ప్రయివేటీకరణ ఆపండి : సీపీఐ(ఎం)

30.04.18

 

భారత వారసత్వాన్ని ప్రయివేటీకరిం చడాన్ని ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి సీపీిఐ(ఎం) విజ్ఞప్తి చేసింది. దేశ రాజధానిలోని ఎర్రకోటను దాల్మియా గ్రూపునకు 5 సంవ త్సరాలకు అప్పగిస్తూ కేంద్ర పర్యాటక శాఖ, సాంస్కృతిక, పురావస్తు శాఖలు ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఒప్పందంలో ఎర్రకోటలో నిర్వహించే ప్రతీ కార్యక్రమంలో దాల్మియా బ్రాండ్‌ను ప్రచారం చేయాలి. ఈ ఒప్పందం ప్రకారం ఎర్రకోటను దాల్మియా భారత్‌ లిమిటెడ్‌కు దత్తత ఇచ్చినట్లేనని సీపీఐ(ఎం) విమర్శించింది. ఎర్రకోట దేశంలో మిగిలిన సాంస్కృతిక ప్రదేశాల్లో ఒకటి మాత్రమే కాదు. స్వాతంత్ర పోరాటం జ్ఞాపకార్థం ఇక్కడ జాతీయ పతకాన్ని ఎగరవేస్తారు. 1857లో మొట్ట మొదటి భారత స్వాతంత్ర ప్రకటనను ఇక్కడే బహదూర్‌ షా జాఫర్‌ చదివారు. స్వతంత్ర భారతానికి ఎర్రకోట చిహ్నంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఆగష్టు 15న జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఎర్రకోటను కార్పొరేట్‌ సంస్థకు అప్పగించడం దైవ దూషణ కంటే తక్కువ కాదని సీపీిఎం పేర్కొంది.సాంస్కృతిక ప్రదేశాలను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే అంశాన్ని పార్లమెంటరీ కమిటీకి అప్పగించాలని సీపీఐ(ఎం) కోరింది. ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేసింది.