మహాజన పాదయాత్ర విశేషాలు

 • త్వరలోనే ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ఐదు మాసాలు..సుదీర్ఘ పాదయాత్ర అనంతరం ఆయన సోమవారం ఉదయం ఎంబీ భవన్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాజన పాదయాత్ర అద్భుతంగా..జయప్రదంగా ముగిసిందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం ద్వారానే అభివృద్ధి అవుతుందని, సామాజిక న్యాయం చెప్పడానికి..ప్రజలను చైతన్యవంతం చేయడానికి తాము పాదయాత్ర చేయడం జరిగిందన్నారు.

 • మహాజన పాదయాత్ర విజయవంతంగా జరిగిందని, అనుకున్నదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని సీపీఎం నేత వెంకట్ పేర్కొన్నారు. ఎంబీ భవన్ లో పాదయాత్ర రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాదయాత్రలో 70 నుండి 80 లక్షల కుటుంబాలను కలవడం జరిగిందన్నారు. జిల్లాలో అన్ని కుటుంబాలను కలవడానికి ప్రయత్నించడం జరిగిందన్నారు.
 • తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, మహాజన పాదయాత్ర బృంద రథసారధి తమ్మినేని వీరభధ్రం పేర్కొన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయన కీలక ఉపన్యాసం చేశారు. మాట్లాడించే పాత్ర ఇష్టమని, చాలా ముఖ్యమైన విషయాలు వక్తలు పేర్కొన్నారని తెలిపారు. పాదయాత్ర విశేషాలు చెప్పాలంటే గంటన్నర టైం పడుతుందని, 154 రోజుల పాటు యాత్ర చేయడం జరిగిందన్నారు. ఈ పాదయాత్ర మరుపురాని అనుభూతినిచ్చిందన్నారు. రాజకీయాల ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారమౌతాయని, ఒక ఏజెండా కోసం రాజకీయ పార్టీలు కొట్లాడాలన్నారు. అభివృద్ధి అంటే కేసీఆర్ కు...గత పాలకులు అర్థం కావడం లేదన్నారు. 1520 గ్రామాలు తిరగడం జరిగిందని, తెలంగాణ రాక ముందు ఎలా ఉందో అలాంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు.
 • ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశించి ప్రాణాలు అర్పించిన యువత..అడ్డా..కూలీలపై పని చేస్తున్నారు. పాలించే విధానంలో తప్పు ఉందన్నారు. అభివృద్ధి అంటే ప్రజల జీవితాల మార్పు అని, వైద్యం...విద్య..ఉద్యోగం..సరిపడా వేతనం ఉండాలని సూచించారు. ఇవి ఉంటే మార్పు వస్తుందని, ఇవన్నీ ఇస్తాయని కేసీఆర్ చెప్పి ఇవ్వలేదన్నారు. తమకు పాదయాత్రలో చూడడం జరిగిందని, మారుమూల ప్రాంతాల్లో పిట్టల్లా ప్రజలు రాలుతున్నారని తెలిపారు. ఉద్యమానికి సపోర్టు ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఎలా ఉందో చూడాలని, శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలని నిధులు కేటాయించాలని చెబితే కేవలం కొన్నింటిని మాత్రమే కేటాయించారన్నారు.
 • పరిశ్రమలు తెరిపిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన అనంతరం పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. పరిశ్రమలు మూత పడుతున్నా కళ్లు అప్పగించి చూస్తున్నారని, కేసీఆర్ ఖబడ్దార్ అనే హెచ్చరిక చేయాల్సినవసరం వచ్చిందన్నారు. సామాజిక న్యాయమే తెలంగాణ అభివృద్ధికి మార్గం అని మరోమారు స్పష్టం చేశారు. కులాల ఘర్షణ కాదని, వీరి అభివృద్ధి చెందకుండా అభివృద్ధి అనేది అసాధ్యమన్నారు.
 • మాటలతో..చేతలతో కాదని..20 శాతం ఉచితంగా విద్య చెబుతారా ? లేదా ? అని ప్రైవేటు స్కూళ్ల ఎదుట కూర్చొంటామన్నారు. పెద్ద ఎత్తున్న ఉద్యమం వస్తుందని, 22 లక్షల మందికి ఇళ్లు కటిస్తామని చెప్పారని, కానీ కట్టివ్వడం లేదన్నారు. ఇదే కొనసాగితే మీ బెడ్ రూంలో నిద్రపోనివ్వమన్నారు. ఖచ్చితంగా ఇళ్లు కేటాయించాల్సిందేనన్నారు.
 • బడ్జెట్ అంశాలన్నీ అమలు చేయాలని సీపీఎం ప్రభుత్వంపై వత్తిడి తెస్తుందని, గిరిజనులు..దళితుల సమస్యలపై తాను అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుందన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దేశంలో 74వేల కోట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 17వేల కోట్ల రూపాయలు దారి మళ్లాయన్నారు. పాదయాత్ర వల్ల సర్కార్ లో కదలిక వచ్చిందని, ఎర్ర జెండా పని అయిపోలేదని..జెండా మనకు అండ అని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.
 • మనుషులుగా గుర్తించాలని పూలే, అంబేద్కర్ లు ఆనాడు చెప్పారని ప్రజా కవి గద్దర్ గుర్తు చేశారు. సరూర్ నగర్ స్టేడియంలో సీపీఎం నిర్వహించిన మహా పాదయాత్ర ముగింపు సభలో ఆయన ఆడి..పాట వినిపించారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు..వెనుకబడిన వర్గాలు..పేద ప్రజలు పడుతున్న బాధలను పాటలో వినిపించారు. తెలంగాణ కొసం పాడిన గొంతు సామజిక తెలంగాణ కొసం పాడుతుందని పేర్కొన్నారు. ఇది రాజకీయమైన మీటింగ్ అని, ఇది ఒక సింపుల్ మీటింగ్ కాదని తెలిపారు. అది ఇస్తా..ఇది ఇస్తా..అని తమ్మినేని అనలేదన్నారు. మా భూములు..మా వనరులు..మా పాలన మనకే రావాలనే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
 • అర్థం కాని అంకెలతో బడ్జెట్ లతో మాయ చేస్తున్నారని, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం జేఏసీకి కట్టుబడి ఉందని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఔటాఫ్ కవరేజ్ లోకి వెళ్లిపోయిందని, లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయడం లేదన్నారు. తమ అసంతృప్తిని వ్యక్తం చేసే వేదిక లేకుండా చేస్తున్నారని విమర్శించారు. పాలాభిషేకాలకు తప్ప దేనికి అనుమతించడం లేదన్నారు. తెలంగాణ సాధించుకున్నాక కూడా ప్రయాణం కొనసాగాలని జయశంకర్ సార్ చెబుతుండేవారని తెలిపారు. సామాజిక న్యాయం..ప్రజాస్వామిక తెలంగాణ కోసం జేఏసీ కట్టుబడి ఉందన్నారు.
 • ఓట్లు..సీట్ల కోసం సీపీఎం మహాజన పాదయాత్ర చేయలేదని, సామాజిక న్యాయం కోసం పాదయాత్ర చేశారని మాదాల రవి తెలిపారు. శ్రమ జీవుల రక్తంలో నుండి ఎర్రజెండా పుట్టిందని, రాష్ట్రం, దేశానికి చెందిన పార్టీ కాదని 120 దేశాల్లో పార్టీ ఉందన్నారు. లాల్..నీల్ జెండాలు కలవాలని, సహనాన్ని పరీక్షిస్తే ఎర్రమల్లెలు అవుతారని పేర్కొన్నార. బిల్డింగ్ లు కడితే అభివృద్ధా ? అని సూటిగా ప్రశ్నించారు. భూములున్నాయా..విద్య ఎలా ఉంది. ? కమ్యూనిస్టులు..అంబేద్కరిస్టులు కలవాలని సూచించారు. విప్లవ శంఖం పూరిద్దామని, వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలని పిలుపునిచ్చారు.
 • భారతమాతా కి జై..అనే నినాదానికి ప్రత్యామ్నాయంగా లాల్ సలాం..నీల్ సలాం అనే నినాదం యూనివర్సిటీల్లో వినిపిస్తోందని కంచె ఐలయ్య పేర్కొన్నారు. భీమ్ భూమికి జై...అని నినదించారని, నీల్..ఎర్రజెండాలు కలిశాయన్నారు. ఢిల్లీ గడ్డపై మాదిగ రావాలని, తల్లి..తండ్రి పేరు చెప్పని దౌర్భాగ్యులు ఉన్నారని తెలిపారు. దళిత వ్యక్తి ప్రధాన మంత్రి అయ్యే విధంగా సీపీఎం, సీపీఐలు కృషి చేయాలన్నారు. తెలంగాణ వద్దని సీపీఎం చెప్పిందని ప్రచారం చేశారని, దొరల వ్యక్తి గద్దె దిగే సభ ఇది అన్నారు. భూమి ఇస్తానని కేసీఆర్ చెప్పారని, సంవత్సరంలోపు చేయాలని డిమాండ్ చేశారు. వెలమ భూస్వామి నుండి గద్దె దింపడమే సభ లక్ష్యమన్నారు.
 •  పేదలకు కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని, ఇది మొదలు కాని చివరది కాదని ప్రముఖ విద్యా వేత్త చుక్కా రామయ్య పేర్కొన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజల యొక్క ఇబ్బందులు అర్థమయ్యాయని, సమాజాన్ని తెలంగాణ బిడ్డలను ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రకటిస్తారని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
 • తెలంగాణ సీఎం కేసీఆర్ పచ్చి మతోన్మాది అని ఎంసీపీఐ గౌష్ పేర్కొన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సీపీఎం మహాజన పాదయాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మతతత్వాన్ని ఎదుర్కొనకపోతే సామాజిక న్యాయం రాదని పేర్కొన్నారు. దేవాలయాల చుట్టూ తిరుగుతూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రజా ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్ కౌంటర్ లకు పాల్పడుతున్నారని తెలిపారు. సీపీఎం నిర్వహించిన పాదయాత్ర పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిందని తెలిపారు. ప్రజా ఉద్యమాలు నిర్మించాలని, పాదయాత్ర ఒక స్పూర్తి నింపిందన్నారు.
 • సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సీపీఎం మహాజన పాదయాత్రలో విమలక్క పాట..మాట ద్వారా జోష్ నింపారు. మనువాదాన్ని తగులపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరో పొరాటానికి సిద్ధంగా ఉండాలని, సిద్ధంగా ఉండకపోతే సామాజిక న్యాయం కాదు.కదా..నిలబడే స్థితి కూడా ఉందన్నారు. ఏ పాట తెలంగాణ తెచ్చిందో అ పాటని బంధిస్తావా ...కెసిఆర్ కాస్కో అంటూ విమలక్క పేర్కొన్నారు.
 • 'సామాజిక న్యాయం ద్వారానే అభివృద్ధి జరుగుతుందని కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. సరూర్ నగర్ స్టేడియంలో మహాజన పాదయాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...మహాజన పాదయాత్ర నిర్వహించిన తమ్మినేని బృందానికి అభినందనలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగు వేల కిలో మీటర్ల దూరం ప్రయాణించి ప్రజా సమస్యలు తెలుసుకుందన్నారు.
 • లాల్...నీల్ జెండాల ఐక్యతను ఎవరూ ఆపలేరని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో మహాజన పాదయాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. జై భీం..లాల్ సలాం..భగత్ సింగ్ ఇచ్చిన స్లోగన్ విప్లవం వర్ధిల్లాలి అనే నినాదంలోకి మారిందన్నారు. నాగ్ పూర్ లో మీటింగ్ ను ఆర్ఎస్ఎస్ వాళ్లు అడ్డుకొనేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. 4200 కి.మీటర్ల పాదయాత్ర చారిత్రాత్మకమైందని, దేశంలో ఏ పార్టీ ఇంత పెద్ద పాదయాత్ర చేయలేదని కొనియాడారు. ఏ పార్టీకి కూడా శక్తి సామర్థ్యాలు లేవన్నారు. సమస్యలు పరిష్కరించాలని సీం కేసీఆర్ కు లేఖలు రాయడం జరిగిందని, ఈ లేఖలతో బుక్ ముద్రించారన్నారు. కేసీఆర్ ఎంపీగా ఉన్న సమయంలో తనతో పరిచయం ఉందని, ఇప్పుడు మితృత్వం పోయిందని ఆయన దానికి జవాబు చెప్పాలన్నారు. సాయుధ పోరాటం..విప్లవ పోరాటం అనంతరం భూ సంస్కరణల దేశ ఏజెండా మీదకు తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో పోరాటాలు జరిగితే దేశ వ్యాపితంగా ప్రభావం చూపిస్తుందని గత పరిస్థితులు తెలియచేశాయని తెలిపారు. లాల్..నీల్ జెండా ఐక్యతను ఎవరూ ఆపలేరన్నారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ను తీసుకొచ్చారని, నోరు తెరిస్తే ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్ ను రద్దు చేశారని, రూ. 73వేల కోట్ల రూపాయలు డబ్బును రిలీజ్ చేయాలని అంటే కేంద్రం అంగీకరించడం లేదన్నారు. ఆర్థిక, సామాజిక రంగంలో సామాజిక న్యాయం దూరమౌతోందని, దౌర్జన్యాలు పెరుగుతున్నాయన్నారు. వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సినవసరం ఉందని, పార్టీ కేంద్ర కమిటీ నుండి అభినందనలు తెలియచేస్తోందన్నారు. కేసీఆర్ మీద వత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలను బలపరుస్తామన్నారు.
 • సరూర్ నగర్ స్టేడియం వద్దకు కేరళ సీఎం పినరయి విజయన్ చేరుకున్నారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన కేరళ ఆత్మయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్న సంగతి తెలిసిందే.
 •  సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన మహాజన పాదయాత్ర విజయవంతమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో మహాజన పాదయాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్..ఎవరు ముక్కు నేలకు రాయాలి..కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి అని పేర్కొన్నారు. కమ్యూనిస్టులకు సుదీర్ఘ పోరాట చరిత్ర ఉందని, తాము సన్నాసులు కాదని..ప్రజా పోరాటాలకు సన్నద్దమయ్యే నేతలమన్నారు. కమ్యూనిస్టుల్లో చీలిక ఏర్పడడం బాధకరమని, లాల్..నీల్ జెండాలు ఏకమవుతున్న సందర్భంలో కేసీఆర్ పలు వరాలు కురిపిస్తున్నాడని తెలిపారు. దళితుడిని సీఎం చేస్తానని, మూడెకరాల భూమి ఇస్తాన్న కేసీఆర్ హామీలు అమలు చేయలేదన్నారు. కేసీఆర్ ఎవరికి ముఖ్యమంత్రి ? ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య విలువలు పతనమయ్యాయని, ప్రముఖ పాత్ర పోషించిన ఇందిరాపార్కు ధర్నా చౌక్ ను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ నియంతృత్వానికి నిదర్శనమన్నారు.
 • తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాలమహనాడు నేత అద్దంకి దయాకర్ విరుచకపడ్డారు. సరూర్ నగర్ స్టేడియంలో మహాజన పాదయాత్ర ముగింపు సభలో ఆయన తనదైన శైలిలో ప్రసంగించారు. చెప్పులు కుట్టుకున్న వాడికి అధికారం ఇస్తానన్న కేసీఆర్ ఏం చేస్తున్నాడు..సన్నాసి వెధవ అంటూ విమర్శలు గుప్పించారు. 'పైన ఒక సన్నాసి ఉన్నాడు..సంసారాలు ఎలా ఉంటాయో తెలియదు..యోగి ఆదిత్యనాథ్ కు కూడా సంసార బాధ్యతలు తెలియదు. తన్ని తరిమే రోజులు దగ్గర పడ్డాయి..సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని అనుకుంటే దొరల రాజ్యం ఏర్పడింది. తెలంగాణ సామాజిక ముఖచిత్రం వీరికి ఏం తెలుసు. ఇక యుద్ధం మొదలైంది. జయశంకర్ ను మర్చిపోయారని, కోదండరాంపై విమర్శలు చేస్తున్నారు..2019లో అధికారం కోల్పోతుంది' అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.
 • ఐదు నెలలుగా రాష్ట్ర మంతా పల్లె..పల్లె..వాడ..వాడ అంతా తిరిగి పాదయాత్ర మనముందుకు వచ్చిందని సీపీఎం నేత నాగయ్య పేర్కొన్నారు. పేదల కష్టాలు..బాధలు..అట్టడగు ఉన్న వారి సమస్యలను తెలుసుకొనేందుకు పాదయాత్ర నిర్వహించారని, సమస్యలపై సర్కార్ కు పాదయాత్ర బృంద రథసారధి తమ్మినేని వీరభద్రం సర్కార్ కు లేఖలు రాయడం జరిగిందన్నారు. 93 శాతంగా ఉన్న ప్రజలు అభివృద్ధి చెందకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. చేసిన హామీలు అమలు కాలేదని నిలదీస్తుంటే సీఎం కేసీఆర్ ఒంటికాలిపై లేస్తున్నారని, హామీలు అమలు చేశారని అనుకుంటే చర్చకు సిద్ధమని సవాల్ విసరడం జరిగిందన్నారు. సర్కార్ చెప్పేటివన్నీ పచ్చి అబద్ధాలేనని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. చనిపోతే ఏడు గజాల భూమి లేని పరిస్థితి నెలకొందన్నారు.
 • సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వేదిక మీదకు చేరుకున్నారు. ఎస్వీకే నుండి ప్రారంభమైన మహాజన పాదయాత్ర ర్యాలీ కాసేపటి క్రితం స్టేడియానికి చేరుకుంది. ఈ సందర్భంగా లాల్..సలాం..సీపీఎం జిందాబాద్ నినాదాలతో మారుమోగింది. వేదిక మీదకు పాదయాత్ర బృంద సభ్యులు చేరుకున్నారు.
 • లాల్ సలాం..జై భీమ్..లాల్..నీల్ జెండాలు ఏకం కావాలె..అనే నినాదాలతో సరూర్ నగర్ స్టేడియం దద్దరిల్లుతోంది. సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఎస్వీకే నుండి ప్రారంభమైన పాదయాత్ర ర్యాలీ స్టేడియానికి చేరుకుంది. మహాసభకు భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర బృంద ర్యాలీ సరూర్ నగర్ స్టేడియానికి చేరుకుంది. ఎస్వీకే నుండి 70వేల మందితో ర్యాలీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీని సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి ప్రారంభించారు.
 •  సీపీఎం మహాజన పాదయాత్ర ర్యాలీ కొనసాగుతోంది. కాసేపట్లో ఈ ర్యాలీ సరూర్ నగర్ స్టేడియానికి చేరుకోనుంది. సభకు భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. వివిధ జిల్లాల నుండి చిన్నా..పెద్ద అనే తేడా లేకుండా భారీగా చేరుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర ర్యాలీ కొనసాగుతోంది. ఈ ర్యాలీలో చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా అందరూ పాల్గొంటున్నారు. పాదయాత్ర ముగింపు సభ కాసేపట్లో సరూర్ నగర్ స్టేడియంలో ప్రారంభం కానుంది.
 • సరూనగర్ స్టేడియంలో మహాజన పాదయాత్ర ముగింపు సభ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కళాకారులు తమ ప్రదర్శనలు చేస్తున్నారు. బహిరంగసభకు భారీగా జనాలు తరలివస్తున్నారు.
 • సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి పేరిట పాదయాత్ర జరిగిందని పాదయాత్ర బృంద నేత, మహిళ కార్మికురాలు రమ పేర్కొన్నారు.
 • తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనులు కడుదయనీయ పరిస్థితిలో ఉన్నారని సీపీఎం పాదయాత్ర బృంద నేత నైతం రాజు పేర్కొన్నారు. కాసేపటి క్రితం ఎస్వీకే నుండి ర్యాలీ ప్రారంభమైంది.
 • ఎస్వీకే నుండి సీపీఎం ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించారు. అగ్రభాగాన ఏచూరి, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పాదయాత్ర బృందం నేతలు పాల్గొన్నారు.
 • సరూర్ నగర్ స్టేడియంలో మహాజన పాదయాత్ర ముగింపు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 120 మంది వేదికపై కూర్చొంటారని, లక్ష మంది ప్రజలు వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కామ్రెడ్ నంద్యాల నర్సింహ రెడ్డి పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లు పోలీసులు చూస్తున్నారని, ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలుగకుండా పోలీసులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు.
 • ఎస్వీకే వద్ద సీపీఎం ర్యాలీ ప్రారంభమైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ర్యాలీని ప్రారంభించారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన సీపీఎం శ్రేణులు కదం తొక్కాయి.
 • నగరం ఎరుపుమయమైపోయింది. సరూర్ నగర్ స్టేడియంలో సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభ జరగనుంది. అన్ని దారులు ఒకే వైపు వెళుతున్నాయి. వివిధ జిల్లాల నుండి వచ్చిన సీపీఎం శ్రేణులతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి.
 • ఎస్వీకే వద్ద ర్యాలీ ప్రారంభం కానుంది. పాదయాత్ర ముగింపు సభా ప్రాంగణానికి కార్యకర్తలు తరలివెళ్లనున్నారు. ఈ ర్యాలీని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. తిలక్ నగర్, మలక్ పేట మీదుగా సరూర్ నగర్ లోని సభా ప్రాంగణానికి కార్యకర్తలు చేరుకోనున్నారు.
 • సమర సమ్మేళనంలో పాల్గొనేందుకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జనగామ (ఐద్వా) నేతలు బయలుదేరారు. ఇప్పటికే ఎస్వీకే వద్ద భారీగా సీపీఎం శ్రేణులు చేరుకుంటున్నారు.
 • ఎస్వీకే వద్దకు సీపీఎం శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. సరూర్ నగర్ లో పాదయాత్ర ముగింపు సభ జరగనుంది. సమర సమ్మేళన సభలో పాల్గొనేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు.
 • నేటితో సీపీఎం పాదయాత్ర ముగియనుంది. 154 రోజులపాటు 4200 కి.మీ పాదయాత్ర కొనసాగింది. 29 జిల్లాల్లో పాదయాత్ర కొనసాగింది. 1500 గ్రామాల్లో పర్యటించారు. పాదయాత్ర బృందానికి అపూర్వ స్వాగతం లభించింది. వివిధ సమస్యలపై ప్రజలు పాదయాత్ర బృందానికి 90 వేల వినతులు ఇచ్చారు. నేడు సరూర్ నగర్ లో సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభ జరుగనుంది.
 • మహాజన పాదయాత్ర కాసేపటి క్రితం రామంతపూర్ కు చేరుకుంది. పాదయాత్ర బృందానికి టిడిపి నాయకులు నాయకులు మద్దతు తెలిపారు. మహిళలు బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు, రామంతపూర్ సభలో మాట్లాడుతున్న తమ్మినేని గారు మాట్లాడుతూ తెలంగాణలో సామజిక న్యాయం అమలు జరిగే వరకు మా పోరాటం ఆగదు పాదయాత్రతో మా పోరాటం అయిపోలే రేపటి నుండి అస్సలు యాత్ర ప్రారంభం అవుతుంది. దేశంలో అబద్ధం చెప్పడంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ నెంబరు వన్ మన ముఖ్యమంత్రి దండం పేడితే మన సమస్యలు పరిష్కరించడు దండ యాత్ర చేయాలి. రేపు జరగబోయే సమర బేరికి ప్రజలు లక్ష్యాలదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు.
 • మహాజన పాదయాత్ర కాసేపటి క్రితం రామంతపూర్ కు చేరుకుంది. పాదయాత్ర బృందానికి బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నిర్వహించిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుక్క రాములు మాట్లాడుతూ రేపు జరగబోయే సమర బేరికి ప్రజలు లక్ష్యాలదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు.
