అధ్యయనం పేరుతో విహార యాత్రలా? - అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి

13.06.2018

వ్యవసాయాధారిత పరిశ్రమలపై అధ్యయనం పేరుతో మంత్రులు విహార యాత్రలు చేస్తున్నారని అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి విమర్శించారు. సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించేందుకు విదేశాలకు వెళ్లి అధ్య యనం చేయాల్సినంత అవసరం లేదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వంలో ఆర్థిక మంత్రితో సహా ప్రభుత్వ కార్యదర్శులు కర్నాటకలో పర్యటిం చడంలో అర్ధం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ నీటితో ఎక్కువ పంటలు ఎలా పండించాలో అధ్యయనం చేయడానికి ఇజ్రాయిల్‌, సింగపూర్‌లలో పర్య టించించారన్నారు. మళ్లీ కేరళలో వ్యవసాయ విధానం ఎలా ఉందో తెలుసుకొని వస్తామని చెప్పి మూడోసారి పర్యటించారని తెలి పారు. వాస్తవంగా కేరళలో హార్టి కల్చర్‌కు అధిక ప్రాధాన్య తిస్తారని, ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 70 శాతం ఆ రంగం నుంచే వస్తుందని వివరించారు. వ్యవసాయ రంగం లో నూతన మార్పులు తీసుకొస్తామని చెప్పుకుంటూ విహార యాత్రలు చేస్తున్నారు తప్పా ఒక్క కొత్త విధానం అమలు చేసిన పాపాన పోలేదని విమర్శిం చారు. కోట్ల రూపాయలు విదేశాల పర్యటనల పేరుతో దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.