బహుజనుల రాజ్యాధికారమే ధ్యేయం : టీ మాస్‌ రాష్ట్ర కన్వీనర్‌ జాన్‌వెస్లీ

11.07.2018

బహుజనుల రాజ్యాధికారమే ధ్యేయంగా టీమాస్‌ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన రాజకీయ చైతన్యం తెస్తామని టీ-మాస్‌ రాష్ట్ర కన్వీనర్‌ జాన్‌వెస్లీ అన్నారు. ఖమ్మంలోని మంచికంటి భవన్‌లో టీమాస్‌ జిల్లా కన్వీనర్‌ యర్రా శ్రీకాంత్‌ అధ్యక్షతన 'బహుజనులకు రాజ్యాధికారం' అనే అంశంపై మంగళవారం జరిగిన చర్చాగోష్టిలో జాన్‌వెస్లీ మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల వారిని రాజకీయంగా, సామాజికంగా చైతన్య పరిచేందుకు గానూ 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు బీసీ, దళిత అభ్యర్థులను ముఖ్యమంత్రిని చేస్తాయా? అని ప్రశ్నించారు. జనాభా దామాషా ప్రకారం వారికి సీట్లు కేటాయిస్తారో లేదో చెప్పాలని, లేకపోతే ఆ పార్టీలను ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బహుజనులకు గొర్రెలిస్తాం, బర్రెలిస్తాం అంటూ ఆశలు కల్పిస్తూ వారిని రాజకీయంగా ఎదగనివ్వకుండా అణచివేస్తున్నారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్‌ మాటతప్పారన్నారు. దళిత, బీసీ, ఎస్టీ ఎమ్మెల్యేలను రాష్ట్రంలో అణగదొక్కుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో బీసీలు 62మంది ఉండాల్సి ఉండగా కేవలం 19మంది మాత్రమే ఉన్నారని, రాష్ట్ర జనాభాలో ఒక్క శాతం కూడా లేని వెలమలు, కమ్మ సామాజిక తరగతి వారు 45మంది ఉన్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ జనాభా ప్రాతిపధికన 119స్థానాల్లో బహుజనులతో పోటీ చేయిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిందని, ఇతర రాజకీయ పార్టీలు కూడా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధు పథకం కింద రూ.5వేల కోట్లు కేటాయిస్తే భూస్వాములకే రూ.3వేల కోట్లు వెళ్లాయని తెలిపారు. అనంతరం టీమాస్‌ జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ బీవీ. రాఘవులు, నాగభూ షణం, గుద్దేటి వీరభ ద్రం, అనంతయ్య, వై.వినరుకుమార్‌, అక్బర్‌ముసా, లింగా ల రవికుమార్‌, అసద్‌, పెరుగు వెంక టరమణ, పి.విజ రుకుమార్‌, భద్రూ నాయక్‌, అఫ్రోజ్‌ సమీనా, జనార్ధ నాచారి, మీగడ రామారావు, అల్లిక వెంకటేశ్వర్లు, యా కూబ్‌ పాషా, ఝాన్సీ, మేకల సుగుణా రావు, చెవుల వెంకన్న, ఖాకీ భాస్కర్‌ రావు మాట్లాడారు.