 • సామాజిక న్యాయంకోసం కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 17 అక్టోబర్ 2016లో మొదలైన పాదయాత్ర తెలంగాణలో 154రోజులు గా 4,100కిలోమీటర్లకు పై కొనసాగిన పాదయాత్ర నేడు హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఈరోజు సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి చేరుకుంటుంది.
 • సాయాజికన్యాయం - సమగ్రాబివృద్ధికై కొనసాగుతున్న మహాజన పాదయాత్ర నేటితో ముగియనుండటంతో రేపు జరుగబోయో 'తెలంగాణ రాష్ట్ర సంక్షేమ, సామాజిక న్యాయ సమర సమ్మేళనానికి' భారీ బహిరంగసభ నిర్వచన గురించి సోషల్ మీడియా క్షణ క్షణం అప్ డేట్లు గురించి సుందరయ్య విజ్ఝాన కేంద్రంలో ఎస్ వినయ్ కూమార్, జగదీష్, వై. విక్రమ్ పర్యవేక్షణలో మీటింగ్ నిర్వహించారు. సోషల్ మీడీయాలో ప్రసారమయ్యే లైవ్ ప్రోగామ్ లను తెలుగు ఉభయ రాష్టాల శ్రేణులు షేర్ చేయాలని పిలుపునిచ్చారు.
 • సామాజిక న్యాయమే లక్ష్యంగా కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 153వ రోజుకు చేరుకుంది. నిన్నటితో 4.103.3కి మీలు కొనసాగిన పాదయాత్ర నేడు ఘట్ కేసర్, మేడిపల్లి, బోడుప్పల్, ఉప్పల్, రామంతాపూర్, అంబర్ పేట్ మీదిగా ఏస్వీకేకు చేరుకుంటుంది. 
 • తెలంగాణలో సామాజికన్యాయం సమాగ్రాబివృద్ధికై కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 151వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం 4,037.4కి.మీల పాదయాత్ర కొనసాగింది. నేడు చిన్నకందుకూర్ స్టేజ్, పెద్ద కందుకూర్, యాదగిరిపల్లి, యాదగిరిగుట్ట, బస్వాపురం, ముత్తిరెడ్డిగూడెం, రాయగిరిలో కొనసాగనుంది.
 • సామాజిక న్యాయం-సమగ్రాభివృద్ధికై చేపట్టిన మహాజన పాదయాత్ర యాదాద్రి జిల్లాలో 150వ రోజు కొనసాగుతుంది. నేడు కాటేపల్లి, సికిందర్ నగర్, మోటకొండూరు, దిలావర్ పూర్, మంతపురి, బహుదూర్ పేట, ఆలేర్ లో పాదయాత్ర పర్యటించనుంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 4 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పైలాన్ ఆవిష్కరించారు. కేసీఆర్‌ చెబుతున్న అభివృద్ధి గ్రామాల్లో ఎక్కడ కనిపించడం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం మహాజన పాదయాత్రలో సామాజిక అంశాలు లెవనెత్తడంతో..తన సీఎం కుర్చికి ఎసరొస్తుందని కేసీఆర్ భయపడుతున్నారని ఆరోపించారు. తమ అజెండా చాలా శక్తివంతమైందన్నారు. అట్టడుగు కులాలకు సంక్షేమంతో పాటు చట్టబద్ధమైన అధికారాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
 • తెలంగాణలో సామాజికన్యాయం సమాగ్రాబివృద్ధికై కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 149వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం 3,984.1కి.మీల పాదయాత్ర కొనసాగింది. నేడు నార్కట్ పల్లి, గోకారం, లింగరాజు పల్లి, వలిగొండ, సుంకిశాల, గోలిగూడెం, పులిగిల్లలో పాదయాత్ర పర్యటించనుంది. 
 • సామాజిక న్యాయం-సమగ్రాభివృద్ధికై చేపట్టిన మహాజన పాదయాత్ర యాదాద్రి జిల్లాలో 148వ రోజు కొనసాగుతుంది. నేటికి 3,949.3కి.మీలు పూర్తి చేసుకుంది. నేడు చిన్నకొండూరు, జబ్లక్ పల్లి, కనుముల, భీమనపల్లి, భూదాన్ పోచంపల్లి, రేవణపల్లి, శివారెడ్డిగూడెం, వంకమామిడి, ధర్మారెడ్డి గూడెం, సంగెంలో పాదయాత్ర పర్యటించనుంది.
 • సామాజికన్యాయం-సమగ్రాభివృద్ధి సాధించేందుకే చేపట్టినట్టిన మహాజన పాదయాత్ర 145వ రోజుకు చేరుకుంది. నేడు పానగల్, ఉదయ సముద్రం ప్రాజెక్టు పరిశీలన, దండెంపల్లి స్టేజీ, కట్టంగూర్, ముత్యాలమ్మగూడెం, పామనగుండ్ల, ఏపి లింగోటం, నార్కట్ పల్లిలో పాదయాత్ర పర్యటించనుంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర కనగల్ కు చేరుకుంది. టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్రకు మద్దతు తెలిపారు
 • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎనిన్కల బ్యాలెట్ పేపర్ లో ఫొటోల తారుమారుపై ఆయన లేఖ రాశారు. బ్యాలెట్ పేపర్ లో 9వ సీరియల్ లో ఉన్న మాణిక్ రెడ్డి ఫొటోను మూడో సీరియల్ లోకి మార్చారని తెలిపారు. దీనిని సరిచేయకుండా ఎన్నిక నిర్వహిస్తే తమ అభ్యర్థికి నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. పొరబాటును సరిదిద్దే వరకు ఎన్నిక నిలిపివేయాలని సూచించారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 144కి రోజుకు చేరుకుంది. బుడిమర్లపల్లి, కనగల్, ధర్వేసిపురం, కొత్తపల్లి, నల్గొండలో పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం నల్గొండలో జరగనున్న బహిరంగసభకు బృందాకరత్ హాజరు కానున్నారు
 • సామాజికన్యాయం-సమగ్రాభివృద్ధి సాధించేందుకే చేపట్టినట్టిన మహాజన పాదయాత్ర 143వ రోజుకు చేరుకుంది. నేడు రాందాస్ తండా, నర్సింహులగూడెం, తుమ్మలపల్లి, చండూరు, పొనుగోడు స్టేజీ, కురంపల్లి, జి.ఎడవల్లిలో పాదయాత్ర కొనసాగనుంది.
 • సామాజిక న్యాయమే లక్ష్యంగా కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 141వ రోజుకు చేరుకుంది. ఇప్పటికి మొత్తం 3,745.8కి.మీలు కోనసాగింది. నేడు సంగారం స్టేజీ, రంగారెడ్డిగూడెం, ఘణపురంగేట్, కొనమేకలవారిగూడెం, అంగడిపేట క్రాస్ రోడ్డు, నీలనగర్, చిలకమర్రి, చిన అడిషర్లపల్లి, మల్లేపల్లి చౌరస్తాలో పాదయాత్ర పర్యటించనుంది.
 • తెలంగాణలో సామాజికన్యాయం-సమగ్రాభివృద్ధి సాధించేందుకే చేపట్టినట్టిన మహాజన పాదయాత్ర 140వ రోజు చేరుకుంది. నేడు జి.కె పహాడ్, నర్సింహులగూడెం, నిడమనూరు, 14వ వైలు రాయి అలీనగర్, హాలియా, అనుముల, లింగంపల్లి, పెద్దపూర సాగర్ చైరస్తాలో గ్రామాల్లో పర్యటించనుంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 139వ రోజుకు చేరుకుంది. నేడు శెట్టిపాలెం, మిర్యాలగూడ బైపాస్, మిర్యాలగూడ టౌన్, వెంకటాద్రిపాలెం, తుంగపహాడ్, త్రిపురారం, ముకుందాపురంలో పర్యటించనుంది.
 • మహాజన పాదయాత్ర 138వ రోజుకు చేరుకుంది. నేడు గోరెంకలపల్లి, మామిడాల స్టేజి, ఇండ్లూరు, తిప్పర్తి, శిలార్ నియాగూడెం, కొత్తగూడెం, మాడుగులపల్లి, కుక్కడం, బుగ్గబావిగూడెం, వేములపల్లిలో పర్యటించనుంది.
 • మహాజన పాదయాత్ర సూర్యపేట జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. తిమ్మపూర్ కు చేరుకున్న పాదయాత్ర భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాలి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో 93 శాతం ఉన్న సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరించి పనిచేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి తమ శక్తి ఎంటో చూపిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఎంబీసీల బతుకులు బాగుపడినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సార్థకత ఉంటుందన్నారు. దళితులకు మూడెకరాలు భూమి, రెండు పడకల ఇళ్లు, రిజర్వేషన్లు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ లేకుండా బంగారు తెలంగాణ ఎలా సాధ్యం అని పశ్నించారు.
 • సూర్యపేట్ జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. పల్లెపల్లెన కొనసాగుతున్న పాదయాత్ర బృందానికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరిగినప్పుడే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో ప్రజా పాలన సాగాలని ఆకాంక్షించారు.
 • తెలంగాణలో సామాజికన్యాయం సమాగ్రాబివృద్ధికై కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 136వ రోజుకు చేరుకుంది. 3,600.7 కి.మీలు పూర్తి చేసుకున్న పాదయాత్ర నేడు 31.4కి.మీలు కొనసాగనుంది. నేడు రామన్నగూడెం, కుంచమర్తి, తిమ్మాపురం, రాజానాయక్ తండ, ఎల్కారం ఎక్స్ రోడ్, బాలెంల, గాంధీనగర్ లో నేడు పాదయాత్ర కొనసాగనుంది. సూర్యాపేట టౌన్-జిల్లా ముగింపు సభ ఘనగాగా నిర్వహించనున్నారు.
 • తుంగతుర్తి (మం) అన్నారంలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. టిడిపి, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు.
 • సూర్యపేట్ జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర 35వ రోజు కొనసాగనుంది. నేడు యలకపల్లి, సంగెం (తుంగతుర్తి, వెలుగుపల్లి, మల్లన్నగుట్ట, బొల్లంపల్లి స్టేజ్, సీతారాంపురం, అర్వపల్లిలో మహాజన పాదయాత్ర కొనసాగనుంది. 
 • సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధి సాధించేందుకే చేపట్టినట్టు మహాజన పాదయాత్ర 134వ రోజుకు చేరుకుంది. నేడు వట్టికాంపాడ్, లక్ష్మణ్ నాయక్ తండా, దాచారం (ఆత్మకూర్ (ఎస్) మండలం), ఆత్మకూర్ ఎక్స్ రోడ్, దుబ్బగూడెం (ఎస్సీ కాలనీ), ఆత్మకూర్ (ఎస్) (మండల కేంద్రం), నెమ్మికల్, దుబ్బతండ, పాతర్లపహాడ్ ఎక్స్ రోడు, నూతనకల్ మండలం-గుండ్లసింగారం, నూతనకల్, చిల్వకుంట్లలో పాదయాత్ర పర్యటించనుంది. 
 • తెలంగాణలో సామాజికన్యాయం సమాగ్రాబివృద్ధికై కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 132వ రోజుకు చేరుకుంది. నేడు పాదయాత్ర అప్పన్నపేట, గరిపేట, ఎన్ బి నగర్, నేరేడుచర్ల రామాపురం, శాంతినగర్ కమలానగర్, పెంచికల్ దిన్నే, ముకుందాపురం, దాచారం, ఎన్.అన్నారం (పెన్ పహాడ్ మండలం)లో పర్యటించేనుంది.
 • మహాజన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. హుజూర్ నగర్ చేరిన పాదయాత్రకు బోనం, బతుకమ్మలతో పూల వర్షాలతో ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్ర బృందినికి టీపీసీసీ అధ్యక్షులు ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
 • సూర్యపేట్ జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర 131వ రోజు కొనసాగనుంది. చిలుకూరు,సీతారంపురంస్టేజ్, మాదవరేనిగూడెం, హుజూర్ నగర్ టౌన్, గోపాలపురం, రాయినిగూడెం(గరిడేపల్లి మండలం), కీతవారి గూడెంలో గ్రామాలలో నేడు పాదయాత్ర పర్యటించనుంది.
 • సామాజికన్యాయం సమగ్రాభింవృద్ధికై కొనసాగుతున్న మహాజన పాతయాత్ర 30వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది. కొసేపటి క్రితం మునగాలకు చేరుకుంది. పాదయాత్ర బృందానికి టిడిపి శ్రేణులు, పార్టి కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నిర్వహించన సభలో తమ్మినేని గారు మాట్లాడుతూ రైతులకు తెరాస ప్రభుత్వం ఒక్క పైసా నష్టపరిహారం చెల్లించలేదు. ఇందిరమ్మ ఇండ్లకు బిల్లు చెల్లించలేని ప్రభుత్వం, డబుల్ బెడ్ రూమ్ సాధ్యమవుతుందా. అందుకే నీల్, లాల్ జెండాలు ఏకం కావాలి. అని పిలుపునిచ్చారు.
 • జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర 130వ రోజు కొనసాగనుంది. నారాయణగూడెం, మునగాల, భరాఖత్ గూడెం, నడిగూడెం, ఆకుపాముల, కోదాడలో సీపీఎం బృందం పర్యటించనుంది.
 • నాయకన్ గూడెంలో సీపీఎం పాదయాత్రకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి, పొన్నాల లక్ష్మయ్యలు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తున్న సీపీఎం పాదయాత్రకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. తమ్మినేని చేపట్టిన పాదయాత్ర చారిత్రాత్మకమని, పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు.
 •  సీపీఎం మహాజన పాదయాత్ర 129వ రోజుకు చేరుకుంది. నాయన్ గూడెం, మామిళ్ల గూడెం, హుస్సేనాబాద్, మోతె, నర్సింహుల గూడెం, రేపాల, జగన్నాథపురం, తలకోవలో లో పాదయాత్ర బృందం పర్యటించనుంది.
 • తెలంగాణ సామాజిక న్యాయం కోసం కొనసాగుతున్న మహాజన పాదయాత్ర మల్లెపల్లి గ్రామానికి చేరుకుంది. గ్రామ ప్రజలు, పార్టి కార్యకర్తలు పాదయాత్ర బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. బృందం సభ్యులు తమ్మినేని గారు వాటర్ ప్లాంట్ ప్రారంభించారు.
 • సామాజిక న్యాయం కోసం తెలంగాణలో జ‌రుగుతున్న మ‌హాజ‌న పాద‌యాత్ర 128వ రోజుకు చేరుకుంది. నేడు బోదులబండ, మండ్రాజుపల్లి, చెన్నారం, రాజేశ్వరపురం, ముఠాపురం, మల్లేపల్లి గట్టు సింగారం, గంగబండ తండా, కూసుమంచి, పాలేరు గ్రామాలలో పర్యటించనుంది.
 • సామాజిక న్యాయం కోసం తెలంగాణలో జ‌రుగుతున్న మ‌హాజ‌న పాద‌యాత్ర క‌వ‌రేజ్ కి చైనా క‌మ్యూనిస్టు పార్టీ మీడియా హాజ‌రైంది. దాదాపు 4నెల‌లుగా జ‌రుగుతున్న పాద‌యాత్ర ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటు గ్రామాలు దాటుకుంటు, ప‌ట్ట‌ణాలు చుట్టి, జిల్లాల‌లో ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను అధ్య‌య‌నం చేస్తు సాగుతుంది. 9మంది సభ్యులతో సాగుతున్న పాద‌యాత్రకు ఎక్క‌డి క‌క్క‌డ ప్ర‌జ‌లు నిరాజ‌నాలు ప‌డుతున్నారు. ఒక రాష్ట్రంలో జ‌రుగుతున్న పాద‌యాత్ర‌కు మ‌రో రాష్ట్రంలోని మీడియా రావ‌డం, నేష‌న‌ల్ మీడియా క‌వ‌ర్ చేయ‌డం ప‌రిపాటి. కానీ ఈ సారి దేశం దాటి దేశం వ‌చ్చిన చైన మీడియా పాద‌యాత్ర‌ను క‌వ‌ర్ చేస్తుంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 127వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది. కాసేపటి క్రితం ముదిగొండకు చేరుకుంది. పాదయాత్ర బృందానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క మద్ధతు తెలుపుతు ఘనంగా స్వాగతం పలికారు.
 • తెలంగాణ వచ్చినా పేదల బతుకులు బాగుపడలేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ రంగాలకు కొమ్ముకాయడం తప్ప.. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీపీఎం మహాజన పాదయాత్ర 127వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఖమ్మం జిల్లాలోని తళ్లంపాడు, ఎడవల్లి, లక్ష్మీపురం, ముదిగొండ, వెంకటాపురం, గోకినేపల్లి, గువ్వలగూడెం, నేలకొండపల్లిలో పాదయాత్ర బృందం పర్యటించనుంది. ముదిగొండలో జరిగే సభకు విమలక్క హాజరుకానున్నారు.
 • సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర 127వ రోజు కొనసాగుతోంది. కి.మీ పోడవున మహాజన పాదయాత్రకు అశేష జనం అడుగడుగునా నిరాజనాలు పలుకుతున్నారు. తెల్దారుపల్లిలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించిన తమ్మినేని గారు మాట్లడుతూ సామాజిక న్యాయం సాదించడమే పాదయాత్ర లక్ష్యం అని తెలిపారు. ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. గ్రామాలో నూటికి నూరు శతాం సీపీఎం ఇది ప్రపంచ రికార్డ్, అన్నారు. అబేద్కర్ ఆశయాలు సాధించాలి అందరు సమానంగా మెలగాలి అని తమ్మినేని తెలిపారు.
 • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ ప్రజల కోసం సబ్ ప్లాన్ చట్టం చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్ డిమాండ్ చేశారు. ఖమ్మంలో కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. బోసు బొమ్మ వద్ద ఏర్పాటు చేసిన బసభలో కారత్ మాట్లాడారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ప్లానింగ్ కమిషన్ ను రద్దు చేసి బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేశారని విమర్శించారు. ప్రధాని మోడీలాగానే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మొండి వైఖరిని అవలింబిస్తున్నారని తెలిపారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 125వ రోజుకి చేరుకుంది. పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. బోసుబొమ్మ సెంటర్ వద్ద సీపీఎం మహాజన పాదయాత్రలో సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ వర్గాల ప్రజల కోసం సబ్ ప్లాన్ చట్టం చేయాలని కారత్ సూచించారు. కేంద్రంలో ప్రధాని మోడీ ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి కేంద్రంలో ప్రధాని మోడీ ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి బడుగు, బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. మోడీ లానే కేసీఆర్ కూడా మొండి వైఖరి అవలింబిస్తున్నారని తెలిపారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.
 • సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. 121వ రోజుకు చేరిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. వైరా (రింగ్ రోడ్డు), సోమవరం, తాటిపుడి, జింకలగూడెం, రెబ్బవరం, గొల్లపూడి, పాలడుగు, బోనకల్ క్రాస్ రోడ్డు బ్రాహ్మణపల్లిలో నేడు పాదయాత్ర బృందం పర్యటించనుంది.
 • ప్రజలు దావత్ కాదు.. జీవితాలు దిగజరిపోతుంది. భూములు పంచకుండా లాకుంటుంది. ఐదు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. ప్రజలకు ఉండడానికి ఇళ్లు లేదు. కానీ కెసిఆర్ 150 గదుల ఇళ్లు కట్టుకున్నారు. అందులో మరి బుల్లెట్ ప్రూఫ్ బాత్రూం ఎందుకని దుయ్యబట్టారు. దళితుని ముఖ్యమంత్రి చేయలేదు. దళిత, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు. కేజీ టూ పీజీ ఉచిత విద్య లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు ప్రశ్నించాలి. నిలదీయాలి. సమాజంలో కులాలు ఎక్కువ, తక్కువలు ఉన్నాయి. కుల అసమానతలు పోవాలి. అందరికి సమానమైన  అవకాశాలు కల్పించాలి అని తెలిపారు.
 • సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా ఖానాపురంలో 120వ రోజు పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఖానాపూరంలో తమ్మినేని గారు మాట్లాడుతూ ప్రజల బతుకుల్లో మార్పు వచ్చే విధంగా విధానాన్ని మార్చాలని అన్నారు. ప్రజల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అన్నారు.
 • మహబూబాబాద్ జిల్లా సీపీఎం నేత కామ్రేడ్ నున్నా నారాయణ చిత్రపటానికి పూలామాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన కుటుంబాన్ని తమ్మినేని బృందం పరమర్శించారు. పాదయాత్ర బృందం సభ్యుడు ఎండి అబ్బాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే కష్టాలు పోతాయి అన్నారు. కాని రాష్ట్రం వచ్చినా కష్టాలు మాత్రం పోలేదు. బంగారు తెలంగాణా కావాలంటే సకల జనుల సమస్యలు పరిస్కరించాటమే నిజమైన బంగారు తెలంగాణ అని తెలిపారు.
 • మహాజన పాదయాత్ర ఖమ్మం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్ర బృందానికి ప్రముఖ విద్య వేత చుక్క రామయ్య గారు సంఘీభావం తెలిపారు.
 • మహాజన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. 120వ రోజు హవేలి నుంది బయల్దేరిన పాదయాత్ర బృందానికి హవేలి టేకులపల్లిలో టిడిపి కార్యకర్తలు పెద్ద ఏతున్న మద్దతు తెలిపారు. టిఎన్ఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షులు సుమంత్ సంఘీభావం తెలిపారు.
 • తెలంగాణలో సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధి కోసం జరుగుతున్న మహాజన పాదయాత్ర 120వ రోజు కు చేరుకుంది. నేడు ఖానాపురం, టేకులపల్లి, రోటరీ నగర్, శ్రీశ్రీ విగ్రహం, వెంకటాయపాలెం, తనికెళ్ల, కొణిజర్ల, పల్లిపాడు లో పాదయాత్ర పర్యటించనుంది. మొత్తం 3,177.3కి.మీలు పూర్తి చేసుకున్న పాదయాత్ర నేడు 29.1కి.మీలు కొనసాగునుంది.
 • జిల్లాలో మహాజన పాదయాత్ర జోరుగా సాగుతోంది. 119వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం 3,148.2 కి.మీలు పూర్తి చేసుకున్న పాదయాత్ర నేడు 25.8కి.మీలు కొనసాగనున్న పాదయాత్ర జాస్తిపల్లి, సాతానుగూడెం, పండితాపురం, బూడిదంపాడు, మంచుకొండ, రఘనాధపాలెం, పాండురంగాపురంలో పర్యటించనుంది.
 • సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న మహాజన పాదయాత్ర..118వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని ఉసిరికాయపల్లి, భాగ్యనగర్‌తండా, కామేపల్లి, బొక్కలతండా, విశ్వనాథపల్లి, కారేపల్లి గ్రామాలగుండా కొనసాగుతోంది. స్థానిక సమస్యలపై గ్రామస్తులు పెద్ద ఎత్తున వినతిపత్రాలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు సమర్పిస్తున్నారు.
 • జిల్లాలో మహాజన పాదయాత్ర జోరుగా సాగుతోంది. 117వ రోజుకు చేరుకున్న యాత్రలో వామపక్షాల కార్యకర్తలు, దళితసంఘాల నేతలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పటికే 24జిల్లాల్లో పూర్తయిన యాత్రలోప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 
 • సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ధ్యేయంగా తెలంగాణలో చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 116వ రోజుకు చేరుకుంది. చాతకుంట, ఎర్రగుంట, నవభారత్, మంచికంటి నగర్, ఇల్లందు క్రాస్ రోడ్ అనిశెట్టిపల్లి, బొమ్మనపల్లి, సులానగర్, టేకులపల్లి గ్రామాలలో నేడు పాదయాత్ర పర్యటించనుంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 115వ రోజుకు చేరుకుంది. తుంగారం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. రాఘవాపురం, సుజాతనగర్, వేపలగడ్డ, సర్వారం, పోస్టాఫీస్ సెంటర్, సూపర్ బజార్, లక్ష్మీదేవిపల్లిలో పాదయాత్ర కొనసాగనుంది. 
