కఠినంగా శిక్షించాలి - కేవీసీఎస్‌ డిమాండ్‌ 

13.06.2018

సిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుంట మండలం, కిష్టారావుపల్లి గ్రామంలో దళితుడైన ఎల్లయ్య, అతని కుమారున్ని పెత్తందార్లు హత్య చేశారని కేవీసీఎస్‌ పేర్కొంది. ఈ హత్యలను కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు కాడిగల్ల భాస్కర్‌, ప్రధాన కార్యదర్శి స్కైలబ్‌బాబు ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. హత్యకు పాల్పడిన పెత్తందార్లను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. ఆ గ్రామంలో అనేక ఏండ్లుగా భూ తగాదా కొనసాగుతున్నదని తెలిపారు. ఈ సమస్యను అధికారులు పరిష్కరించకపోవడం వల్లే దళితులపై హత్యాకాండ కొనసాగిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు.