదలీ చేయాలన్నా అదే వర్తిస్తుంది.