 • సామాజిక న్యాయం సమగ్రాభివృద్దికై కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 114వ రోజు కొనసాగుతుంది. నేడు గుండెపుడి, రామచంద్రాపురం, అనంతారం, గాంధీనగర్ తండ, పోకలగూడెంరావికంపాడు, చండ్రుగొండ, తిప్పనపల్లి, రేపల్లెవాడ, తుంగారంలో పాదయాత్ర పర్యటించనుంది.
 • మహాజన పాదయాత్ర 113 వ రోజు కు చేరుకుంది. తల్లాడ నుంచి ప్రారంభమైన పాదయాత్ర అన్నారుగూడెం, నర్సింహారావుపేట, గార్లఒడ్డు, ఏన్కూర్, హిమామ్ నగర్, వినోభానగర్ (జూలూరుపాడు మండలం, కొత్తగూడెం జిల్లా ప్రవేశం), జూలూరుపాడు, ఫంక్షన్ హాల్ లో నేడు పర్యటించనుంది.
 • సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ధ్యేయంగా తెలంగాణలో చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 112 రోజులు పూర్తి చేసుకుంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పర్యటిస్తున్న యాత్ర ఈ రోజు 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. మూడు వేల కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా తల్లాడలో సీపీఎం ఫైలాన్‌ను ఆవిష్కరించనున్నారు.
 • సీపిఎం మహాజన పాదయాత్ర 112వ రోజు కొనసాగుతుంది. పాదయాత్రలో పాల్గోన్న కల్లూరు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ప్రజల జీవితాలు మారలేదు. ప్రజలను ఉద్ధరించే తెలంగాణ కావాలి. అదే సామాజిక తెలంగాణ కావాలి. దేశంలో పరిస్థితులు ఇదే రకంగా ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రుణాలను మాపి చేయడం లేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. కనీసం ఆరువేల ఉద్యోగాలు రాలేదు. మోడీ పాలనా మదనష్టపు పాలనా. నోట్లు రద్దు చేశారు. వేలిముద్రాలతో డబ్బులు మార్పిడి చేసి పేదలను దోచుకోవలని మోడీ కుట్రా పన్నుతున్నారు. మన సొమ్ము దోచుకోవడానికే. దళితులు, ఆదివాసీల పరిస్థితి దారుణం. వీళ్ళఫై జరుగుతున్న వాటిని ప్రశ్నించేవాడు లేడు. ప్రశ్నించడానికే పాదయాత్ర కోనసాగుతుంది. అని తెలిపారు.
 • 112 వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర వీఎం బంజర నుండి కొనసాగుతోంది. టేకుపల్లి, రామకృష్ణాపురం, కల్లూరు, నూతన్ కల్, అంజనాపురం, తల్లాడలో పాదయాత్ర కొనసాగనుంది.
 • సామాజిక న్యాయం సమగ్రాభివృద్దికై కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 111వ రోజు కొనసాగుతుంది. కాసేపటి క్రితం సత్తుపల్లి చేరుకుంది. పాదయాత్ర బృందానికి టిడిపి నాయకులు ఎస్ఎప్ఐ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఎంఎల్ఏ వెంకటవీరయ్య గారు మద్దతు తెలిపారు. తమ్మినేని గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ఎస్సి.ఎస్టి.బిసీ,మైనారిటీలు అభివృద్ధి చేందాలని పాదయాత్ర కోనసాగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ విద్యావైద్యం అందుబాటులో లేదు.అని తమ్మినేని వీరభద్రంగారు పేర్కొన్నారు.
 • జిల్లాలో 111వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభమైంది. సత్తుపల్లి, కిష్టారం, లంకపల్లి, మండాలపాడు, వీఎం బంజరలో పాదయాత్ర జరగనుంది.
 • జిల్లాలో కోనసాగుతున్న మహాజన పాదయాత్ర గంగారంలో నిర్వహించిన సభలో తమ్మినేని గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ కూడా బంగారు తేలంగాణ అడుగుతలేరు బతుకు తేలంగాణ అడుగుతున్నారు. అని తెలిపారు. బిడ్డ బతుకమ్మ పేరుతో విదేశాలు తిరుగుతుంది తండ్రి గుళ్ళూ గోపురాల పేరుతో ప్రజల సోమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. సామాజిక తెలంగాణ సాధించడమే సిపిఎం లక్ష్యం దానికోసం అన్ని శక్తులను ఏకంచేస్తాం. అట్టడుగు ప్రజల మార్పు కోసం పాలన సాగించు కేసీఆర్ లేదంటే నిన్ను మారుస్తాం అని తమ్మినేనిగారు పేర్కోన్నారు.
 • జిల్లాలో మహాజన పాదయాత్ర కొనసాగుతుంది. గంగారంలోకి ప్రవేశించిన పాదయాత్ర కు ఘనంగా స్వాఘతం పలికారు. గంగారంలో నిర్వహించిన సభలో జాన్ వెస్లీ గారు మాట్లాడుతూ దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానం ఇంటోకో ఉద్యోగం అన్నాడు. ఆశపడి ప్రజలు ఓట్లు వెశారు. కాని అటువంటి ఉసే లేదు అని తెలిపారు. ఊరికో కోడీ ఇంటికో ఈక అనే పద్దతి లో కేసీఆర్ పాలన కోనసాగుతుంది. మూడుఎకరాల భుమి ఇవ్వకపోతే ప్రభుత్వ భూమిలో ఎర్ర జెండా లు పాతుతాం అని జాన్ వెస్లీ పేర్కోన్నారు.
 • మహాజన పాదయాత్ర 110వ రోజుకు కొనసాగుతుంది. కాసేపటి క్రితం ఖమ్మం జిల్లాలోని గంగారం గ్రామంలోకి ప్రవేశించింది. నీల్ లాల్ జండాలతో పాదయాత్ర బృందానికి ఘనంగా స్వాగతం పలికారు.
   
 • సామాజిక న్యాయం సమగ్రాబివృద్దికై కోనసాగుతున్న మహాజన పాదయాత్ర విజయవంతంగా కోనసాగుతుంది. తమ్మినేని గారు మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బదులు పడుతున్నారు. ఇది ప్రజల ప్రభుత్వం కాదు. దొరల ప్రభుత్వం. ఓట్లు వేస్తే మన పని ఐపోయినది అనుకోకుండా మనకు రావాల్సిన హక్కుల కోసం ఉద్యమం చేయాలి. అన్నింటిలో సమ న్యాయం కోసమే పాదయాత్ర. మార్చి 19న హైదరాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో లక్షలాదిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
 • తెలంగాణ సమగ్రాభివృద్ధికై కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 110వ రోజుకు చేరుకుంది. నేడు నారంవారి గూడెం, అచ్చుతాపురం, మందలపల్లి, ముష్టిబండ, గంగారంలో కోనసాగుతున్న పాదయాత్ర ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టనుంది. గత కొన్ని రోజులుగా పాదయాత్ర జరుపుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే.
 • మహాజన పాదయాత్ర 109వ రోజు కొనసాగుతుంది కాసేపటి క్రితం జమ్మిగూడెంకు చేరుకున్న పాదయాత్రకు ఆంధ్రప్రదేశ్ సీపీఎం కార్యవర్గ సభ్యులు మంతిన సీతారాం, అర్ సత్యనారాయణ రాజ్, ఏ రవి, టీ రామకృష్ణ, బేతాళ శ్రీనివాస్, జె సత్యనారాయణ, కె శ్రీనివాస్ తదితరులు సంఘీభావం తెలిపారు. మంతిన సీతారాం రాజ్ మాట్లాడుతూ రాబోయే కాలంలో భవిష్యత్ కమ్యూనిస్టులదే అని తెలిపారు.
 • తెలంగాణ సమగ్రాభివృద్ధికై కొనసాగుతున్న మహాజన పాదయాత్ర పెద్ద గోలగూడెంనికి చేరుకుంది. కాంగ్రేస్ నాయకులు ఉమామహేశ్వ గారు సంఘిభావం తెలిపారు. అక్కడ నిర్వహించిన సభలో తమ్మినేని గారు మాట్లాడుతూ ప్రాణం పోయిన సరే భూములు మాత్ర వదలం అని హెచ్చరించారు.
 • సామాజిక న్యాయం సమగ్రాభివృద్దికై కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 109వ రోజుకు చేరుకుంది. నేడు కొత్తూరు, పార్కలగండ, పెద్దగొల్లగూడెం, మల్కారం, రాచూరుపల్లి, జమ్మిగూడెం, కేశప్పగూడెం, ఊట్లపల్లి, అశ్వారావుపేట లో పర్యటించనుంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 108వ రోజుకు చేరుకుంది ముల్కల పల్లి నుండి బయలు పాదయాత్ర జగన్నాథపురంకి చేరుకుంది. పాదయాత్ర బృందానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ కన్వీనర్ సొంది వీరయ్య సంఘీభవం తెలిపారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 108వ రోజుకు చేరుకుంది. నేడు జగన్నాథపురం, కొత్త గంగారం, అంకంపాలెంలో పాదయాత్ర కొనసాగనుంది.
 • ఖమ్మం జిల్లాలో ఉన్న కేసీఆర్ దమ్ముంటే నాతో చర్చలకు రావాలని తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. టీఆర్ ఎస్ నేతలు మాపై ఆరోపణలు చేసి చర్చలకు రాకుండా పారిపోయారని తమ్మినేని విమర్శించారు.
 • మహాజన పాదయాత్ర 67వ రోజు పాల్వంచ పట్టణం ప్రారంబమైయింది. పాదయాత్ర బృందానికి మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులూ వనమా వెంకటేశ్వరావ్, ఎడవల్లి కృష్ణ కాంగ్రెస్ జిల్లానాయకులు, యువజన సంగం నాయకులు రాఘవ సంఘిభావం తెలిపారు. 
 • సామాజిక న్యాయం సమగ్రాభివృద్దికై కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 107వ రోజుకు చేరుకుంది. పాదయాత్ర  పాల్వంచ(బస్టాండ్), శ్రీనివాస కాలనీ, సీగారామపురం, పూసుగూడెం, మాదారం, ముల్కలపల్లిలో నేడు పర్యటించనుంది. 
 • సీపీఎం మహాజన పాదయాత్ర 106వ రోజుకు చేరుకుంది. మండల కేంద్రం బూరంపాడులో విద్యార్థులు..ఆటో వర్కర్స్..ఎమ్మార్పీఎస్, సీపీఐ, ఇతర సామాజిక సంఘాలు ఘన స్వాగతం పలికాయి.
 • బూరంపాడు లో మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాదయాత్ర బృంద సభ్యులు అబ్బాస్ మాట్లాడారు. మహిళా దళిత ఉపాధ్యక్ష ఎంపీపీని అగ్ర కులాలు లెక్క చేయడం లేదని విమర్శించారు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉందని, అందుకే తెలంగాణలో సామజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నామన్నారు. పాలక ప్రభుత్వాలపై ఎర్రజెండా ఎత్తి తిరగబడాలి అని పిలుపునిచ్చారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 106వ రోజుకు చేరుకుంది. నేడు సారపాక, రెడ్డిపాలెం, బూరంపాడు, మోరంపల్లి బంజారా, పినపాక, నాగారం, జగన్నాథపురంలో పాదయాత్ర కొనసాగనుంది. 
 • మహాజన పాదయాత్ర 105వ రోజుకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. జిల్లాలోని గంగోలు, సీతారామపురం, నర్సాపురం, తూరపాక, సన్నాయిగూడెం, ఏటపాకలో కొనసాగిన పాదయాత్ర కాసేపటి క్రితం భద్రాచలంలో అడుగుపెట్టింది. పాదయాత్ర బృందానికి ఘనంగా స్వాగతం పలికారు.
 • సామాజిక న్యాయం సమగ్రాభివృద్దికై కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 105వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు మొత్త 2,774.9కి.మీలు కోనసాగింది. నేడు గంగోలు, సీతారాంపురం, నర్సాపురం, తూరుబాక, కన్నాయిగూడెం, ఏటపాక, భద్రాచలంలో నేడు పాదయాత్ర పర్యటించనుంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 104వ రోజుకు చేరుకుంది. నేడు ఆర్.కొత్తగూడెం, కుదులూరు, మామిడిగూడెం, రాళ్లగూడెం, సీతానగరం, బండిరేవు, పెద్దనల్లబెల్లి, చిననల్లబెల్లి, బైరాగులపాడు, లక్ష్మీనగర్ లలో పాదయాత్ర కొనసాగనుంది.
 • సామాజిక న్యాయం తెలంగాణ సమగ్రాభివృద్ధికై కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 103వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం 2,723.4 కి.మీలు కొనసాగింది. ఈరోజు మణుగూరు లో అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి బయలు దేరిన పాదయాత్ర బృందం శివలింగాపురం, రాజుపేట, మల్లేపల్లి పార్కు, గోదావరిఒడ్డు నుంచి ముమ్మిడివరం(చర్ల), కొత్తగట్ల, గుమ్ముగూడెం క్రాస్ రోడ్డు, తేగడ, గుంపెనగూడెం, చర్ల, సత్యనారాయణపురంలో పాదయాత్ర బృందం నేడు పర్యటించనుంది.
 • సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధి కై కొనసాగుతున్న మహాజన పాదయాత్ర  కాసేపటి క్రితం మణుగూరు గ్రామానికి చేరుకున్న పాదయాత్ర బృందానికి ఘనంగా పార్టీ కార్యకర్తలు  స్వాగతం పలికారు. 
 • సీపీఎం మహాజన పాదయాత్ర 102వ రోజు కొనసాగుతోంది. ఈరోజు దుగినేపల్లి(పినపాక), శేగర్షల, జానంపేట, పాండురంగాపురం, ఐలాపురం, బయ్యారం క్రాస్ రోడ్, సాంబాయిగూడెం (మణుగూరు), రామానుజవరం, మణుగూరు(అంబేద్కర్ సెంటర్)లో పాదయాత్ర పర్యటించనుంది.
 • సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధి కై కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 101రోజు చేరుకుంది. ఈరోజు మల్లూరు, కొత్త మల్లూరు, చుంచుపల్లి, పాపాయిగూడెం, వాడగూడెం, రమణక్కపేట, రాజుపేట, బహ్మణపల్లి గ్రామాలలో పాదయాత్ర బృందం పర్యటించనుంది.
 • తెలంగాణ సీఎం కేసీఆర్‌ తప్పుడు కేసులు పెడుతూ గిరిజనుల్ని వేధిస్తున్నారని... బృందాకరత్‌ ఆరోపించారు. సీపీఎం మహాజన పాదయాత్రవందోరోజుకు చేరింది.. భూపాలపల్లిలో పాదయాత్ర బృందానికి అపూర్వ స్వాగతం లభించింది.. ఐటీడీఏ ఏటూరునాగారం, రామన్నగూడెం, రాంనగర్‌, కమలాపురంలో కొనసాగుతున్న పాదయాత్రకు సీపీఎం జాతీయ నేత బృందాకారత్‌ హాజరయ్యారు.. పాదయాత్ర బృందానికి బోనాలు, డప్పు చప్పుల్లతో స్థానికులు స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా బృందాకరత్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ పెద్ద నేరస్తుడని... చట్టాన్ని ఉల్లంఘించి గిరిజన భూముల్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు.. ఎర్రజెండాలను ఆపాలంటూ ప్రకటనలు చేస్తున్నారని... ఇంతమంది ప్రజల అభిమానం పొందిన ఎర్రజెండాలను ఎవరు ఆపుతారని ప్రశ్నించారు.
 • తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పాదయాత్ర 99వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా ఈ రోజు తాడ్వాయి, చెన్నబోయినపల్లిలో పాదయాత్ర కొనసాగుతోంది. సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆదివాసీలను అడవి నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తోందని, ఇది సరికాదని పాదయాత్ర బృంద సభ్యుడు నైతం రాజు పేర్కొన్నారు.
 • సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధికై కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 97వ రోజుకు చేరుకుంది. మొత్తం 2,560కి.మీ కొనసాగిన పాదయాత్ర ఈరోజు వెల్దూర్తిపల్లి, బుద్దారం, శాంతరాజుపల్లి, కేశవపూరం, నర్సాపురం, పాపయ్యపల్లి, బండారుపల్లి, ములుగు గ్రామాలలో 26.7కి.మీలు పర్యటించనుంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర కాసేపటి క్రితం భూపాలపల్లికి చేరుకుంది. ఈ సందర్బంగా అంగన్ వాడీ, సీఐయూటీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 96వ రోజు కొనసాగుతోంది. కాసేపటి క్రితం భూపాలపల్లి (జయశంకర్) జిల్లాలో అడుగు పెట్టింది. ఈ సందర్భంగా టిడిపి వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ స్వాగతం పలికారు.
 • భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ కుమ్మక్కు అయ్యారని సీపీఎం మహాజన పాదయాత్ర బృంద రథసారధి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. చెల్పూరుకు చేరుకున్న అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
 • రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజలు అభివృద్ధి చెందాలని మహాజన పాదయాత్ర బృంద సభ్యుడు అబ్బాస్ పేర్కొన్నారు. చెల్పూరుకు చేరుకున్న అనంతరం ఏర్పాటు చేసిన సభలో అబ్బాస్ మాట్లాడారు. కనీసం రెండుపూటల తిండి తినలేని పరిస్థితిలో ప్రజలున్నారని తెలిపారు.
 • 96వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం కొనసాగిన పాదయాత్ర లక్ష్మారెడ్డిపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా బీసీ కాలనీలో నెలకొన్న సమస్యలను మహిళలు పాదయాత్ర బృందానికి తెలియచేశారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 96వ రోజుకు చేరుకుంది. లక్ష్మారెడ్డి పల్లి, మోరంచపల్లి, చెల్పూర్, కందూర్ పల్లి, మంజూర్ నగర్, భూపాలపల్లి, బస్వరాజుపల్లిలో పాదయాత్ర పర్యటించనుంది.
 • 95వ రోజు మహాజన పాదయాత్ర పరకాలలో అమరాధమం తెలంగాణ సాయూద పోరాట యోధులకు నివాళి అర్పించి బయలు దేరిన పాదయాత్ర బృందం భుపాలపల్లి (జయశంకర్) జిల్లా లో అడుగుపెట్టింది. పాదయాత్ర బృందానికి పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు వైస్అర్ సీపి కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
 • సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధికై కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 95వ రోజుకు చేరుకుంది. పాదయాత్రలో నేడు  రేగొండ, నారయణపురం, కొత్తపల్లి, భాగిర్తిపేట, గణపురం ఎక్స్ రోడు, కర్కపల్లి, చెల్పూర్లో  గ్రామాలలో పర్యటించనుంది. 
 • మహాజన పాదయాత్ర 94వ రోజు విజయవంతముగా కొనసాగుతుంది. కాసేపలి క్రితం పత్తిపాకకు చేరుకుంది. పాదయాత్ర బృందానికి టిడిపి నాయకులు మద్దతు తెలుపుతు ఘనంగా స్వాఘతం పలికారు.
 • సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధి కై కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 94వ రోజుకు చేరుకుంది.  ఈరోజు నీరుకుళ్ల, పత్తిపాక, జోగంపల్లి, పెద్దకొడెపాక, పరకాలలో పాదయాత్ర కొనసాగనుంది. 
 •  సీపీఎం మహాజన పాదయాత్ర 93వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వరంగల్‌లోని కొన్ని గ్రామాలలో మహాజన బృందం పాదయాత్ర కొనసాగింది. కాగా రోహిత్‌ వేముల వర్ధంతి సందర్భంగా ఆయనకు సీపీఎం నేతలు నివాళులు అర్పించారు. బీజేపీ మతోన్మాద చర్యలు రోహిత్‌ మరణానికి కారణమని.. సంబంధిత బాధ్యులను వెంటనే శిక్షించాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు.
 • మహాజన పాదయాత్ర 93వ రోజు కొనసాగుతుంది. 93వ రోజు నర్సంపేట నుంచి బయలుదేరిన పాదయాత్ర మహేశ్వరం, లక్నేపల్లి, గిరినిబాయి, నాచినపల్లి, రేబల్లె, వెంకటాపూర్, దుగ్గొండి, లక్షిపురం, కేశవాపురం, పెంచికలపేటలో కొనసాతుంది.
 • సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో చేపట్టిన మహాజన పాదయాత్ర శుక్రవారం నాటికి 90 రోజులు పూర్తి చేసుకుంది. గతేడాది అక్టోబర్‌ 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైన పాదయాత్ర మానుకోట జిల్లాకు చేరింది. ఇప్పటి వరకు 875 గ్రామాల్లో పర్యటన పూర్తయింది.
 • ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు కట్టిపెట్టాలనీ, పాదయాత్ర ముగిసేలోగా పరిశ్రమ ఏర్పాటు ప్రకటన రాకపోతే మానుకోట కేంద్రంగా ఉద్యమం ప్రారంభిస్తామని మహాజన పాదయాత్ర రథసారథి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. మహబూబాబాద్‌ జిల్లా గార్లలో శుక్రవారం విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు.
 • ఈ రెండున్నరేండ్ల టీఆర్‌ఎస్‌ పాలన చూస్తుంటే రియల్టర్లు, కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా ఉందని రాజకీయ జేఏసీ చైౖర్మెన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ విమర్శించారు. సామాజిక న్యాయం సాధించాలంటే ప్రజలు సంఘటితం కావాలని.. కులాలు, ఆస్తులు, అంతస్తుల ఆధారంగా సాగుతున్న వివక్షను రూపుమాపినప్పుడే సామాజిక న్యాయం సాధించినట్టు అవుతుందని అన్నారు. సీపీఐ(ఎం) మహాజన పాదయాత్ర శుక్రవారం గార్ల నుంచి బయలుదేరి మహబూబాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా గాంధీ పార్కులో పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో కోదండరామ్‌ ప్రసంగించారు.
 • సీపీఐ(ఎం) మహాజన పాదయాత్ర  గార్ల గ్రామానికి చేరుకుంది. పార్టీ కార్యకర్తలు నేతలు పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. ముందుగా సున్నం రాజయ్య గారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. గార్ల గ్రామంలో భహిరంగ ఏర్పాటు చేశారు. సభకు భారీగా ప్రజలు పాల్గొన్నారు. 
 • పాదయాత్ర బృందానికి మల్లు స్వరాజ్యం, సీపీఎం ఎంఎల్ ఏ సున్నం రాజయ్య పాల్గొని సంఘీబావం తెలిపారు. ఈసందర్భంగా అక్కడి వారు వినూత్నంగా పాదయాత్ర బృందానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. 
 • సీపీఐ(ఎం) మహాజన పాదయాత్ర గార్ల గ్రామానికి చేరుకుంది. పార్టీ కార్యకర్తలు నేతలు పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. ముందుగా సున్నం రాజయ్య గారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. గార్ల గ్రామంలో భహిరంగ ఏర్పాటు చేశారు. సభకు భారీగా ప్రజలు పాల్గోన్నారు.
 • పాదయాత్ర బృందానికి మల్లు స్వరాజ్యం, సీపీఎం ఎంఎల్ ఏ సున్నం రాజయ్య పాల్లోని సంఘీబావం తెలిపారు. ఈసందర్భంగా అక్కడి వారు వినూత్నంగా పాదయాత్ర బృందానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. 
 • ప్రజల్లో ప్రశ్నించే ఆలోచన రావాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, మహాజన పాదయాత్ర బృంద రథసారధి తమ్మినేని పిలుపునిచ్చారు. డోర్నకల్ చేరుక్ను అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పాలకులు పని చేయకపోతే వాళ్ల మెడలు వంచి పని చేయించే సత్తా పార్టీకి ఉందన్నారు. తెలంగాణ లో సామాజిక న్యాయం వచ్చే వరకు పోరాడుతామని మరోసారి స్పష్టం చేశారు.
 • 88వ రోజు చిల్కోడులో ప్రాంరభమైన న పాదయాత్ర కొనసాగుతోంది. డోర్నకల్ చేరుకున్న అనంతరం టిడిపి, కాంగ్రెస్ పార్టీల నేతలు పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు.
 • స్వంత గ్రామమైన గొల్లచర్లలో పాదయాత్ర చేస్తుండడం సంతోషంగా ఉందని పాదయాత్ర బృంద సభ్యులు ఎం.వి.రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృందాన్ని రమణ కుటుంబసభ్యులు సత్కరించారు.
 • ఎవడి అబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నావు అంటూ కేసీఆర్ ను ఉద్ధేశించి పాదయాత్ర బృంద సభ్యుడు అబ్బాస్ ప్రశ్నించారు. గొల్లచర్లకు చేరుకున్న అనంతరం ఆయన మాట్లాడారు.
 • 88వ రోజు జిల్లాలోని చిల్కోడు నుండి పాదయాత్ర కొనసాగింది. కాసేపటి క్రితం గోల్లచర్లకు చేరుకుంది. ఈసందర్భంగా అక్కడి వారు వినూత్నంగా పాదయాత్ర బృందానికి స్వాగతం పలికారు. గోడుగులతో మహిళలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 88వ రోజుకు చేరుకుంది. చిల్కోడు, గొల్లచర్ల, బోరింగ్ తండా, కాంప్లాతండా, గార్లలో పాదయాత్ర జరగనుంది.
 • తెలంగాణ రాష్ట్రం పాలకులు ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదని పాదయాత్ర బృంద సభ్యుడు యం.వి.రమణ పేర్కొన్నారు. అబ్బాయిపాలెంకు చేరుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. డబుల్ బెడ్ రూం, మూడెకరాల భూమి తదితర హామీలు నెరవేర్చలేదన్నారు.
 • మహబూబాబాద్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. 87వ రోజు ప్రారంభమైన పాదయాత్ర కాసేపటి క్రితం అబ్బాయిపాలెంకు చేరుకుంది. మొత్తంగా 2300 కి.మీటర్ల మేర పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు.
 • కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీ డిజైన్ చేస్తున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. అవసరం లేని చోట కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్నారని, 123 జీవో ద్వారా భూ నిర్వాసితలను ప్రభుత్వం దగా చేసిందన్నారు. భూ నిర్వాసితులకు మార్కెట్ ధర కంటే నాలుగు రెట్లు ఎక్కువ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగిందని, ఎన్నిసార్లు పోలీసులను రెచ్చగొట్టామో సూదులతో పొడిచామో వారే చెప్పాలన్నారు. ప్రాజెక్టులు..పరిశ్రమలకు సీపీఎం వ్యతిరేకం కాదన్నారు.
 • మరిపెడ నుండి సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగింది. 86 రోజులు పూర్తి చేసుకుంది. తిరుమలాయపాలెం (మం) ఇస్లావత్ తండాలో సీపీఎం మహాజన పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. 87వ రోజు అబ్బాయిపాలెం అంబేద్కర్ విగ్రహం, గాలివారిగూడెం తండా, ఎల్లారిగూడెం క్రాస్ రోడ్, పురుషోత్తమయ్యగూడెం, తండా ధర్మారం, లక్ష్మ తండా, రాంచంద్రునాయక్ తండా, రేకుల తండా సీరోలు, కాంపెల్లి, పెరుమాండ్ల సంకీస లో పర్యటించనుంది.
 • దొరల రాజ్యం పోయి పేదోడి రాజ్యం రావాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, పాదయాత్ర బృంద రథసారధి తమ్మినేని పేర్కొన్నారు. ఎల్లంపేట సభలో తమ్మినేని మాట్లాడారు. ఒకేసారి రైతు రుణమాఫీ చెయ్యాలని, మహబూబాబాద్ లో ఐడీటీఏ ఏర్పాటు చేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు.
 • ఓట్లు మనవి సీట్లు వాళ్ళవా అంటూ సీపీఎం మహాజన పాదయాత్ర బృంద సభ్యుడు శోభన్ నాయక్ ప్రశ్నించారు. ఎల్లంపేటకు చేరుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. గిరిజనుల భుముల జోలికి వస్తే సహించది లేదని హెచ్చరించారు. భూమి పుట్టినప్పుడే గిరిజనుడు పుట్టాడని, భూమిపై గిరిజనులకే హక్కు ఉందని మరోసారి స్పష్టం చేశారు.
 • మహబూబాబాద్ జిల్లాలో పాదయాత్ర నిరాఘాటంగా కొనసాగుతోంది. జోగయ్యతండాకు చేరుకున్న అనంతరం ఎల్ హెచ్ పీఎస్ నాయకులు సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు.
 • పాదయాత్ర పెద్దనాగారంకు చేరుకుంది. అక్కడ టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి ఘన స్వాగతం పలికారు. సామాజిక న్యాయం కోసం సకల శక్తులు ఏకం కావాలని తమ్మినేని పిలుపునిచ్చారు.
 • కింది కులాలకు రాజ్యాధికారం రావాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, పాదయాత్ర బృంద రథసారధి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కుల కులాల మధ్య తేడాలున్నాయని, అందరం కలసి వుంటే రాజ్యం మనదేనన్నారు.
 • తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఉద్యోగాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైందని మహాజన పాదయాత్ర బృంద సభ్యుడు ఆశయ్య పేర్కొన్నారు. బీరిశెట్టి గూడెంలో ఆయన మాట్లాడారు. అత్యంత వెనకబడిన కులాల ఫెడరేషన్ లకు రుణాలు ఇవ్వడం లేదని, 1200 మంది విద్యార్థులు అమరులయ్యారని పేర్కొన్నారు. ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పోరాడితేనే తెలంగాణ వచ్చిందన్నారు.
 • సీఎం కేసీఆర్ చెప్పిన డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవేనా అని గుడిసెను చూపిస్తూ తమ్మినేని విమర్శించారు. దంతపల్లి నుండి మొదలైన యాత్ర పడమటిగూడెంలో పర్యటిస్తోంది.
 • మహబూబాబాద్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. 86వ రోజు దంతల పల్లి నుండి బృందం బయలుదేరింది. పడమటిగూడెంలో పల్లి పంటను పాదయాత్ర బృందం పరిశీలించింది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 86వ రోజుకు చేరుకుంది. నేడు పడమటిగూడెం, భీరిశెట్టిగూడెం, నర్సింహుల పేట స్టేజీ, పెద్దనాగారం, గోపతండా, ఎల్లంపేట స్టేజీ, మరిపెడ గురుకుల స్కూల్, వీరారం తండా, మరిపెడ బస్టాండ్ సెంటర్ లలో పాదయాత్ర జరగనుంది.
 • పాదయాత్ర జనగామ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాలోకి అడుగుపెట్టింది. నాయకులు, కార్యకర్తలు, సామాజిక సంఘాల కార్యకర్తలు.. నీల్ లాల్ జెండాలతో ఘనంగా స్వాగతం పలికారు. 
 • వావిలాలలో జరిగన సభలో తమ్మినేని ప్రసంగించారు. 93శాతంగా ఉన్న ప్రజలు అన్ని రంగాల్లో అభివ్రుద్ధిలోకి వచ్చే వరకు సామాజిక సమరం కొనసాగుతుందని తమ్మినేని తెలిపారు. 
 • వావిలాల చేరుకున్న మహాజన పాదయాత్ర.. స్థానికంగా ఉన్న సీతారామరాజు విగ్రహానికి దళ సభ్యులు నైతం రాజు పూలమాల వేసి నివాళి అర్పించారు. 
 • మహాజన పాదయాత్ర 85వ రోజు ప్రారంభమయ్యింది. దళ సభ్యలతో పాటూ లాల్, నీల్ జెండాలతో పాదయాత్ర వడివడిగా దూసుకుపోతోంది. 
 • కేసీఆర్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మహిళా నాయకురాలు ఎస్వీ రమ డిమాండ్ చేశారు. 
 • దరుదపురం సీపీఎం సర్పంచ్ జాహ్నవి సంఘీభావం తెలుపుతూ.. పాదయాత్రలో పాల్గొన్నారు. 
 • ప్రజా యుద్ధ నౌక గద్దర్ తమతో చేతు కలపడం రాష్ర్ట రాజకీయ స్వరూపం మారిపోయిందని తమ్మినేని సంతోషాన్ని వ్యక్త చేశారు. గడీల తెలంగాణ కూలగొట్టి.. సామాజిక తెలంగాణ నిర్మిస్తామని తమ్మినేని ప్రకటించారు. 
 • తెలంగాణ ప్రజలు ఒక దిక్కు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ దిక్కే ఎర్రజెండా అని ప్రముఖ పాత్రికేయులు పాశం యాదగిరి తెలిపారు. మహాజన పాదయాత్రకు మద్ధతు తెలుపుతూ ఆయన పాదయాత్రలో పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించారు. 
 • సామాజిక సమరం సాగించాలని పాదయాత్ర ఉపనాయకులు జాన్ వెస్లీ తెలిపారు. బడుగు బలహీన వర్గాల రాజ్యం కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని వెస్లీ పిలుపునిచ్చారు. 
 • మహాజన పాదయాత్రకు మద్దతుగా ప్రజా గాయకుడు గద్దర్ గజ్జకట్టి ఆడిపాడాడు. చాకలి ఐలమ్మ స్వగ్రామం పాలకుర్తిలో జరిగిన పాదయాత్రలో గద్దర్ పాల్గొని సంఘీభావం తెలిపారు. 
 • బతుకులు మారాలంటే సామాజిక న్యాయం రావాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ధర్మపురం వద్ద ఆయన మాట్లాడారు. అడవి పుట్టినపుడే గిరిజనుడు పుట్టాడని, గిరిజనుడిని అడవి నుండి దూరం చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. దర్గ్య నాయక్ బ్రతికుండగానే సామాజిక తెలంగాణ సాధిస్తామని తమ్మినేని స్పష్టం చేశారు.
 • డిగ్రీలు..పీజీలు చేసినా ఉద్యోగాలు ఎక్కడా ? అని పాదయాత్ర బృందం సభ్యుడు శోభన్ నాయక్ ప్రశ్నించారు. ధర్మపురం చేరుకున్న అనంతరం అమరవీరుల స్థూపానికి బృందం నివాళి అర్పించింది. ఈసందర్భంగా శోభన్ మాట్లాడారు. ధర్శపురం వీరుల గురించి చిన్నతనం లోనే చదివానని తెలిపారు.
   
 • 84వ రోజు పాదయాత్ర కొనసాగుతోంది. దేవరుప్పాల నుండి ధర్మపురంకు చేరుకుంది. ఈసందర్భంగా అమరవీరులకు పాదయాత్ర బృందం నివాళి అర్పించింది.
 • పాదయాత్ర దేవరుప్పాలకు చేరుకుంది. అక్కడి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ మహాజన పాదయాత్ర కు దేవరుప్పాల ఎంపీటీసీ మద్దతు సంఘీభావం తెలిపారు.
 • మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. 84వ రోజు పాదయాత్ర బృందం దేవరుప్పాలకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడి గిరిజన విద్యార్థినీలు సమస్యలఫై పాదయాత్ర బృందానికి వినతి సమర్పించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో గిరిజన విద్యార్థి సమాఖ్య టీఎస్ఎఫ్ నాయకులు మలోత్ శ్రీకాంత్, సురేష్, రమేష్, మల్లేష్ తదితరులున్నారు.
 • ధర్మపురంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దర్గ్యానాయక్ ను పాదయాత్ర బృందం కలిసింది. నాయక్ చిరకాల కోరికయైన సామాజిక తెలంగాణ ఉద్యమాలు నిర్మించి సాధిస్తామని తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.
 • పాదయాత్రకు మద్దతుగా పాలకుర్తి మండలంలో ప్రజా గాయకుడు గద్దర్ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా పాలకుర్తి సభలో ఆయన పాల్గొననున్నారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 84వ రోజు కొనసాగుతోంది. మైలారం, ధర్మపురం, విసునూరు, పాలకుర్తి, దరదపల్లి, వావిలాల గ్రామాల్లో పాదయాత్ర కొనసాగనుంది.
 • విసునూరులో పాదయాత్ర బృందానికి  కూలీలు తమ సమస్యలను చెప్పుకున్నారు. 
 • పాదయాత్ర విసునూరు చేరుకుంది. విసునూరి ఘడీని పాదయాత్ర బృందం సందర్శించింది. ఈ ఘడీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు. ప్రాణాలు తీసిన చోటనే ప్రాణాలు పోసే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని తమ్మినేని ప్రభుత్వానికి సూచించారు. 
 • తమ్మినేని మాట్లాడుతూ.. ‘‘సామాన్యుడి బతుకు మారాలంటే సామాజిక న్యాయం రావాలి. అన్ని రంగాల్లో జనాభా ప్రాతిపాదికన అవకాశాలు, హక్కులు కల్పించాలి. అడవి పుట్టినప్పుడే గిరిజనుడు పుట్టాడు. గిరిజనుడిని అడవి నుంచి దూరం చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. సామాజిక తెలంగాణ సాధించే వరకు మా పోరాటం ఆగదు.’’ అని తమ్మినేని అన్నారు. 
 • దర్శపుర్ లో శోభన్ నాయక్ ప్రసంగించారు. 
 • తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోదుడు ధర్గ్యానాయక్ తో మహాజన పాదయాత్ర బృందం మాట్లాడింది. పాదయాత్ర విజయవంతంగా జరగాలని బారుగ నాయక్ ఆకాంక్షించారు. 
 • దర్శాపూర్ వద్ద అమరవీరులకు పాదయాత్ర బృందం నివాళులు అర్పించింది. 
 • దేవరుప్పల ఎంపిటిసి మహాజన పాదయాత్రకు సంఘీభావం తెలిపింది. 
 • కేజీబీవీ దేవరుప్పల గిరిజన విద్యార్థినిలు తమ సమస్యలను పాదయాత్ర బృందానికి వినతి పత్రం రూపంలో ఇచ్చారు. 
 • నేటి మహాజన పాదయాత్ర దేవరుప్పల నుండి ప్రారంభమయ్యింది. 
 • ‘‘కెసిఆర్ మాయల మరాఠి. చెప్పిన మాటలకు చేసినపనులకు పొంతన లేదు. ప్రజల బలహీనతను ఆసరా చేసుకొని ప్రభుత్వం తనకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది. మనకు ఇచ్చిన హామీల కోసం గల్లా పట్టి అడగాలి. ప్రజలలో చైతన్యం కోసమే పాదయాత్ర కొనసాగుతోందని తమ్మినేని తెలిపారు.’’
 • 'సామాజిక న్యాయం-తెలంగాణ సమగ్రాభివృద్ధి'' లక్ష్యంగా కొనసాగుతున్న మహాజన పాదయాత్ర విజయవంతంగా కొనసాతుంది. పాదయాత్ర బృందం సభ్యులు శోభన్ నాయక్ మాట్లాతూ ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉంటే కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించాలి.
 • ''సామాజిక న్యాయం-తెలంగాణ సమగ్రాభివృద్ధి'' లక్ష్యంగా రాష్ట్రంలో కొనసాగుతున్న మహాజన పాదయాత్ర జనగామ జిల్లాలో సీతారాంపురం వద్ద 2200కి.మీలు పూర్తి చేసుకుంది. పాదయాత్ర బృందం రథసారది తమ్మినేని వీరభద్రంగారి సతీమణి ఉమా గారు పాదయాత్రలో పాల్గొన్నారు.
 • మహాజన పాదయాత్ర కాసేపటి క్రితం కడవేండి గ్రామానికి చేరుకుంది. గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. అక్కడ నిర్వహించిన సభలో తమ్మినేని గారు మాట్లాడుతూ పేద ప్రజలకు 3ఎకరాల భూమి ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. అట్టడుగు ప్రజలకు భుమి కోసం భుక్తి కోసం మరో సాయుధ పోరాటం జరపాల్సిన పరిస్థితి ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని తమ్మినేని అన్నారు.
 • మహాజన పాదయాత్ర 83వ రోజు విజయవంతగా కొనసాగుతుంది. కొలుకొండ నుండి బయలుదేరిన మహాజన పాదయాత్ర కాసేపటి క్రితం కడవేండి గ్రామంలో చేరుకుంది. పార్టీ కార్యకర్తలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నిర్వహించిన మహాసభలో బృంద సభ్యులడు శోభన్ నాయక్ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
 • ''సామాజిక న్యాయం-తెలంగాణ సమగ్రాభివృద్ధి'' లక్ష్యంగా రాష్ట్రంలో కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 83వ రోజుకు చేరుకుంది . కోలుకొండ, కోటుకొండ క్రాస్ రోడ్, పెద్దతండ, చిన్నరాలబండ తండ, నల్లకుంట తండ, కడవెండి బ్రిడ్జి, సీతారాంపూర్, సీతారాంపూర్ స్టేజీ, కామారెడ్డిగూడెం స్టేజీ, దేవరుప్పుల స్టేజీ, దేవరుప్పుల విలేజ్ గ్రామాలలో నేడు పర్యటించనుంది.
 • ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..చైతన్యపరుస్తూ పాదయాత్ర నిరాటంగా కొనసాగుతోంది. జనగాం జిల్లాలో పర్యటిస్తున్న మహాజన పాదయాత్ర కాసేపటి క్రితం పొగాకు రైతుల సమస్యలను తెలుసుకుంది.
 • కుర్చపల్లిలో పాదయాత్ర జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. అట్టడుగు ప్రజల హక్కుల కోసం అన్ని పార్టీలు, ప్రజాసంఘలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
 • కుర్చవలిలో 81వ రోజు గురువారం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు పాదయాత్ర బృందానికి వినతిపత్రం సమర్పించారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 81వ రోజుకు చేరుకుంది. నేడు ఇప్పగూడెం, కుర్చపల్లి, రాఘవాపూర్, గోవర్ధనగిరి, కోమళ్ల, ఎమ్మార్వో ఆఫీస్, రఘునాథపల్లి, నడిగొండలో పాదయాత్ర జరగనుంది.
 • తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ఆడనీయరా అని పాదయాత్ర బృంద సభ్యుడు ఆశన్న ప్రశ్నించారు. దళిత మహిళలు బతుకమ్మ ఆడని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు. శాయంపేటలో ఆయన ప్రసంగించారు.
 • వరంగల్ అర్బన్ జిల్లాలో పాదయాత్ర బృందానికి స్థానికులు ఆయా వర్గాల వారు సమస్యలు తెలియచేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు వినతిపత్రాలు అందచేస్తున్నారు. శాయంపేటలో పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
 • పాదయాత్రకు ఘన స్వాగతం లభిస్తోంది. గ్రామస్తులు..స్థానికులు సమస్యలు తెలియచేస్తున్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృందాన్ని స్థానికులు సన్మానించారు.
 • జిల్లాలో మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర 79వ రోజుకు చేరుకుంది. వరంగల్ జిల్లాలోని కరీమాబాద్, ఉరుసు, కాజిపేట, పెద్ద పెండ్యాలలో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది.
 • పాదయాత్రకు జిల్లా డీవైఎఫ్ఐ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 78వ రోజు బావుపేట నుండి పాదయాత్ర బృందం బయలుదేరిన సంగతి తెలిసిందే.
 • జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. కాసేపటి క్రితం పాదయాత్రకు టిడిపి వరంగల్ జిల్లా ఘన స్వాగతం పలికింది. పాదయాత్రకు టిడిపి జిల్లా కమిటీ అధ్యక్షుడు ఈగ మల్లేశం సంఘీబావం తెలిపారు.
 • పాదయాత్ర హసన్ పర్తికి చేరుకుంది. ఈసందర్భంగ స్థానికంగానున్న అంబేద్కర్ విగ్రహానికి పాదయాత్ర బృందం పూలమాలలు వేసింది.
 • మహాజన పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. బావుపేట నుండి బయలుదేరిన పాదయాత్ర బృందానికి పలువురు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర బృందానికి గీత కార్మికులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బహుకరించిన 'నీర'ను బృంద సభ్యులు సేవించారు.
 • ​సీపీఎం మహాజన పాదయాత్ర 78వ రోజుకు చేరుకుంది. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన పాదయాత్ర 78వ రోజు వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటిస్తోంది. బావుపేట నుండి పాదయాత్ర బృందం బయలుదేరింది.
 • మహాజన పాదయాత్ర 77వ రోజు విజయవంతముగా కొనసాగుతుంది. చేలుపూర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసీ జాన్ వెస్లీ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర బృందం కుటుంబ సభ్యులు పాల్టొన్నారు. కాసేపలి క్రితం హుజూరాబాద్ కు చేరుకుంది. మైనారిటీ సంఘం నాయకులు పాదయాత్ర బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. జస్టిస్ చంద్రమోహన్ గారు సామాజిక ఉద్యమ నాయకులు ఉసాగారు మురళి మనోహర్ పాదయాత్రలో పాల్గొన్నారు. 
 • మహాజన పాదయాత్ర 76వ రోజుకు కొనసాగుతుంది. ఎరడపలి నుండి ప్రారంభమైన పాదయాత్ర విణవంకు చేరుకుంది  విణవంక దగ్గర 2000 కి.మీ పూర్తి చేసుకుంది
 • ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి ఇవ్వకపోతే ప్రభుత్వ భూమిలో ఎర్రజెండాలు పాతుతామని పాదయాత్ర బృంద సభ్యుడు రమణ పేర్కొన్నారు. అన్నారంకు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
 • పేద ప్రజల మీద ప్రభుత్వం విషం కక్కుతోందని సీపీఎం పాదయాత్ర బృంద సభ్యుడు జాన్ వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానకొండూరులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు.
 • మహాజన పాదయాత్రకు ఓ కాంగ్రెస్ నేత విరాళం ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో కాంగ్రెస్ నేత అన్నరెడ్డి పాల్గొని రూ. 2000వేలను అందించారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ రావు పాల్గొన్నారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.
 • మహాజన పాదయాత్ర కాసేపటి క్రితం కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైంది. పాదయాత్ర నేటికి 75వ రోజుకు చేరుకుంది. స్థానికంగా ఉన్న పాపన్న విగ్రహానికి తమ్మినేని పూలమాలు వేశారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 75వ రోజుకు చేరుకుంది. నేడు జిల్లాలోని కోటిరాంపూర్, అలుగునూర్, సదాశివపల్లి క్రాస్ రోడ్డు, మానుకొండూర్, అన్నారం, లలితాపూర్, దేవంపల్లి, కొండపలకల, ఎర్రాడపల్లి ప్రాంతాల్లో పాదయాత్ర జరగనుంది.
 • పాదయాత్ర74వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది. ఈరోజు గంగాధర్ నుండి బయలు దేరిన మహాజన పాదయాత్ర బృందం కాసేలటి క్రితం కొత్తపల్లి చేరుకుంది.
 • మహాజన పాదయాత్ర  74వ రోజుకు చేరుకుంది. గంగాధర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి పాదయాత్ర ప్రారంబించారు.  గంగాధర్ నుండి బయలుదేరిన పాదయాత్ర కరింనగర్ జిల్లా కేంద్రానికి చేరుకుంది.    
 • సీపీఎం మహాజన పాదయాత్ర 1900 కి.మీటర్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో కొనసాగుతోంది. ఆయా గ్రామాల ప్రజలు  సమస్యలతో కూడిన వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. పాదయాత్రకు పలువురు పార్టీల నేతలు సంఘీభావం ప్రకటిస్తున్నారు. జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ (కాంగ్రెస్) సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాదయాత్రకు మద్దతు తెలిపారు. 
 • సీపీఎం మహాజన పాదయాత్రలో కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మల్యాల క్రాస్ రోడ్డుకు చేరుకున్న అనంతరం పాదయాత్రకు పొన్నం ప్రభాకర్ సంఘీభావం తెలిపారు.
 • ​మహాజన పాదయాత్ర 73వ రోజు మల్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పాదయాత్ర బృంద సభ్యులు పూలమాలలు వేశారు.
 • మహాజన పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర జరగనుంది. కాసేపటి క్రితం ప్రారంభమైన పాదయాత్ర ఓ స్కూల్ ను సందర్శించింది. అక్కడున్న మైనార్టీ విద్యార్థులతో పాదయాత్ర బృంద సభ్యుడు అబ్బాస్ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
 • సీపీఎం మహాజన పాదయాత్రకు పార్టీలకతీతంగా మద్దతు తెలుపుతున్నారు. 73వ రోజు జగిత్యాల జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు మున్సిపల్ ఛైర్మన్ (కాంగ్రెస్) పాల్గొన్నారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 73వ రోజుకు చేరుకుంది. నేడు జగిత్యాలలోని మాల్యాల క్రాస్ రోడ్డు, కొండగట్టు, పూడూరు, నెమలికొండ, గంగాధర క్రాస్ రోడ్డులో పాదయాత్ర జరగనుంది. ఉదయం జగిత్యాలలోని అంబేద్కర్ విగ్రహానికి తమ్మినేని పూలమాల వేశారు.
 • తెలంగాణ వచ్చిన తరువాత కూడా బతుకులు మారలేదని పాదయాత్ర బృంద సభ్యుడు ఆశయ్య  విమర్శించారు. గుంజపడుగుకు చేరుకున్న అనంతరం ఆయన మాట్లాడారు.
 • నంచర్ల నుండి ప్రారంభమైన పాదయాత్ర తిరుమలపురంకు చేరుకుంది. అక్కడ నిర్మాణమౌతున్న కాల్వ పనులను పాదయాత్ర బృందం పరిశీలించింది. అక్కడ పనులు చేస్తున్న కూలీలతో తమ్మినేని మాట్లాడారు.
 • సమరశిల పోరటాలతో సమస్యలు పరిష్కారించుకోవాలని పాదయాత్ర బృంద సభ్యురాలు రమ పేర్కొన్నారు. ప్రభుత్వ మెడలు వంచాలని సూచించారు.
 • నంచర్ల నుండి ప్రారంభమైన పాదయాత్ర కాసపటి క్రితం తిరుమంపూర్ కు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాదయాత్ర బృంద సభ్యుడు రమణ మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో వైద్యం ఉండాలని సూచించారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. 72వ రోజు నంచర్ల గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. మహాజన పాదయాత్ర కు బందోబస్తు గా వచ్చిన పోలీసులు తమ్మినేనితో కరచాలనం చేశారు. తిరుమంపూర్, గుంజపడుగు, గొల్లపల్లి, ఇబ్రహీంనగర్, జగిత్యాలలో పాదయాత్ర జరగనుంది.
 • నేటి పాదయాత్ర షెడ్యూల్...72వ రోజు...తిరుమలాపూర్‌లో ప్రారంభమై గుంజపడుగు, గొల్లపల్లి, ఇబ్రహీంనగర్‌, రాఘవపూర్‌ మీదుగా జగిత్యాల చేరనుంది. అక్కడే రాత్రి బస చేయనుంది.
 • ఈ నెల 26 ఆర్నకొండ నుంచి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌, పత్తిపాక మీదుగా జగిత్యాల జిల్లాలోకి మహాజన పాదయాత్ర ప్రవేశించనుంది.
 • ల్యాగలమర్రిలో ప్రారంభయ్యే యాత్ర దివికొండ, నచ్చర్లలో రాత్రి బస చేయనుంది. 27న తిరుమలాపూర్‌లో ప్రారంభమై గుంజపడుగు, గొల్లపల్లి, ఇబ్రహీంనగర్‌, రాఘవపూర్‌ మీదుగా జగిత్యాల చేరనుంది. అక్కడే రాత్రి బస చేయనుంది.
 • ఈ నెల 28న మల్యాల చౌరస్తాలో ప్రారంభమై కొండగట్టు మీదుగా పూడురు, నమిలకొండ ద్వారా కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర క్రాసింగ్‌ వద్దకు చేరి అక్కడే రాత్రి బస చేయనుంది.
 • 29న కురిక్యాలలో ప్రారంభమై వెదిర, కొత్తపల్లి మీదుగా సాగి కరీంనగర్‌లో రాత్రి బస చేయనుంది.
 • 30న తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌నుంచి ప్రారంభమై సదాశివపల్లిమీదుగా మానకొండూర్‌, అన్నారం, లలితాపూర్‌, దేవంపల్లి, కొండపల్కల నుంచి ఎరడపల్లి చేరి రాత్రి బస చేయనుంది.
 • 31న కన్నాపూర్‌ నుంచి ప్రారంభమై రాజాపూర్‌, కాచాపూర్‌, వీణవంక మండల కేంద్రంతోపాటు నర్సింగాపూర్‌, వల్బాపూర్‌, జగ్గయ్యపల్లి మీదుగా జమ్మికుంటకు చేరి రాత్రి బస చేయనుంది.
 • జనవరి 1న చెల్పూర్‌, చిన్నరాజ్‌పల్లి, రంగాపూర్‌, సిర్సపల్లి క్రాస్‌రోడ్డునుంచి హుజూరాబాద్‌ మండల కేంద్రానికి మధ్యాహ్నం వరకు చేరనుంది. అనంతరం పెంచికల్‌పేట క్రాస్‌రోడ్డు ద్వారా వరంగల్‌ జిల్లాలో ప్రవేశించనుంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 70వ రోజుకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతున్న మహాజన పాదయాత్రలో కేసీఆర్‌ సర్కార్‌పై పాదయాత్ర బృందం సభ్యుడు జాన్‌వెస్లీ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. అమాయక ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారని విమర్శించారు.
 • క్రైస్తవులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పాదయాత్ర బృంద సభ్యులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మనుషులంతా సమానమేనని ఏసుక్రీస్తు బోధించారని, సమానత్వం కోసం క్రీస్తు తన ప్రాణాలు అర్పించారని తమ్మినేని తెలిపారు. అట్టడుగు కులాల అభివృద్ధి, సమానత్వం కోసమే తమ పాదయాత్ర కొనసాగుతోందన్నారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 70వ రోజుకు చేరుకుంది. పెద్దాపూర్, భూపాలపట్నం, చొప్పదండి, రుక్మాపూర్ లో పాదయాత్ర కొనసాగనుంది.
 • మహాజన పాదయాత్ర విజయవంతముగా కొనసాగుతుంది. పెద్దపల్లి నుండి బయలుదేరిన పాదయాత్ర కాసేపటి క్రితం కాచాపూర్ వద్ద 1800 కి.మీలు పూర్తి చేసుకుంది. తెలంగాణ మలిశ ఉద్యమాకారుడు ఆకుల భూమన్న 3వ వర్థంతి సంధర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాలి అర్పించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ జాన్వెస్లీ మాట్లాడుతూ దొరల తెలంగాణ కాదు సామాజిక తెలంగణా కావాలని పిలుపునిచ్చారు. పాదయాత్ర రథసారది తమ్మినేని వీరభద్రం గారు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం లక్ష్యంగా పనిచేయాలన్నారు.
 • 69వ రోజు మహాజన పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. నేడు అశేష జనవాహిని మద్య పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభమయ్యింది. నీల్ లాల్ జెండాలు చేతబూని ప్రజలు లాల్ సలామ్-జై భీమ్ నినాదాలతో ముందుకెళ్లారు. ఉదయం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో బృంద సభ్యులు ఆశయ్య ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని కూడా సమగ్రంగా మలు చేయలేదని విమర్శించారు.  సభకు ముందు ప్రజా నాట్యమండలి కళాకారులు పాటలతో హోరెత్తించారు. సభ అనంతరం ముందు వరుసలో డప్పుల దరువులు, రెడ్ షర్ట్ వాలంటీర్లు నడుస్తుండగా.. పాదయాత్ర వడివడిగా ముందుకు కదిలింది. 
 • పెద్దపల్లి జిల్లాలోని రొంపికుంట గ్రామానికి చేరుకున్న పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు..స్థానికులు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని బృందానికి అందచేశారు. 'వంద ఎస్సీ కుటుంబాలకు సాగుభూమి లేదు. అర్హులైన వృద్ధులకు ఫించన్ లు అందడం లేదు. యువకులకు ఉద్యోగాలు రావడం లేదు’.అంటూ తదితర సమస్యలను వినతిపత్రంలో పేర్కొన్నారు.
 • పెద్దపల్లి జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర పర్యటిస్తోంది. గుంటూరుపల్లిలో ఏర్పాటు చేసిన సభలో పాదయాత్ర బృంద రథసారధి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. అనంతరం ఓ వృద్ధురాలు వచ్చి తన గోస వెళ్లబోసుకుంది. 'ఒక్కదానినే ఉన్నా..ఫించన్ వస్తలేదు..రజాకార్లను కూడా చూసినా' అంటూ ఓ వృద్ధురాలు పేర్కొంది. అంతేగాకుండా తమకు ఫించన్ రావడం లేదంటూ వృద్ధులు వినతిపత్రాలు సమర్పించారు. ఫించన్ వచ్చే విధంగా చూడాలని వేడుకున్నరు.
 • రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్ సీఎల్) లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా సర్కార్ పై వత్తిడి తీసుకరావాలని స్థానికులు పాదయాత్ర బృందాన్ని కోరారు. కాసేపటి క్రితం ఎస్ పీటీ కర్మాగారానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానికులు పాదయాత్ర బృందానికి వినతిపత్రం సమర్పించారు.
 • పెద్దపల్లి జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. 67రోజులు పూర్తి చేసుకుంది. గోదావరిఖని, గౌతమ్ నగర్, ఎస్ పీటీ (ఎరువుల కర్మాగారం), టెలకపల్లి గేట్, లక్ష్మీపురం, ఎలుకపల్లి, గుంటూరుపల్లి, సోలపల్లి, వైరాపల్లి, సబితం, రంగాపూర్, రాఘవపూర్, పెద్దపల్లి ప్రాంతాల్లో పాదయాత్ర జరగనుంది.
 • మహాజన పాదయాత్ర 67వ రోజు కొనసాగుతుంది. ఈరోజు పాదయాత్ర శ్రీరాంపూర్, మంచిర్యాల, సీసీసీ, యిందారం, గోదావరిఖని కొనసాగనుంది. నేడు మంచిర్యాల జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించనుంది.
 • 'ఓపెన్‌ కాస్ట్‌ వ్యతిరేక పోరాటానికి మా మద్దతు ఉంటుందని.. పోరాటంలో మేం భాగమవుతామని' సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర విజయవంతంగా 66వ రోజుకు చేరుకుంది. ఈ రోజు పాదయాత్ర దుబ్బగూడెం, మందమర్రి, మేడారం, పులికుంట... బొప్పలగుట్ట, గద్దెరాగడి, మంచిర్యాలలో సాగనుంది. కాగా ఈ మహాజన పాదయాత్రకు దోమగూడ, కాశిపేట ఓపెన్‌కాస్ట్‌ వ్యతిరేక పోరాట బృందం సభ్యులు సంఘీభావం తెలిపారు.
 • ఇంటింటికి మంచినీరు ఇచ్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం అమల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సామాజిక న్యాయం సాధన కోసం తమ్మినేని చేపట్టిన మహా పాదయాత్ర కొమురం భీమ్‌ జిల్లాలో కొనసాగుతోంది.
 • సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేట్టిన మహా పాదయాత్ర 63వ రోజుకు చేరుకుంది. మొత్తం 1600 కి.మీ. పూర్తి చేసుకుంది. కొమురం భీమ్‌ జిల్లాలో కొనసాగుతోంది. టీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో బలహీన వర్గాలకు సామాజిక న్యాయం లోపించిందని రమ వ్యాఖ్యానించారు.
 • జోడెఘాట్ కు పాదయాత్ర బృందం చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడున్న కొమరం భీం స్మారక భవనాన్ని సందర్శించి కొమరం భీంకు నివాళి అర్పించింది.
 •  
 • గతంలో బీజేపీకి వ్యతిరేకమన్న టీఆర్ఎస్ నేడు దోస్తీ చేస్తోందని సీపీఎం మహాజన పాదయాత్ర బృంద రథసారధి, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కాసేపటి క్రితం కారిమేరికి చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో తమ్మినేనితో పాటు రమ కూడా మాట్లాడారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర కెసలగూడకు చేరుకుంది. పాదయాత్ర బృందానికి స్థానికులు, పలువురు ఘన స్వాగతం పలుకుతున్నారు. అంతకంటే ముందు కారిమేరి కొండల మధ్య పాదయాత్ర సాగింది.
 • ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర 63వ రోజుకు చేరుకుంది. కేస్లాగూడ, చెరమెరి, హట్టి, ఝురి, దనడ, అంబారావు గూడ, కోలంకొటారి, హడ ప్రాంతాల్లో పాదయాత్ర కొనసాగనుంది.
 • కొమరంభీం జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది. కాసేపటి క్రితం .జైనూర్ గ్రామానికి చేరుకుంది. గ్రామాస్థులు, విద్యార్ధులు పెద్ధ సంఖ్యలో స్వాగతం పలికారు. పాదయాత్ర బృందానికి విద్యార్థులు కాలేజి భవనం కావాలని తమ్మినేని వీరభద్రం గారిక వినతి పత్రం అందించారు.
 • మహాజన పాదయాత్ర 62వ రోజు కొనసాగుతుంది. కాసేపటి క్రితం కొమరంభీం జిల్లాలో అడుగుపెట్టిన పాదయాత్ర బృందం 1600కి.మీలు పూర్తి చేసుకుంది.
 • మహాజన పాదయాత్ర 62వ రోజు చేరుకుంది. నేడు హస్నాపూర్ నుండి ప్రారంభంమైన పాదయాత్ర గంగం, హుస్సేగామ్, పొచ్చేలొద్ది, జైనూర్, తంగిడి, రాసిమెట్ట, బుస్సిమెట్ట క్యాంప్ లో కొనసాగనుంది. మొత్తం 1594కి.మీ పూర్తి చేసుకుంది.
 • ఇంద్రవెల్లిలో సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర 61వ రోజుకు చేరుకుంది. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాదయాత్ర బృందం పూలమాలలు వేసింది. అనంతరం పులిమడుగు చెరువును సందర్శించింది. పలువురు పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం ఉట్నూరు గ్రామానికి చేరుకుంది. అక్కడున్న కొమరం భీం విగ్రహానికి పాదయాత్ర బృందం పూలమాలలు వేసింది.
 • 60వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. కాసేపటి క్రితం అంకోలి నుండి పాదయాత్ర ప్రారంభమైంది. లోకారి, కండాల, ఇంద్రవెల్లిలో పాదయాత్ర బృందం పర్యటించనుంది.
 • ఆదిలాబాద్ జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. నేడు 60వ రోజు లోకారి, వాన్ వట్, పిప్పల దరి, దహేగూడ, కండాల, రాజుగూడ, హేమాయి కుంట, ఇంద్రవెల్లిలో పాదయాత్ర బృందం పర్యటించనుంది. మొత్తంగా 1536.7 కి.మీటర్ల పాదయాత్ర జరిగింది.
 • 59వ రోజు ఆదిలాబాద్ జిల్లాలో మహజన పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో ప్రవేశించిన బృందానికి ఆదివాసీలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బృంద సభ్యులు వారితో ఆడారు. ఈ సందర్భంగా గిరిజనులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను బృందానికి తెలియచేశారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 59వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 1517.3 కి.మీటర్ల మేర పాదయాత్ర జరిగింది. బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర జరగనుంది. మావీల, ఆదిలాబాద్, అంకోలిలో బృంద సభ్యులు పాదయాత్ర చేయనున్నారు.
 • ఆదిలాబాద్ జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. కాసేపటి క్రితం దేవపూర్ కు చేరుకుంది. అంతకంటే ముందు సీతాగుండి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాదయాత్ర బృందం పూలమాలలు వేసింది.
 • మహాజన పాదయాత్రకు ప్రభుత్వం భద్రత కల్పించడం లేదని పాదయాత్ర బృంద రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. తమ కార్యకర్తలే ట్రాఫిక్ ను అదుపు చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పాదయాత్రపై ప్రభుత్వం మొదటి నుండి కక్షపూరితంగా ఉందన్నారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే హోదాలో తనకున్న భద్రతను తగ్గించారని పేర్కొన్నారు.
 • ఇచ్చోడ వద్ద సీపీఎం మహాజన పాదయాత్ర బృందానికి ప్రమాదం సంభవించింది. వెనుక నుండి వచ్చిన ఓ లారీ బృందం పైకి దూసుకెళ్లింది. దీనితో ముగ్గురికి గాయాలయ్యాయి. జిల్లా గిరిజన సంఘం నేత భీంరావుకు తీవ్ర గాయాలయ్యాయి. కొత్తగూడెం జిల్లా సీపీఎం కార్యకర్తలు సోడేం ప్రోసాద్, సయ్యిద్ జలాల్ కు గాయాలయ్యాయి. వీరిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 • సీపీఎం పాదయాత్ర బృందానికి ప్రమాదం ఏర్పడింది. పాదయాత్ర బృందంపైకి ఓ లారీ దూసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయలవ్వగా..వీరిలో గిరిజన నేత భీమ్ రావు పరిస్థితి విషమంగా వుంది. ఆదిలాబాద్ ఇచ్చోడ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారినికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
 • ఆదిలాబాద్ జిల్లాలోకి మహాజన పాదయాత్ర బృందం ప్రవేశించింది. 59వ రోజు ఇచ్చోడ, గాంధీనగర్, మన్నూర్, డొంగరగామ్, గుడి హత్నూర్, సీతాగుండి, దేవపూర్, మావల గ్రామాల్లో పాదయాత్ర బృందం పర్యటించనుంది.
 • నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర బృందం ముందుకెళుతోంది. ఆయా సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కు పాదయాత్ర బృంద రథసారథి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. 56వ రోజు శుక్రవారం సుబ్రియాల్ వద్దకు చేరుకుంది. మొత్తంగా 1400 కి.మీటర్ల మేర పాదయాత్ర జరిగింది.
 • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాత కాంట్రాక్టర్లు ఉండరు..కనీస వేతనాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. కానీ ఈ హామీలు ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. పంచాయతీ వర్కర్స్ కు..ఇతర అసంఘటిత రంగ కార్మికుల వేతనాలను కనీస వేతనాల స్థాయికి పెంచాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
 • దళితులు అంటరానివారీగానే కొనసాగుతున్నారని, వీరిలాగే ఇతరుల కులాలకు చెందిన వారు సమస్యలను ఎదుర్కొంటున్నారని పాదయాత్ర బృంద సభ్యుడు అబ్బాస్ పేర్కొన్నారు. మైనార్టీకి చెందిన ఎంతో మంది యువకులు నిరుద్యోగులుగా కొనసాగుతున్నారని, వెనుకబడిన కులాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
 • జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. 56వ రోజు పలు గ్రామాల్లో పర్యటించనుంది. 55 రోజుల్లో 1391.1 కి.మీటర్ల మేర పాదయాత్ర జరిగింది. శనివారం ఆర్మూర్, పిప్రీ, పత్తేపూర్, సుబ్రియాల్, కోమన్ పల్లి, జలాల్ పూర్, నాగపూర్, బస్వాలార్, కిషన్ నగర్, ముప్కాల్, నల్లూర్, బుస్సాపూర్ గ్రామాల్లో పాదయాత్ర బృందం పర్యటించనుంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర నిరాఘాటంగా కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో అడుగు పెట్టిన బృందానికి ప్రజలు..స్థానికులు ఘన స్వాగతం పలుకుతున్నారు. శుక్రవారం ఉదయం బయలుదేరిన పాదయాత్ర బృందానికి సీపీఎం మాక్లూర్ మండల కమిటీ ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా తమ్మినేనికి కరవాళాన్ని బహుకరించారు.
 • సీఎం కేసీఆర్ కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, మహాజన పాదయాత్ర బృంద రథసారధి తమ్మినేని వీరభద్రం మరో లేఖ రాశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో సీపీఎం పాదయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బడుగు, బలహీన వర్గాల బాలికలను జోగినిలుగా మార్చే దుష్ట సంప్రదాయ ఈ ప్రాంతంలో ఇంకా కొనసాగుతోందని 43వ లేఖలో పేర్కొన్నారు. పెన్షన్ కోసం భర్త చనిపోయినట్లు సర్టిఫికేట్ కావాలంటున్నారని, ఫీజు రీయింబర్స్ మెంట్ అందక పిల్లలు ఉన్నత విద్యకు దూరమౌతున్నారని పేర్కొన్నారు. దళితులకు అందే ప్రయోజనాలు ఒక్కటి అందడం లేదని వారు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. జస్టిస్ రఘునాథరావు కమిషన్ సిఫార్సులను అమలు చేసి జోగినీలకు పునరావాసం, సంక్షేమ పథకాలను అందించాలన్నారు. వికలాంగులకు పెన్షన్, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. వంద సబ్సిడీతో ఎస్సీ కార్పొరేషన్ రుణాలివ్వాలని డిమాండ్ చేశారు.
 • సీఎం కేసీఆర్ కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సీపీఎం మహాజన పాదయాత్ర బృంద రథసారధి తమ్మినేని వీరభద్రం మరో లేఖ రాశారు. ఇది 42వ లేఖ. కామారెడ్డి జిల్లా గాంధారి (మం) నర్సాపురం గ్రామం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందన్నారు. నర్సాపురం నుండి సమీప ప్రాంతాలకు అటవీ ప్రాంతం గుండా వెళ్లే క్రమంలో గ్రామస్తులపై జంతువులు దాడి చేస్తున్నాయని తెలిపారు. ఇటీవలే ఓ గర్భవతి మార్గమధ్యంలోనే ప్రసవించిందని, ఐదో తరగతితోనే విద్యార్థులు చదువుకు స్వస్తి పలుకుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రోడ్డు వేయాలని ఆందోళన చేసిన గ్రామస్తులను స్థానిక ఎమ్మెల్యే పోలీసులతో కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే తన వ్యవసాయ క్షేత్రానికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యం కల్పించుకున్నారని తెలిపారు. ముద్దెల్లి నుండి కొయ్యగుట్టలను కలుపుతూ రోడ్డు నిర్మించాలని, కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.
   
 • సీపీఎం మహాజన పాదయాత్ర నిరాఘాటంగా కొనసాగుతోంది. 51వ రోజు కామారెడ్డిలో పర్యటించిన పాదయాత్ర కాసేపటి క్రితం నిజామాబాద్ జిల్లాలో అడుగు పెట్టింది.
 • డా.బీఆర్.అంబేద్కర్ ఆశయాలను సాధిస్తామని సీపీఎం మహాజన పాదయాత్ర బృంద రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పేర్కొన్నారు. 51వ రోజు బాన్సువాడ నుండి పాదయాత్ర ప్రారంభమైంది.
 • ప్రైవేట్ రంగం లో రిజర్వేషన్లు కల్పించాలని సీపీఎం మహాజన పాదయాత్ర బృంద సభ్యుడు జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. 51వ రోజు బాన్సువాడ నుండి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా నీల్ లాల్ జెండాను జాన్ వెస్లీ ఆవిష్కరించారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర బాన్సువాడ నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాదయాత్ర బృందం పూలమాలు వేశారు.
 • గాంధారి గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర చేపట్టి 50 రోజులైన సందర్భంగా బృంద సభ్యులు అభివాదం తెలియచేశారు. అనంతరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బృంద సభ్యులు అడిగి తెలుసుకున్నారు.
 • కామారెడ్డి జిల్లాలో 49వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర ముగిసింది. మొత్తం 24.4 కిలోమీటర్లు మేర ఈ రోజు పాదయాత్ర జరిగింది. పాదయాత్రకు పలువురు సంఘీభావం ప్రకటించారు. బృందానికి సమస్యలతో కూడిన వినతిపత్రాలు సమర్పించారు.
 • భూంపల్లిలో కొనసాగిన సీపీఎం మహాజన పాదయాత్రకు పలువురు సంఘీభావం ప్రకటించారు.
 • సదాశివనగర్ లో మహాజన పాదయాత్ర బృందం పర్యటించింది. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుంది. పాదయాత్రకు బీజేపీ సర్పంచ్ గంగమని సంఘీభావం తెలిపారు.
 • కామారెడ్డిలో సీపీఎం మహాజన పాదయాత్ర బృందాన్ని సతీష్ వర్మ కలిశారు. సతీష్ వర్మ విద్యారంగ అభివృద్ధి కోసం 1200 కి.మీటర్ల పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా తాను జరిపిన పాదయాత్ర విశేషాలను బృంద రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు తెలియచేశారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర సదాశివనగర్ కు చేరుకుంది. గ్రామంలోని ప్రజలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర బృందానికి సమస్యల కూడిన వినతిపత్రాన్ని అందించారు. కుల వివక్షత ఇంకా కొనసాగుతోందని గ్రామస్తులు తెలిపారు.
   
 • సీపీఎం మహాజన పాదయాత్ర 49వ రోజుకు చేరుకుంది. సీపీఎం జెండాను తమ్మినేని గారు ఎగరేసి పాదయాత్రను ప్రారంభించారు. మార్కల్ నుండి ప్రారంభమైన పాదయాత్ర కాసేపటి క్రితం సదాశివనగర్ కు చేరుకుంది. నేడు మల్లుపేట, గాంధారి ఎక్స్ రోడ్, మోడిగాం, భూంపల్లి, గుడిమెట్, జువ్వాడి ఎక్స్ రోడ్. ప్రాంతాల్లో మహాజన పాదయాత్ర జరగనుంది.
 • దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసీఆర్ మాట తప్పాడని, కాపలా కుక్కలా ఉంటానని చెప్పిన కేసీఆర్ గుంట నక్కలా తయారయ్యాడని సీపీఎం మహాజన పాదయాత్ర బృంద సభ్యుడు ఎండీ అబ్బాస్ పేర్కొన్నారు. పోసానిపేటకు చేరుకున్న అనంతరం ఆయన మాట్లాడారు.
 • తాను మూడేండ్ల నుండి అంగన్ వాడీ ఆయాగా పనిచేస్తున్నా జీతం ఒక్క రూపాయి ఇవ్వలేదని ఎండీ సమీన వాపోయింది. ఇస్రోజీపేటకు చేరుకున్న పాదయాత్ర బృందానికి ఆమె సమస్యలు తెలియచేసుకుంది.
 • 48వ రోజు కామారెడ్డిలో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. బీబీనగర్, ఇస్లాంపూర్ ప్రాంతాల్లో పర్యటించింది. అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుంది. బడుగు..బలహీన వర్గాలే ఎక్కువ శాతం అక్కడ జీవిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు తమ బాధను తెలియచేశారు.
 • ఇస్లాంపూర్ లో నెలకొన్న సమస్యలను సీపీఎం మహాజన పాదయాత్ర బృందం అడిగి తెలుసుకొంది. ఇంట్లోనే చాకలి బండ ఏర్పాటు చేసుకుని బట్టలు ఉతుకుతున్న వాళ్ళ పరిస్థితిపై బృందం ఆరా తీసింది.
 • ఇస్లాంపూర్ లో నెలకొన్న సమస్యలపై సీపీఎం మహాజన పాదయాత్ర బృందం తెలుసుకుంది. ముస్లిం మహిళలు..వృద్ధులు..ఇతరులు పాదయాత్ర బృందానికి సమస్యలు తెలియచేశారు.
 • 48వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర బీబీనగర్ స్లమ్ ఏరియాలో పర్యటించింది. అక్కడ నెలకొన్న సమస్యలపై బృందం ఆరా తీసింది. ప్రజలు పలు సమస్యలు బృందానికి తెలియచేశారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 48వ రోజుకు చేరుకుంది. నేడు కామారెడ్డి లోని బీడీ కాలనీ, గర్గుల్, ఇస్త్రోజి వాడి, పోసానిపేట్, మేషంపూర్, రంగపేట్, అడ్లూరు ఎల్లారెడ్డి, గాయత్రి షుగర్స్ ప్రాంతాల్లో మహాజన పాదయాత్ర జరగనుంది.
 • జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. 47వ రోజు ప్రారంభమైన పాదయాత్రకు స్వాతంత్ర్య సమరయోధురాలు మల్లు స్వరాజ్యం, ఎమ్మెల్యే సున్నం రాజయ్య సంఘీభావం తెలిపారు. కాసేపటి క్రితం సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం ప్రారంభమైంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 47వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని నర్సన్నపల్లి, పాతరాజాంపేట, సారంపల్లి ఎక్స్ రోడ్ లో సీపీఎం బృందం పర్యటించనుంది. కామారెడ్డిలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది.
 • కామారెడ్డిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో సీపీఎం మహాజన పాదయాత్ర అడుగు పెట్టింది. గురువారం రాత్రి చేరుకున్న పాదయాత్ర బృందానికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సమస్యలు తెలియచేశారు.
 • సీపీఎం మహాజన పాదయాత్రకు టిడిపి కామారెడ్డి కమిటీ సంఘీభావం ప్రకటించింది. కాసేపటి క్రితం పాదయాత్ర బృందాన్ని జిల్లా టిడిపి నేతలు కలిశారు.
 • కులాల పేరుతో ఎన్నాళ్లీ వివక్ష.. ఎన్నాళ్లీ దోపిడీ.. అని సీపీఎం మహాజన పాదయాత్ర బృంద సభ్యుడు జాన్ వెస్లీ పేర్కొన్నారు.
 • కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య నీటి మాటలేనని, పాదయాత్రకు అడుగడుగునా విద్యార్థుల మద్దతు ఉంటుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భానుప్రసాద్ ప్రకటించారు. కామారెడ్డి జిల్లా తూజల్పూర్ సభలో ఆయన మాట్లాడారు.
 • సీపీఎం మహాజన పాదయాత్రకు ఏఐఎసెఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాను ప్రసాద్, పీడీఎస్ యు జిల్లా అధ్యక్షులు రవీందర్ మద్దతు పలికారు.
 • జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర అడుగు పెట్టింది. 46వ రోజు గురువారం ఉదయం మల్కాపూర్ నుండి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ రోజు మల్కాపూర్, బీబీపేట, జనగామ్, సీతరాంపల్లి, అన్చనూర్, దోమకొండ, లింగుపల్లి, జోసిక్, బంగంపల్లిలో పాదయాత్ర జరగనుంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో అడుగు పెట్టింది. 45వ రోజు బుధవారం రాత్రి కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా గ్రామస్తులు..స్థానికులు..పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
 • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలేది అని సీపీఎం పాదయాత్ర బృంద సభ్యుడు అబ్బాస్ సూటిగా ప్రశ్నించారు. 45వ రోజు ప్రారంభమైన పాదయాత్ర బుధవారం రాత్రి రఘోత్తంపల్లికి చేరుకుంది.
 • బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం మహాజన పాదయాత్ర బృంద సభ్యురాలు రమ డిమాండ్ చేశారు. 45వ రోజు ప్రారంభమైన పాదయాత్ర బుధవారం రాత్రి రఘోత్తంపల్లికి చేరుకుంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర విజయవంతంగా కోనసాగుతుంది. కాసేపటి క్రితం రామక్కపెట్ కు చేరుకుంది. గ్రామస్తులు.. స్థానికులు ఘన స్వాగతం పలికారు.
 • దుబ్బాకలో సీపీఎం మహాజన పాదయాత్రలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కదం తొక్కారు. కాసేపటి క్రితం దుబ్బాకకు చేరుకున్న అనంతరం విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. 
 • దుబ్బాకకు సీపీఎం మహాజన పాదయాత్ర చేరుకుంది. అక్కడ గ్రామస్తులు..స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
 • గ్రామాల్లో వివక్ష కొనసాగుతోందని, కుల వృత్తులు కూలిపోతున్నాయని సీపీఎం మహాజన పాదయాత్ర బృంద సభ్యుడు ఎంవీ రమణ పేర్కొన్నారు. తిమ్మాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
 • కొత్త నోట్లు ప్రింట్ అయ్యేదాక పాతనోట్లను ఐదు నెలల పాటు కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. తిమ్మాపూర్ కు చేరుకున్న అనంతరం ఆయన మాట్లాడారు.
 • తెలంగాణ వచ్చింది కానీ మా బతుకులు మారలేదని గంగిరెద్దులను ఆడిస్తూ జీవనం సాగిస్తున్న జిడ్డి వెంకటయ్య, జిడ్డి కనకయ్యలు పేర్కొన్నారు. 45వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర తిమ్మాపూర్ లో కొనసాగుతోంది. గంగిరెద్దులు ఆడిస్తూ వెళుతున్న వారితో బృందం ముచ్చటించింది. 
 • బ్యాంకులు..ఏటీఎంల వద్ద నిలబడిన వారిలో ఎవరైనా కొటిశ్వర్లు..ధనవంతులు..నల్ల కుబేరులు..దొంగలున్నారా ? అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర 45వ రోజు తోర్నాల నుండి ప్రారంభమైంది. కాసేపటి క్రితం తిమ్మాపూర్ కు చేరుకుంది. అక్కడ ఆంధ్రాబ్యాంకు వద్ద పడిగాపులు పడుతున్న వారిని పాదయాత్ర బృందం పలకరించింది.
 • తిమ్మాపూర్ లో రైతుల రుణాలు మాఫీ కాలేదని రైతులు పేర్కొన్నారు. కాసేపటి క్రితం తిమ్మాపూర్ కు సీపీఎం మహాజన పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 45వ రోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం తోర్నాల నుండి యాత్ర ప్రారంభమైంది. దుబ్బాక నియోజకవర్గానికి చేరుకోనుంది. 
 • సిద్ధిపేటలో జరిగిన సభలో తమ్మినేని గారు మాట్లాడుతూ "మల్లన్న సాగర్"కి ఎవరైన అడ్డోస్తే చంపుతా అన్నావ్. నువ్వు ఉండే ప్రాంతానికి వచ్చాం. ఇంకో రోజు నీ జిల్లాలోనే ఉంటాం. దమ్ముంటే చర్చలకు పిలువు. నీనే వస్తా అని హరీష్ రావుకి తమ్మినేని సవాల్ విసిరారు. ప్రాజెక్టులకు మేం వ్యతిరేకం కాదు అని తెలిపారు. హైకోర్టు వేసిన మొట్టకాయలు సరిపోలేదా..? అని గుర్తుచేశారు. 
 • మహాజన పాదయాత్రకు మాజీ ఎంఎల్‌సీ, ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య సంఘీబావం తెలిపారు. సిద్ధిపేట బహిరంగ సభలో మాట్లాడుతూ. మిషన్ కాకతీయ,భగిరద ప్రాజెక్టులు మంచినీళ్ల కోసమా..? మీ పార్టీ కార్యకర్తల కమిషన్ల కోసమా..? గుంటలు తీసిన కాలువలో ఎక్కడ నీళ్ళు లేవు..? అని తెలిపారు. నీ పరిపాలనా పద్దతి మార్చుకో కేసీఆర్ అని పేర్కోన్నారు. రాష్రంలో విద్యావ్యవస్థ అస్థవ్యస్తంగా వుంది. సంక్షోభంలో ప్రభుత్వ విధ్య, వైద్య రంగాలు, 6 నెలల నుండి మధ్యాహ్నం భోజనానికి నిధులు ఇవ్వక పోతే. విద్యార్దులకు అన్నం ఎలా వండి పెడుతారు. అని కేసీఆర్ ను ప్రశ్నించారు.
 • మహాజన పాదయాత్ర కాసేపటి క్రితం సిద్దిపేదటకు చేరుకుంది. సిద్దిపేట భహిరంగ సంభలో జాన్ వెస్లీ మాట్లాడుతూ మహాజన పాదయాత్రను ఎవ్వడు అడ్డువచ్చినా నడిరోడ్డు మీద నిలబెట్టి ''సామజిక న్యాయం``ని సాధించుకుంటాం. అని తెలిపారు. . కేటిఆర్ జాగ్రత్త నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీ అబ్బాకూడా యాత్రను ఆపలేరు. అని జాన్ వెస్లీ హెచ్చరించారు. 
 • తెలంగాణ సమగ్రాభివృద్దే లక్ష్యం కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 44వ రోజు సిద్దిపేట జిల్లాలో కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా మెట్టు వద్ద మహాజన పాదయాత్ర 1100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 1100 కిలో మీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా.. తమ్మినేని బృందానికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. 
 • మహాజన పాదయాత్ర కి అడుగడుగునా ప్రజల నీరాజనాలు పలుకుతున్నారు.  చేగుంట నుండి వేలాది మందితో కర్నల్ పల్లికి పాదయాత్ర చేరుకుంది. 
 • తెలంగాణాలో సామాజిక సమరానికి సిద్దం అవుతామని సీపీఎం మహాజన పాదయాత్ర బృంద రథసారధి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. చేగుంటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో హామీలు అమలు చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, పరిపాలించే శక్తి లేకుంటే పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
 • నమో మోడీ..మౌన మోడీగా మారాడని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి విమర్శించారు. సీపీఎం మహాజన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. చేగుంటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. 90 శాతం నల్లధనం దేశాలలో ఉంది అని మోడీ పేర్కొనడం జరిగిందని, మరి నోట్ల రద్దు వల్ల ఎం ఉపయోగమని ప్రశ్నించారు. నోట్ల రద్దుకి వ్యతిరేకంగా రేపు దేశ వ్యాప్తంగా జరిగే బంద్ లో పాల్గొనాలని, ప్రజలు రోడ్ల మీదికి రావాలని ఏచూరి పిలుపునిచ్చారు.
 • చేగుంటలో ఏర్పాటు చేసిన సభలో ఏచూరి మాట్లాడారు. వర్గ, సామాజిక పోరాటాలతోనే మార్పు సాధ్యమన్నారు. సామాజిక పోరాటాలు నిర్వహించాలని మహాసభ పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగానే మహాజనపాద యాత్ర నిర్వహించడం జరుగుతోందన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ వివిధ రూపాల్లో సామాజిక ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. 70 ఏళ్లలో దళితులు, గిరిజనులు అభివృద్ధి చెందలేదని, వారికి అభివృద్ధి ఫలాలు అందడమే నిజమైన సామాజిక న్యాయమని తెలిపారు. దళితులు గిరిజనులను అభివృద్ధి చేసేందుకు లాల్, నీల్ జెండాలు ఏకమయ్యాయని పేర్కొన్నారు.
 • చేగుంటకు సీపీఎం మహాజన పాదయాత్ర చేరుకుంది. పాదయాత్రకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. జిల్లా సీపీఎం ఉద్యమ నిర్మాత కేవల్ కిషన్ సమాధి వద్ద ఏచూరి, తమ్మినేని, వెంకట్ లు నివాళులర్పించారు.
 • సీపీఎం మహాజన పాదయాత్రలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి పాల్గొన్నారు. కాసేపటి క్రితం చేగుంటకు పాదయాత్ర చేరుకుంది. పాదయాత్రకు ఏచూరి సంఘీభావం వెల్లడించారు.
 • సామజిక న్యాయ సాధనకై ప్రభుత్వంపై సమరం చేస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. శంకరావుపేట మండలానికి పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
 • గువ్వలపల్లి నుండి సీపీఎం మహాజన పాదయాత్ర ఆదివారం ఉదయం కొనసాగుతోంది. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ యువతీ, యువకులు కవాతు నిర్వహించారు. చేగుంటకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రానున్నారు. 
 • తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత ప్రాంతానికి వచ్చామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. శనివారం ఉదయం ముంబోజిపల్లి నుండి పాదయాత్ర కొనసాగింది. ఏక్కడ అభివృద్ధి అని తమ్మినేని ప్రశ్నించారు.
 • ముంబోజ్ పల్లి మండలంలో పాదయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబోజ్ పల్లి నుండి మెదక్ పట్టణానికి బయలుదేరుతోంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర వేయి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 40 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతోంది. కాసేపటి క్రితం కౌడిపల్లి శివారుకు చేరుకుంది. పాదయాత్ర బృంద రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేక్ ను కట్ చేశారు. ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
 • దున్నే వాడికి భూమి ఎంత ముఖ్యమో.. చదువు అంతే ముఖ్యమని పాదయాత్ర బృంద రథ సారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కౌడిపల్లికి చేరుకున్న పాదయాత్ర బృందానికి విద్యార్థులు..పలువురు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లాడారు. రాష్ట్రములో విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందన్నారు.
 • కౌడిపల్లికి సీపీఎం మహాజన పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా పాదయాత్రకి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా తమ్మినేనికి పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు.
 • నర్సాపూర్ ఎమ్మెల్యే సొంతూరు అయిన కౌడీపల్లి సర్కార్ పాఠశాల సమస్యల వలయంలో చిక్కుకుంది. 450 మంది విద్యార్థులుంటే తాగడానికి నీళ్లు లేవు. కాసేపట్లో ఈ స్కూల్ కు చేరుకోబోతున్న పాదయాత్ర బృందానికి స్వాగతం పలకడానికి, సమస్యలు చెప్పుకోవడానికి విద్యార్థులు వేచి చూస్తున్నారు.
 • సీపీఎం మహాజన పాదయాత్రకు మెదక్ జిల్లా సెంద్విక్ ప్రైవేటు కంపెనీ ఉద్యోగస్తులు మద్దతు తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించే విధంగా యాజమాన్యంపై వత్తిడి తీసుకరావాలని తమ్మినేనికి విన్నవించారు.
 • రాయిలాపూర్ నుండి సీపీఎం మహాజన పాదయాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. కౌడీపల్లికి పాదయాత్ర చేరుకోనుంది.
 • మహాజన పాదయాత్ర తునికి గ్రామానికి చేరుకుంది. గ్రామస్థులు కార్యకర్థలు పాదయాత్ర బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ సభలో తమ్మినేని గారు మాట్లాడుతూ డబల్ బెడ్ రూం ఇళ్ళ సాధన కై. పోరుకి సిద్దం కావాలి. అని పిలుపునిచ్చారు. అక్కడి గురుకుల పాఠశాలను పాదయాత్ర బృందం పరిశిలిచారు. తమ్మినేని గారు మాట్లాడుతూ పాఠశాలలో తాగటానికి మంచినీరు లేవు.6 నెలల నుండి సోప్ మని రాక విద్యార్థులు తీవ్రఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్యార్దులు సామాజిక న్యాయంకై..ఉద్యమించాలి. కుల వివక్షతను తీపికొట్టాలని తమ్మినేని గారు తెలిపారు.
 • తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన గృహానికి పెట్టిన పేర్లను మార్చాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. నర్సాపూర్ కు మహాజన పాదయాత్ర చేరుకున్న అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రజలతో మాట్లాడే అలవాటు లేని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఇంటికి మాత్రం ప్రజలను కలవడానికి "ప్రజాహితం ప్రాంగణం" అని పేరు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేదు కానీ నీ ఇంటికి మాత్రం "ప్రగతి పథం" అనే పేరు ఎందుకు..?అని ప్రశ్నించారు.
 • తమకు ఆరు నెలల నుండి సబ్బు మనీ ఇవ్వలేదని దౌల్తాబాద్ ఎస్సీ, బీసీ హాస్టల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దౌల్తాబాద్ చేరుకున్న మహాజన పాదయాత్ర బృందానికి తమ సమస్యలు తెలియచేశారు. హాస్టల్ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందో తెలియదని వాపోయారు.
 • మెదక్ జిల్లాలో మహాజన పాదయాత్ర అడుగు పెట్టింది. ఈ సందర్భంగా బోనాలు, బతుకమ్మలతో మహిళలు ఘన స్వాగతం పలికారు.
 • దౌల్తాబాద్ లో సీపీఎం మహాజన పాదయాత్ర 39వ రోజు గురువారం ఉదయం ప్రారంభమైంది. పాదయాత్ర బృందానికి పలువురు సమస్యలు తెలియచేశారు. రేషన్ కార్డులు..ఆధార్ కార్డులు..ఉండటానికి ఇళ్లు లేవని పలువురు వాపోయారు. బుడగ జంగలు, తొలుబోమ్మలు వృత్తి చేసే మహిళలు తమ సమస్యలు తెలియచేశారు.
 • ప్రతిపక్ష నాయకులకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని ఏకైక సీఎం కేసీఆర్‌ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
 • ప్రభుత్వం గత రెండేళ్ల కాలంగా రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొడుతోందని సీపీఎం పార్టీ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్ రావు వెల్లడించారు. సంగారెడ్డిలో మహాజన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు
 • తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగారెడ్డి పలు విమర్శలు గుప్పించారు. సంగారెడ్డిలో సీపీఎం మహాజన పాదయాత్రకు ఆయన సంఘీభావం ప్రకటించారు. 
 • సీపీఎం మహాజన పాదయాత్ర 38వ రోజుకు చేరుకుంది. కాసేపటి క్రితం సంగారెడ్డి నుండి పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రకు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంఘీభావం తెలిపారు.
 • 37వ రోజు మహాజన పాదయాత్ర కొనసాగుతుంది. కాసేపటి క్రితం సంగారెడ్డికి చేరుకుంది. పాదయాత్ర  వందలాది మంది ప్రజలు స్వాగతం పలికారు. సంగారెడ్డి లో బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
 • వున్నవూర్ కు చేరుకున్న మహాజన పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వినతిపత్రాలు పాదయాత్ర బృందం స్వీకరించింది.
 • ​కాసేపటి క్రితం సుల్తాన్ పూర్ మహాజన పాదయాత్ర చేరుకుంది. అక్కడ జేఎన్టీయూ వర్కర్లు ఘన స్వాగతం పలికారు.
 • చౌటకూరులో మహాజన పాదయాత్ర పర్యటించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను బృందం అడిగి తెలుసుకుంది. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు.
 • ​మహాజన పాదయాత్ర 37వ రోజుకు చేరుకుంది. కాసేపటి క్రితం అందోల్ నుండి పాదయాత్ర ప్రారంభమైంది. 
 • మహాజన పాదయాత్ర విజయవంతంగా 900కి.మీలు పూర్తి చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో 900కి.మీలు పూర్తి సందర్బంగా భారి భహిరంగ సభ ఏర్పాటు చేశారు.  ప్రజలు కార్యకర్తలు పేద్ధ సంఖ్యలో పాల్గోన్నారు. పాదయాత్రకు టీడిపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్ధతు తెలిపారు.
 •  మహాజన పాదయాత్ర సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చేరుకుంది. నాయకులు ప్రజలలు ఘనంగా స్వాగాతం పలికారు. పాదయాత్ర బృందం  చేనేత  పరిశ్రమ  సందర్శించారు. బృందం సభ్యులకు  లాల్ నిల్  రంగులతో  తయారు చేసిన చేనేత మగ్గలను పాదయాత్ర బృందానికి బహూకరించారు. 
 • సంగారెడ్డి జిల్లాలో మహాజన పాదయాత్ర కోనసాగుతుంది. కాసేపటి క్రితం వట్ పల్లి గ్రామానికి చేరుకుంది. పాదయాత్రకు టీడిపి మాజీ ఎమ్మెల్యే జయపాల్ రెడ్డి సంఘీభావం తెలిపారు.
 • మహాజన పాదయాత్ర 36వ రోజుకు చేరుకుంది. ఈరోజు సంగారెడ్డి జిల్లా నాగులపల్లి నుండి ప్రారంభమైన పాదయాత్ర కాసేపటి క్రితం తెల్లముల గ్రామానికి చేరుకుంది. అక్కడి గ్రామస్తులు నాయకులు పాదయాత్ర బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్రకు ప్రముఖ న్యాయవాది సంఘమేశ్వర్ మద్ధతు తెలిపారు. 
 • మహాజన పాదయాత్ర కాసేపటి క్రితం రాయ్ కోడ్ మండల్ లోకి ప్రవేశించింది. రాయ్ కోడ్ మండలంలో నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
 • 93 శాతం ప్రజలు అణచివేతకు గురవుతున్నారని, ఏడు శాతం ఉన్న అగ్ర కులాలు పెత్తనం చెలాయిస్తున్నాయని సీపీఎం పాదయాత్ర బృంద సభ్యుడు ఆశయ్య పేర్కొన్నారు. అణిచివేతపై తిరగబడి పోరుచేయాలని సూచించారు.
 • హుద్నూర్ గ్రామంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు పాదయాత్ర బృందానికి తెలియచేశారు. పాదయాత్ర బృందం హుద్నూర్ లో పర్యటించింది. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు.
 • మహాజన పాదయాత్ర మల్కన్ పాడ్ కు చేరుకుంది. అక్కడ ప్రజల సమస్యలను బృంద సభ్యులు తెలుసుకుంటున్నారు. కంది రైతుల సమస్యలను తమ్మినేని అడిగి తెలుసుకున్నారు.
 • సెజ్ ల పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. 17 గ్రామాల పరిధిలో 12,600 ఎకరాలు బలవంతంగా లాక్కొంటున్నారని విమర్శించారు. ఝురా సంగం (మం) నుండి ఎలగోయికు మహాజన పాదయాత్ర చేరుకుంది.
 • ఒక్క భారత దేశంలోనే కులం పేరుతో తక్కువ ఎక్కువ అనే నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉందని పాదయాత్ర బృంద సభ్యుడు జాన్ వెస్లీ పేర్కొన్నారు. ఎవరో వస్తారని.. ఏ పార్టీయో వచ్చి జీవితాల్ని బాగు చేస్తుందనుకోకుండా.. సమస్యలపై కొట్లాడి దోచుకుతింటున్న వాళ్ళను బొంద పెట్టాలన్నారు.
 • దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు పాదయాత్ర రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను సన్మానించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు.
 • జిల్లాలో 34వ రోజు శనివారం పాదయాత్ర కొనసాగుతోంది. ఝరాసంగం (మం) బర్దీపూర్ నుండి పాదయాత్ర ప్రారంభమైంది. ఎలిగోయి, మల్కాన్ పాడు, హత్తులూరు, రాయకోడ్ లలో పాదయాత్ర జరగనుంది.
 • జహీరాబాద్ లో అడుగు పెట్టిన మహాజన పాదయాత్ర బృందానికి పలువురు సమస్యలు తెలియచేశారు. బృందానికి వినతిపత్రాల వెల్లువెత్తింది.
 • జహీరాబాద్ లో పలు సమస్యలతో బాధ పడుతున్నామని స్థానికులు తెలియచేశారు. మహాజన పాదయాత్ర బృందానికి వినతిపత్ర సమర్పించారు.
 • తెలంగాణ రాష్ట్రంలో కూడా దళితుల పరిస్థితి ఏ విధంగా ఉందో కళాకారులు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. జహీరాబాద్ లో వీరి ప్రదర్శన ఆకట్టుకుంది. 
 • జహీరాబాద్ లో పాదయాత్రకు జనం నీరాజనం పట్టారు. కాసేపటి క్రితం పాదయాత్ర బృంద సభ్యులు జహీరాబాద్ లో అడుగు పెట్టారు. అక్కడనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
 • పాదయాత్ర బృంద సభ్యుడు అబ్బాస్ ఉర్దూలో ప్రసంగించారు. హుగ్గేల్లి నుండి కొనసాగిన పాదయాత్ర కాసేపటి క్రితం రంజోల్ చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో అబ్బాస్ మాట్లాడారు. సబ్ లోక్ మిల్ కే లండింగే అని పిలుపునిచ్చారు.
 • హుగ్గేల్లి నుండి సీపీఎం మహాజన పాదయాత్ర శుక్రవారం ఉదయం కొనసాగుతోంది. కాసేపటి క్రితం రంజోల్ కు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో నేతలు మాట్లాడుతున్నారు.
 • పీచర్యగడి గ్రామానికి చెరువే లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. సీపీఎం మహాజన పాదయాత్రకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పాదయాత్ర బృందానికి సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. 
 • అణగారిన కులాలన్నింటినీ ఏకం చేసి.. తెలంగాణ లో సామజిక రాజ్యం నెలకొల్పుతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నేటికి నెల రోజుల నుండి 800 కి.మీ 125 గ్రామాల్లో పాదయాత్ర చేయడం జరిగిందన్నారు.
 • ఏ ఒక్కరికి 'డబుల్ బెడ్ రూం ఇళ్లు లేదు..దళితులకు భూమి లేదు' అంటూ మాచిరెడ్డి పల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి గ్రామానికి చేరుకున్న పాదయాత్ర బృందానికి సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు.
 • బీసీలకు వాటా ఇవ్వకుండా కేసీఆర్ దొంగ నక్రాల్ చేస్తుండ అని బీసీ సంఘం జిల్లా నాయకులు బీరయ్య విమర్శించారు. గురువారం సంగారెడ్డిలో పర్యటించింది. ఓ సభలో ఆయన మాట్లాడారు.
 • సామాజిక తెలంగాణ కోసమే పని చేస్తున్నామని చెబుతున్న కేసీఆర్ కు సామాజిక తెలంగాణ కోసం చేస్తున్న మహాజన పాదయాత్రను చూస్తే ఎందుకు భయం అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. తెలంగాణ లో అగ్రకుల రాజ్యం నడుస్తోందని తెలిపారు. ఆయన సంగారెడ్డిలో ప్రెస్ మీట్..సభలో మాట్లాడారు. కాంట్రాక్టు వర్కర్లను రెగ్యులరైజ్ చేయకపోవడానికి వెనుక సామాజిక కోణం ఉందని, వీళ్ళంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కాబట్టే రెగ్యులరైజ్ చెయ్యట్లేదని తమ్మినేని తెలిపారు.
 • తమకు ఎందుకు ఫించన్ రాదని కొంతమంది వృద్ధులు ప్రశ్నిస్తున్నారు. సంగారెడ్డిలో పర్యటిస్తున్న పాదయాత్ర బృందానికి తమ బాధలు చెప్పుకున్నారు.
 • దేశంలో సామజిక అన్యాయం కొనసాగుతోందని సీపీఎం మహాజన పాదయాత్ర బృంద సభ్యుడు జాన్ వెస్లీ పేర్కొన్నారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడారు.
 • అతివర్షాల వల్ల గ్రామంలో పంటలు దెబ్బతిన్నాయని మనియార్ పల్లి గ్రామస్తులు పేర్కొన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర బృందానికి సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 800 కి.మీటర్లు పూర్తి చేసుకుంది. కాసేపటి క్రితం సంగారెడ్డిలో అడుగు పెట్టింది. ఘనంగా నీల్..లాల్ జెండాలతో బృందానికి స్వాగతం పలికారు.
 •  
 • తోర్ మామిడిలో గురువారం ఉదయం 9గంటలకు సీపీఎం మహాజన పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. రాళ్లు..రప్పలపై బృంద సభ్యులు నడుస్తున్నారు. నీల్..లాల్ జెండాలతో పాదయాత్ర ప్రభంజనంగా దూసుకపోతోంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర తోర్ మామిడికి చేరుకుంది. బుధవారం రాత్రికి చేరుకున్న అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాదయాత్ర బృంద సభ్యులు ప్రసంగించారు.
 • గుండెపోటుతో మృతి చెందిన దళితుడు శివప్ప కుటుంబాన్ని పాదయాత్ర బృందం పరామర్శించింది. కుటుంసభ్యులను బృంద సభ్యులు ఓదార్చారు.
 • మహాజన పాదయాత్రలో ఎన్నో వెలుగు చూస్తున్నాయి. రొంపల్లి, బంట్వారం పాఠశాలల దుస్థితి చూసి బృందం ఆశ్చర్యపోయింది. రొంపల్లిలో 78 మంది విద్యార్థులున్నా ఒక్క టీచర్ లేకపోవడం..బంటార్వంలో 80 మంది విద్యార్థులుంటే ఒక్క స్కూల్ టీచర్ లేడు. ఇక్కడ ఆరు మంది విద్యావాలంటీర్లు ఉన్నారు. 
 • పాదయాత్ర ముగిసే లోపు సమస్యలు పరిష్కరించకుంటే సమర శంఖం పూరిస్తామని మహాజన పాదయాత్ర బృంద సభ్యుడు రమణ పేర్కొన్నారు. పెండ్యాలకు చేరుకున్న అనంతరం ఆయన మాట్లాడారు.
 • కోట్ పల్లి మండలంలోని హోగ్లాపూర్ లో ఎన్నో సమస్యలు నెలకొన్నాయి. పాదయాత్ర బృందం పర్యటనలో ఈ విషయాలు వెలుగుచూశాయి. పాదయాత్ర బృందానికి గ్రామస్తులు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.
 • మహాజన పాదయాత్ర పెద్దముల్ మండలంలో కొనసాగుతోంది. కాసేపటి క్రితం మరేపల్లిలోని కేజీబీవీ హాస్టల్ కు చేరుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. విద్యార్థులతో పాదయాత్ర బృందం ముచ్చటించింది.
 • గిరిజన వలసలు నివారించాలని పాదయాత్ర బృంద సభ్యుడు శోభన్ నాయక్ డిమాండ్ చేశారు. పెద్దమూల్ గ్రామంలో పాదయాత్ర కొనసాగుతోంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు అధికంగా నివాసం ఉంటున్న ప్రాంతంలో ఓ పరిశ్రమ పెట్టవచ్చని, తద్వారా వలసలను నివారించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
 • పెద్దమూల్ గ్రామంలోని హాస్టల్ ను పాదయాత్ర బృందం సందర్శించింది. అనంతరం విద్యార్థులతో పాదయాత్ర బృందం అల్పాహారం చేసింది.
 • మహాజన పాదయాత్ర బుద్దారం గ్రామం నుండి కొనసాగుతోంది. పెద్దమూల్ గ్రామంలో చెప్పులు కుడుతున్న మాదిగ రత్నయ్యతో యాత్ర బృంద సభ్యుడు జాన్ వెస్లీ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
 • మహాజన పాదయాత్ర బుద్దారం గ్రామానికి చేరుకుంది. పాదయాత్ర బృందానికి గ్రామస్తులు పేద్ధ సంఖ్యలో స్వాగతం పలికారు. 760 కిమీ పూర్తి చేసుకుంది.
 • మహాజన పాదయాత్ర తాండూరు గ్రామానికి చేరుకుంది. పాదయాత్ర బృందానికి ఆ ప్రాంత బిజేపి, టిడిపి నాయకు స్వాగతం పలికారు. అనంతరం తమ్మినేని గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
 • మహాజన పాదయాత్ర 30వ రోజుకు చేరుకుంది ముంబాపూర్ నుండి  పెద్దవేముర్ వరకు నేడు కొనసాగనుంది.
 • వికారాబాద్ లో 29వ రోజు కొనసాగిన సీపీఎం మహాజన పాదయాత్ర కాసేపటి క్రితం మంబాపూర్ కు చేరుకుంది. ఈ రోజు 30 కి.మీ.పాదయాత్ర జరిగింది. మొత్తంగా పాదయాత్ర 734 కి.మీటర్లు పూర్తి చేసుకుంది.
 • సీఎం కేసీఆర్ వన్నీ బూటకపు మాటలేనని ప్రజలు తమకు తెలియచేస్తున్నారని మహాజన పాదయాత్ర బృంద రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కాసేపటి క్రితం మంబాపూర్ కు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
 • పేద ప్రజలకు భూ పంపిణీ చేయకుండా, ఉద్యోగాలు..విద్యా వ్యవస్థ మార్చకుండా సీఎంగా ఎవరు ఉండమన్నారని సీపీఎం మహాజన పాదయాత్ర బృంద సభ్యుడు జాన్ వెస్లీ పేర్కొన్నారు. మంబాపూర్ కు యాత్ర చేరుకుంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర మన్ సన్ పల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు..స్థానికులు పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా కళాకారులు ఆట..పాటతో సందడి చేశారు.
 • మహాజన పాదయాత్ర..ప్రతిపక్షాలు చేస్తున్న యాత్రల గురించి రాష్ట్ర మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. పాదయాత్రలపై మంత్రి కేటీఆర్ పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై తమ్మినేని స్పందించారు.
 • మహాజన పాదయాత్ర వికారాబాద్ జిల్లా కేంద్రం నుండి ప్రారంభైన యాత్ర దాలూరు మండలం కేరేలి గ్రామానికి చేరుకుంది  MRPS నాయకులు పూల వర్షంతో  ఘనస్వాగతం పలికారు. 
 • 29వ రోజు వికారాబాద్ జిల్లా కేంద్రం నుండి ప్రారంభమైన మహాజన పాదయాత్ర.
 • దమ్ము ఉంటే ప్రజలోకి రావాలని కేసీఆర్ కు తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వికారాబాద్ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో రాష్ట్రం అభివృధి జరగాలంటే సామజిక న్యాయం జరగాలని, ప్రజలకు కావలసింది బంగారు తెలంగాణ కాదని బతుకు తెలంగాణా కావాలన్నారు. విద్య వైద్యం బాగుపడినప్పుడే దేశం బాగుపడుతుందన్నారు. తెలంగాణ అంటే కమ్యూనిస్టులు..కమ్యూనిస్టులు అంటే తెలంగాణ అని తెలిపారు. నువ్వు చేసిన హామీలు అమలు చేసినట్లు నిరూపించుకోకపోతే అసెంబ్లీ సాక్షిగా ముక్కు నేలకు రాస్తావా అని తమ్మినేని ప్రశ్నించారు. గిన్నిస్ బుక్ ల కోసం తాము పాదయాత్ర చేయడం లేదని, తెలంగాణ బ్రతుకులు మారటం కోసమన్నారు.
 • తెలంగాణ అందరూ కోరుకురన్నారని కానీ భౌగోళిక తెలంగాణ కోరుకోలేదని సామజిక తెలంగాణ కోరుకున్నారని ప్రొ. హర గోపాల్ పేర్కొన్నారు. వికారాబాద్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ప్రజానాయకుడు తమ్మినేని అని, రాజకీయం అంటే సమస్యలు పరిష్కారం చేయాలని సూచించారు.
 • మహాజన పాదయాత్ర 700 కి.మీటర్లు పూర్తి చేసుకుంది. వికారాబాద్ కు చేరుకున్న పాదయాత్ర బృందానికి స్థానికులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ్మినేని కేక్ కట్ చేశారు.
 • మహాజన పాదయాత్ర కు రాజ్యసభ సభ్యుడు టి.టిడిపి నాయకులు దేవేందర్ గౌడ్ కుమారుడు తెలంగాణ తెలుగు యువత అద్యక్షులు వీరేంద్రగౌడ్ మద్దతు పలికారు. ఆయనతో పాటు టి.టిడిపి వికారాబాద్ జిల్లా అద్యక్షులు సుభాష్ యాదవ్ మద్దతు తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర విజయంతంగా కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు పలువురు సంఘీభావం ప్రకటిస్తున్నారు. కాసేపటి క్రితం ప్రొ.హరగోపాల్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు.
 • కాసేపట్లో వికరాబాద్ కు సీపీఎం మహాజన పాదయాత్ర చేరుకోనుంది. మార్గమధ్యలో పాదయాత్ర బృంద రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సతీమణి ఉమ పాదయాత్రలో పాల్గొన్నారు.
 • తెలంగాణా రాష్ట్రం చదువులో 64శాతం ఉంటే కేరళలో 98 శాతం ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఏ రాష్ట్రం నెంబర్ ఒన్ మీరే తేల్చాలని సూచించారు. మద్గులు చిట్టాంపల్లి గ్రామంలో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.
 • పరిగి పట్టణం నుండి ప్రారంభమైన పాదయాత్ర నస్కల్ గ్రామానికి చేరుకుంది.  పాదయాత్రకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.
 • 28వ రోజుకు చేరిన మహాజన పాదయాత్ర పరిగి పట్టణంలో డప్పుల చప్పులతో గజ్జల మోతలతో దుమ్ము లేపుతు విశేష మద్దతు పలికిన ప్రజలు.
 • 27వ రోజు మహాజన పాదయాత్ర  పరిగి మండలం కేంద్రంలో ముగిసింది. 
 • ఈ సందర్భంగా ప్రసంగించిన తమ్మినేని.. 'అభివృద్ధి అంటే రోడ్లు, బిల్డింగులు పెరగడం కాదు.. ప్రజల బతుకుల్లో మార్పు రావడమే నిజమైన అభివృద్ధి. తెలంగాణలో సామాజిక రాజ్యం వచ్చే వరకు సీపీఎం రాజీలేని పోరాటాలు చేస్తుంది' అని తమ్మినేని వీరభద్రం తెలిపారు. 
 • తెలంగాణలో కమ్యూనిస్టు పోరాటాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్థానిక బీఎస్పీ నేతలు ప్రకటించారు. వీరు సీపీఎం మహాజన పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. 
 • మహాపాదయాత్రకు మద్దతు తెలుపు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడారు. కేసీఆర్ ముందు కూర్చుని ముఖ్యమంత్రిని నిలదీసిన ఏకైక వ్యక్తి తమ్మినేని వీరభద్రం అని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా పోరాటాల్లో తమ మద్ధతు ఉంటుందని సంఘీభావం తెలిపారు. 
 • భారతదేశంలో పేద ప్రజల కోసం సీపీఎం కొట్లాడుతోందని బీసీ సంఘం నేత ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం మాయల ఫకీర్ మాటలు ఆపాలని, దేశంలో మార్పు కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందని కృష్ణయ్య తెలిపారు. కేసీఆర్ దొర పాలన కూల్చడం కమ్యూనిస్టువల్లే అవుతుందని అన్నారు. మన రోజులు రావాలంటే కమ్యూనిస్టులను ఆదరించాలని, నిజాయితీ నిబద్ధత కలిగిన ఏకైక పార్టీ సీపీఐఎం అని కృష్ణయ్య కొనియాడారు. 
 • బహిరంగ సభలో పాదయాత్ర ఉపనాయకులు జాన్ వెస్లీ ప్రసంగించారు. దళితుల సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమయ్యిందని మండిపడ్డారు. దళితులపై ఇంకా కుల వివక్ష కొనసాగుతోందని జాన్వెస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు భూమి లేదంటూనే కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా భూములు కట్టబెడుతున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. 
 • పరిగి మండల కేంద్రంలో మహాజన పాదయాత్ర బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సంఘీభావంగా కాంగ్రెస్, టీడీపీ, ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, బీసీ సంఘం నేతలు సభలో పాల్గొని ప్రసంగించారు. 
 • మహాజన పాదయాత్రకు బిసి సంఘం అధ్యక్షులు ఎం.ఎల్.ఏ ఆర్. కృష్టయ్య మద్దతు తెలిపారు. మరియు టీడీపీ,కాంగ్రేస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు గ్రామస్తులు పాదయాత్రకు  ఘనంగా స్వాగతం పలికారు.
 • పరిగి మండలంలోని రాఘవపూర్, సయ్యద్ మల్కాపూర్ మీదుగా పాదయాత్ర పరిగి మండల కేంద్రానికి చేరుకుంది. 
 • బొంపల్లిలో సభను ముగించుకున్న పాదయాయాత్ర బృందం పరిగిమండంలోకి చేరుకుంటుండగా స్థానిక కాంగ్రెస్, టీడీపీ లీడర్లు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రకు స్వాగతం పలికారు. 
 • బొంపల్లి గ్రామ విద్యార్థులు తమ సమస్యలను పాదాయాత్ర బృందానికి వినతి పత్రం రూపంలో తెలియజేశారు. 
 • మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పాదయాత్రకు సంఘీభావం ప్రకటిస్తూ బొంపల్లి సభలో ప్రసంగించారు. 
 • సీపీఎం మహాజన పాదయాత్ర 27వ రోజు శనివారం మధ్యాహ్నం బొంపల్లి గ్రామానికి చేరుకుంది. గ్రామ సర్పంచి, స్థానికులు. పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు.
 • కుడుగోని పల్లి స్థానిక యూపీఎస్ పాఠశాలను పాదయాత్ర బృందం సందర్శించింది. 
 • స్థానిక మహిళలలు లక్ష్మమ్మ, రాములమ్మ పాదయాత్ర బృందానికి తమ గోడు విన్నవించుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూ.. తమ బాధను వెల్లగక్కారు. ఎర్ర జెండా మీకు అండగా ఉంటుంది కలిసి కొట్లాడుదాం పదంటూ తమ్మినేని వీరభద్రం బాధితులలో దైర్యాన్ని నింపారు. 
 • కుడుగోని పల్లిలో మాట్లాడిన రమన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటి పిల్లలు అగ్రకులాల వారితో సమానంగా అభివృద్ధి కావాలంటే కామన్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని పాదయాత్ర బృంద సభ్యులు ఎం.వీ రమణ డిమాండ్ చేశారు. 
 • స్థానిక విద్యార్థులు పాదయాత్ర బృందానికి తమ పాఠశాల సమస్యలను చెప్పుకుంటూ వినతిపత్రాన్నిచ్చారు. 
 • కూడుగోని పల్లి గ్రామం నుంచి బాసుపల్లి  గ్రామానికి చేరుకుంది. సీపీఎం పార్టీ కార్యకర్తలు, ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కళాకారులు పాటలతో హోరెత్తించారు. 
 • కుడుగోను పల్లి సభలో మాట్లాడిన తమ్మినేని అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు నిధులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. 
 • మహాజన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. దోమ మండలంలోని కూడుగొని పల్లి గ్రామానికి చేరుకుంది. పాదయాత్ర బృందానికి గ్రామస్తులు పలువురు కార్యకర్తలు పాదయాత్రకు ఘనంగా స్వాగాతం పలికారు.
 • కనుముని పల్లి నుంచి పాదయాత్రగా వెళ్తున్న బృందానికి స్థానిక కార్మికులు ఎదరుగా వచ్చారు. బంగారు తెలంగాణలో మా బతుకులు మారవా సారూ అంటూ కార్మికులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. వారికి దైర్యాన్నిచ్చిన బృంద సభ్యులు కార్మికుల సమస్యలపై సీపీఎం పోరాడుతోందని కలిసి రావాలని కోరారు. 
 • కమునిపల్లి చేరుకున్న యాత్రకు స్థానికులు తమ సమస్యలను విన్నవించుకన్నారు. 
 • సీపీఎం మహాజన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర 27వ రోజుకు చేరుకుంది. నేడు కుల్కచర్ల గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభమైంది.
 • రాష్ట్ర ముఖ్యమంత్రికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మరో లేఖ రాశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 26వ రోజు మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆయన 19 లేఖలు రాసిన సంగతి తెలిసిందే. చేనేతలు చాలా కష్టాల్లో ఉన్నారని, అమరచింతలో 120 మగ్గాలు మూతపడ్డాయని 20వ లేఖలో పేర్కొన్నారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర బృందానికి మహ్మదాబాద్ వాసులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. కాసేపటి క్రితం మహ్మదాబాద్ కు చేరుకున్న పాదయాత్ర బృందానికి వారు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
 • గండ్వీడ్ మండలానికి చేరుకున్న పాదయాత్ర బృందానికి మండల కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. నేతలు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. 
 • సీపీఎం మహాజన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్రకు 26వ రోజుకు చేరుకుంది. కాసేపటి క్రితం కన్వాడ గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభమైంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 25వ రోజు జేపీఎన్ ఈ ఎస్ కాలేజీ నుండి ప్రారంభమై 23.1 కి.మీలు కోనసాగిన పాదయాత్ర కన్వాడ గ్రామంలో ముగిసింది. 
 • తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ అభివృద్ధి జరగాలని సీపీఎం మహాజన పాదయాత్ర బృంద రథసారధి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. 25వ రోజు పాదయాత్ర కొనసాగుతోంది. మహబూబ్ నగర్ టౌన్ చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని ప్రసంగించారు. పారిశ్రామిక విధానం కార్పొరేట్ శక్తులకు మేలు జరిగే విధంగా ఉండవద్దని సూచించారు.
 • హామీలిచ్చి చేయని వారి గల్లా పట్టుకుని నిలదీయాలని సీపీఎం మహాజన పాదయాత్ర బృంద రథసారధి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. 25వ రోజు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది.
 • 'సారూ మాకు ఉండడటానికి ఇళ్లు లేదు..సర్కార్ ఏమో ఇళ్లు కటిస్తానన్నది..కానీ కాలం గడిచిపోతోంది. కానీ ఒక్క ఇళ్లు కట్టివ్వలేదు..మీరైనా చెప్పండి సారూ..మాకు ఇళ్లు కావాలె' అంటూ ప్రజలు కోరుతున్నారు. 25వ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. 
 • పాలమూరు వర్సిటీలో నాణ్యమైన విద్యను అందుకోలేక పోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర బృందానికి సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. 
 • తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి సీపీఎం మహాజన పాదయాత్రకు మద్దతు తెలిపారు. కాసేపటి క్రితం పాలమూరు యూనివర్సిటీకి చేరుకున్న బృందానికి ఆయన ఘన స్వాగతం పలికారు.
 • మహబూబ్ నగర్ జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర అడుగు పెట్టింది. జిల్లాలోకి ప్రవేశించిన అనంతరం మున్సిపల్ కార్మికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ సమస్యలు బృందానికి తెలియచేశారు.
 • ముస్లీంలకు హామీనిచ్చిన విధంగా రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ఆల్ మైనార్టీస్ ఎంప్లాయిస్ మరియు వర్కర్స్ అసోసియేషన్ కోరింది. సీపీఎం మహాజన పాదయాత్ర రాజీవ్ గృహకల్పలో పర్యటించింది. ఈ సందర్భంగా పాదయాత్ర బృందానికి మైనార్టీ సోదరులు స్వాగతం తెలిపారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు.
 • సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు సీపీఎం మహాజన పాదయాత్రలో రెండో రోజు పాల్గొన్నారు. కాసేపటి క్రితం జేపీఎన్ ఈఎస్ కాలేజీ వద్ద పాదయాత్ర ప్రారంభమైంది. ధర్మాపూర్ మీదుగా పాదయాత్ర కొనసాగుతోంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం జేపీఎన్ ఈ ఎస్ కాలేజీ నుండి పాదయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం ధర్మాపూర్ లో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది.
 • మహాజన పాదయాత్ర విజయవంతంగా 600 కిమీ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పాదయాత్ర రథ సారధి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. నాలుగు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంటామని చెప్పడానికి 600 కిమీ మైలురాయి సూచిక అని తెలిపారు. 
 • ఈ సందర్భంగా పాదయాత్ర డిప్యూటి లీడర్ జాన్ వెస్లీ మాట్లాడారు. ''తెలంగాణలో మాజిక సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తాం. సామాజిక శక్తులను ఏకం చేస్తాం.' అని జాన్ వెస్లీ  పిలుపునిచ్చారు. లాంగ్ లీవ్ మహాజన పాదయాత్ర నినాదాలతో సభా స్థలి హోరెత్తింది. 
 • చిన్నచింతకుంట మండలం లాల్ కోట గ్రామములోకి మహాజన పాదయాత్ర చేరుకుంది. అక్కడ స్థానికులు..గ్రామస్తులు పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు.
 • గత రెండున్నర సంవత్సరాల పాలనలో హామీలను ఊరిస్తూనే ఉన్నారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీపీఎం మహాజన పాదయాత్ర బృంద సభ్యుడు జాన్ వెస్లీ పేర్కొన్నారు. మహాజన పాదయాత్ర 24వ రోజు బుధవారం సాయంత్రం దేవరకద్రకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో జాన్ వెస్లీ ప్రసంగించారు.
 • పీఎం మహజన పాదయాత్ర దేవరకద్రకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాదయాత్ర బృంద సభ్యుడు జాన్ వెస్లీ ప్రసంగిస్తున్నారు.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 24వ రోజు బుధవారం మధ్యాహ్నం మునిగోయినపల్లికి చేరుకుంది. అక్కడ స్థానికులు..గ్రామస్తులు పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు.
 • సామాజిక చైతన్య యాత్ర ద్వారా చైతన్యం పొందిన ప్రజలు పాదయాత్రను ఆదరిస్తున్నారని, తెలంగాణ గడ్డపై ఇదొక చరిత్ర అని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. దేవరకద్రలోని లాల్ కోట వద్ద 24వ రోజు బుధవారం ఉదయం ప్రారంభమైన పాదయాత్రకు ఆయన సంఘీభావం ప్రకటించారు.
 • సీపీఎం మహాజన పాదయాత్రలో ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. 24వ రోజు బుధవారం ఉదయం ప్రారంభమైన పాదయాత్ర లాల్ కోట వద్దకు చేరుకుంది.
 • వనపర్తి జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. నేడు 24వ రోజు లాల్ కోట చౌరస్తా, దేవరకద్రలో పాదయాత్ర జరగనుంది. మధ్యాహ్నం దేవరకద్రలో బహిరంగసభ జరగనుంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర 23వ రోజు కొనసాగుతోంది. ఉదయం అమరచింతలో పర్యటించిన పాదయాత్ర కాసేపటిక్రితం చిన్నచింతకుంటకు చేరుకుంది.
 • సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. నేడు 23వ మంగళవారం అమరచింతలలో పర్యటించింది. పాదయాత్రలో  సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పాల్గొన్నారు. పాదయాత్ర బృందానికి పలువురు సమస్యలతో కూడిన వినతిపత్రాలు సమర్పించారు. 
 • డబుల్ బెడ్ రూమ్, దళితులకు 3 ఎకరాలు పంచినట్లు నిరూపణ చేస్తారా అని సర్కార్ కు మహాజన పాదయాత్ర బృంద రథసారధి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. 22వ రోజు సోమవారం రాత్రి ఆత్మకూరుకు పాదయాత్ర చేరుకుంది.
 • ఆత్మకూరును రెవెన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్ కు తమ్మినేని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నిరాహార దీక్ష చేస్తున్న వారికి తమ్మినేని నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. మహాజన పాదయాత్ర 22వ రోజు సోమవారం రాత్రి ఆత్మకూరుకు చేరుకుంది.
 • తెలంగాణాలో 93 శాతం ఉన్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వాటా కోసం పాదయాత్ర చేస్తున్నట్లు నైతం రాజు వెల్లడించారు. మదనాపురంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
 • మదనాపురానికి సీపీఎం మహాజన పాదయాత్ర బృందం చేరుకుంది. 22వ రోజు పాదయాత్ర కొనసాగుతోంది. అంతకంటే ముందు మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలను పాదయాత్ర బృంద సందర్శించింది.
 •  కొత్తకోటకు సీపీఎం మహాజన పాదయాత్ర చేరుకుంది. అక్కడ సీపీఎం పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అంతకముందు కానాయిపల్లి గ్రామంలో శంకర సముద్రం రిజర్వాయర్ పనులను పాదయాత్ర బృందం పరిశీలించింది.
 • గిరిజనుల పై వివక్షత కొనసాగుతోందని సీపీఎం మహాజన పాదయాత్ర బృంద సభ్యుడు శోభన్ నాయక్ పేర్కొన్నారు. 22వ రోజు రాజంపేటలో పాదయాత్ర కొనసాగుతోంది.
 • వనపర్తి జిల్లాలో మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. నేడు 22వ రోజు సోమవారం ఉదయం రాజంపేట నుండి పాదయాత్ర కొనసాగుతోంది.
 • ఎక్కడ చూసినా పంటలు ఎండిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. తెలంగాణాలో పాలించే పద్దతిలో మార్పు రావాలని, లేకపోతే మిమ్మల్ని మార్చడం జరుగుతుందని హెచ్చరించడానికే మహాజన పాదయాత్ర సాగుతోందన్నారు. వనపర్తి పట్టణంలోని కృష్ణ దేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
 • రాష్ట్రం బాగు పడాలంటే కమ్యూనిస్టులు ఏకం కావాలని సినిమా నిర్మాత, హీరో మాదాల రవి పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం 21వ రోజు కృష్ణ దేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బహిరంగసభ జరిగింది. పాదయాత్రతోనే తమ్మినేని విప్లవ శంఖం ఊదారని, అగ్ని కంటే నిజం కమ్యూనిజమని మాదాల రవి పేర్కొన్నారు.
 • కేసిఆర్ ప్రభుత్వ పాలన రెండు సంవత్సరాలు పూర్తి అయ్యిందని, కానీ అట్టడుగున ఉన్న ప్రజల అభివృద్ధి జరగలేదని సీపీఎం మహాజన పాదయాత్ర బృంద సభ్యుడు అబ్బాస్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 21వ రోజు కృష్ణ దేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బహిరంగసభ జరిగింది. ఈ రాష్ట్రంలో దళితులు వెనకబడి ఉన్నారని అబ్బాస్ తెలిపారు. ​
 • వనపర్తిలో సీపీఎం మహాజన పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. కాసేపట్లో కృష్ణ దేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బహిరంగసభ జరగనుంది. సభలో పాల్గొనేందుకు జిల్లా వాసులు తరలివస్తున్నారు.
 • మహాజన పాదయాత్రకు సంఘీభావం తెలిపిన సినీ నిర్మాత, హీరో మాదాల రవి. 'ప్రజా చైతన్యం కోసం పనిచేస్తున్న మహాజన పాదయాత్రకు రెడ్ సాల్యూట్ తెలిపిన మాదాల రవి. 
 • 500 కి.మీ పూర్తి చేసుకున్న మహాజన పాదయాత్ర.
 • మహాజన పాదయాత్ర మున్ననూరు గ్రామానికి చేరుకుంది. స్థానిక ప్రజలు, ఎమ్మార్పీఎస్, సీపీఎం క్యాడర్ నీల్-లాల్ జెండాలతో స్వాగతం పలికారు. 
 • 'దున్నేవాడికి భూమి ఎంత అవసరమో.. ప్రతి ఇంటికి చదువు కూడా అంతే అవసరం.  తెలంగాణాలో చదువుల ఉద్యమం జరగాలి.  మహాజన పాదయాత్ర దెబ్బకు కెసిఆర్ రోజుకో ప్రకటన ఇస్తున్నారు. తుపాకీ రాముని మాటలు మేము నమ్మము. ఒకవైపున పాదయాత్ర నడుస్తుంనే.. మరోవైపున పోరాటాలతో కెసిఆర్ మెడలు వంచుతాము' : తమ్మినేని 
 • వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ.. 'సీపీఎం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నిబద్ధత కలిగిన పార్టీ. ప్రజలకోసం త్యాగాలు చేసే పార్టీ సీపీఎం. 'మహాజన పాదయాత్ర' అనేది తమ్మినేని తీసుకున్న సాహసోపేత

 • వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ.. 'సీపీఎం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నిబద్ధత కలిగిన పార్టీ. ప్రజలకోసం త్యాగాలు చేసే పార్టీ సీపీఎం. 'మహాజన పాదయాత్ర' అనేది తమ్మినేని తీసుకున్న సాహసోపేత నిర్ణయం. దీనికి పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. 
 •  
 • తిరుమలాపురంలో పాదయాత్ర బృంద సభ్యులు ఆశయ్య మాట్లాడారు. 'ఎంబీసీలు చదువులకు దూరంగా ఉన్నారు. బీసీల్లో వెనకబడిన కులాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని. సామాజిక తెలంగాణ సాధించే వరకు కొట్లాడతమని ఆశయ్య వెల్లడించారు.
 •  
 • మహాజన పాదయాత్రకు మద్ధతు పలుకుతూ సంఘీభావం తెలిపిన సర్పంచ్ మణెమ్మ. పాదయాత్రకు ఎమ్మార్పీఎస్ మండల నాయకులు సంఘీభావం ప్రకటించారు.
 •  
 • వనపర్తి MLA చిన్నారెడ్డి తన స్వగ్రామం తిరుమలపూరంలో మహాజన పాదయాత్రకు స్వాగతం పలికారు. 
 •  
 • మహాజన పాదయాత్ర కు స్వాగతం పలికిన గద్వాల జిల్లా సిపియం పార్టీ నాయకులు, కార్యకర్తలు ..
 •  
 • రేముద్దుల నుంచి వనపర్తి దిశగా సాగుతన్న మహాజన పాదయాత్ర. పెద్ద సంఖ్యలో నీరజనాలు పలుకుతున్న ప్రజలు. 
 •  
 • 21వ రోజు కొనసాగుతున్న మహాజన పాదయాత్ర.
 •  
 • మహా ప్రభంజనంగా కొనసాగుతున్న 'మహాజన పాదయాత్ర' 20వ రోజు షెడ్యూల్ ముగిసింది. పెద్దకొత్తపల్లి గ్రామం నుండి పసుపుల, ఖానాపూర్, కోడేరు, నాగుల పల్లి, ముత్తిరెడ్డి పల్లి, తుర్క దిన్నె, సింగాయిపల్లి మీదుగా రేముద్దుల వరకు నేటి 'మహాజన పాదయాత్ర' కొనసాగింది.
 •  
 • రేమద్దుల గ్రామంలో అపూర్వమైన స్వాగతం.. బాణసంచా వెలుగు జిలుగుల మధ్య గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బహిరంగంగా సభకు భరీ ఎత్తున జనం హాజరయ్యారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి తమ్మినేని, జాన్వెస్లీ పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. 
 •  
 • రేమద్దుల గ్రామంలో మహాజన పాదయాత్ర కు బతకమ్మలతో ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్థులు ..
 •  
 • సింగాయిపల్లిలో మహాజన పాదయాత్ర ఉపనాయకులు జాన్వెస్లీ మాట్లాడారు. 'తెలంగాణలో అసమానతలు ఉండటానికి వీలు లేదు. వేల సంవత్సరాలుగా అణచివేతకు గురవుతున్నాము.  మేమెంతో మాకన్ని రిజర్వేషన్లు లెక్కగట్టి ఇవ్వకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలమేకమై గడీల దొరలను, దొర తనాన్ని బొందవెడ్తం.' అని జాన్వెస్లీ హెచ్చరించారు.
 •  
 • కోడేరు మండలం సింగాయిపల్లి గ్రామంలో మహాజన పాదయాత్రకు అపూర్వమైన స్వాగతం పలికారు. పాదయాత్రకు సంఘీభావం ప్రకటించడానికి కోల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ బీరం హర్షవర్థన్ రెడ్డి గారు హజరై ప్రసంగించారు. 
 •  
 • నాగర్ కర్నూల్ జిల్లా నుంచి వనపర్తిలో జిల్లాలోకి ప్రవేశించిన 'మహాజన పాదయాత్ర'
 •  
 • కోడేరు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నా సమస్యల పై తమ్మినేని గారికి ఎస్ఎఫ్ఐ విద్యార్థులు వినతి పత్రం అందించారు.
 •  
 • తెలంగాణా రాకముందు ఏ విధముగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇప్పటికి ప్రజలు అవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంవి.రమణ తెలిపారు.
 •  
 • కాసేపటి క్రితమే పెద్దకొత్తపల్లి నుండి కోడేరు మండలం పసుపుల గ్రామానికి చేరుకుంది. పార్టి కార్యకర్తలు, యస్,యఫ్,ఐ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. 
 •  
 • పెద్దకొత్తపల్లి మండల కేంద్రం వద్ద నిర్మించిన తెలంగాణా సాయుధ పోరాట స్థూపం వద్ద తమ్మినేని బృందం మరియు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలు నివాళులు అర్పించారు.
 •  
 • పెద్దకొత్తపల్లి నుంచి ప్రారంభమైన 'మహాజన పాదయాత్ర'. 'నీల్-లాల్' జెండాలతో.. ఉరకలెత్తించే పాటలతో వడివడిగా సాగుతున్న పాదయాత్ర. బృందంతో పాటూ అడుగు కలిపేందుకు తరలొచ్చిన జనం. 
 •  
 • నేటి రూట్ : పసుపుల గ్రామం నుండి ఖానాపూర్, కోడేరు, నాగుల పల్లి, ముత్తిరెడ్డి పల్లి, తుర్క దిన్నె, సింగాయిపల్లి మీదుగా రేముద్దుల వరకు నేటి 'మహాజన పాదయాత్ర' కొనసాగుతుంది. 
 •  
 • నేటితో మహాజన పాదయాత్ర 20వ రోజుకు చేరుకుంటుంది.
 •  
 • మహాజన పాదయాత్ర 19వ రోజు ముగిసింది. శనివారం ఉదయం 8.30కు పసుపుల నుంచి యాత్ర కొనసాగుతుంది.
 •  
 • 'దొర తనం చేసే వాళ్లు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరతారు. ఇలాంటి కుళ్లు రాజకీయాలని తెలంగాణలో ప్రక్షాళణ చేస్తాం.' అని తమ్మినేని పెద్ద కొత్తపల్లిలో సభలో ప్రకటించారు. 
 •  
 • గ్రామ పంచాయితీ కార్మికుల వేతనాలు పెంచాలి. కుడికిళ్ల నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయాలి' అని తమ్మినేని మహాజన పాదయాత్ర నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  
 •  
 • 'పెద్ద కొత్తపల్లిలో దొరకు ఓటు వేయలేదని దళితుని ఇంటికి మంచినీళ్ల నళ్లా తీసివేయించారని దళిత సమాఖ్య జిల్లా అధ్యక్షులు కాశన్న తెలిపారు. తెలంగాణలో బడుగులు బలహీన వర్గాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని కాశన్న వాపోయారు. 
 •  
 • పాదయాత్ర బృంద సభ్యులు ఆశయ్య పెద్దకొత్తపల్లిలో ప్రసంగించారు. 'తెలంగాణలో సామాజిక న్యాయం జరగడం లేదు. పేదలకు కనీస వసతులు లేవు. మాల, మాదిగ, బోయలు, పూసల వాళ్లు, బుడగ జంగాల లాంటి అట్టడుగు కులాలు పేదరికంలో కొట్టుమిట్టిడుతున్నాయి. బీసీలలో కూడా వర్గీకరణ జరిపి ప్రతి ఒక్క అట్టడుగు కులానికి న్యాయం చేయాలి' అని ఆశయ్యా తెలిపారు. 
 •  
 • పెద్దకారు పాములనుంచి బయలు దేరిన పాదయాత్ర 'పెద్ద కొత్తపల్లి'కి చేరుకుంది. ప్రజలు పెద్దయెత్తున స్వాగతం పలికారు. 
 •  
 • టీఆరెస్ నాయకులు సభకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నిస్తుండగా వారిని ఉద్దేశించి మాట్లాడిన తమ్మినేని వీరభద్రం ఫైరయ్యారు. 'కమ్యూనిస్టులకు ప్రజలకోసం ప్రాణాలర్పించిన చరిత్ర ఉంది. అర చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అపలేరు. ఎన్ని అడ్డంగకులు సృష్టించినా సీపీఎం మహాజన పాదయాత్రను, తెలంగాణలో సామాజిక న్యాయ ఉధ్యమాన్ని ఆపలేరు' అంటూ పాదయాత్ర బృంధ నాయకులు తమ్మినేని వీరభద్రం టీఆరెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
 •  
 • పెద్దకారు పాములలో మధ్యం సేవించి వచ్చిన కొంతమంది టీఆరెస్ నాయకులు 'మహాజన పాదయాత్ర'లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. పాదయాత్ర మీటింగ్ కు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించారు.  
 •  
 • టీఆరెస్ ప్రభుత్వం ఏ వాగ్ధానాలు నెరవేర్చలేదని, ప్రజల సొమ్ము గుళ్లు గోపురాలకు ఖర్చు చేస్తున్నారంటూ సీపీఐ రాష్ట్ర నాయకులు కందాల రామకృష్ణ ఆరోపించారు. 
 •  
 • 'వానలు రాక చెరువులు నిండక ప్రజలు ఇబ్బంధులు పడుతున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు కురుమూర్తి చెప్పారు. సీపీఎం పాదయాత్రకు టీడీపీ మద్ధతు సంపూర్ణంగా ఉంటుందని ఆయన చెప్పారు. 
 •  
 • 'భవిష్యత్తులో సీపీఎం రాజ్యాధికారంలోకి వస్తుందని, ఎర్ర జెండా ఆధ్వర్యంలో అట్టడుగు కులాల అభివృద్ధి జరుగుతుందని' మాదిగ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి వుషన్ మాదిగ ఆకాంక్షించారు. 
 •  
 • పాదయాత్ర ఉప నాయకులు జాన్ వెస్లీ పెద్ద కారుపాముల లో మాట్లాడారు. సీఎం మనవడు దళితుడి కొడుకు ఒకే బడిలో చదివనప్పుడే తెలంగాణలో అసలైన సామాజిక న్యాయం  జరుగుతుందని జాన్ వెస్లీ పేర్కొన్నారు.  బవిష్యత్తులో 7 శాతం ఉన్న కులాల పప్పులుడకవని దళిత, బహుజన, మైనారీటీలదే రాజ్యాధికారమంటూ జాన్ వెస్లీ ఉద్ఘాటించారు. 
 •  
 • పెద్ద కొత్తపల్లిలో సభ ముగించుకుని 'పెద్దకారు పాముల'కు మహాజన పాదయాత్ర చేరుకుంది. స్థానిక 'ఎమ్మార్పీఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం లీడర్లు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. 'నీల్ - లాల్' జెండాలతో ఊరేగింపుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 
 •  
 • 'మేము గరీబోల్లము. మాకు గింత భూమిప్పించడయ్యా' అంటూ పెద్దకొత్తపల్లికి చెందిన 'బుడగ జంగాల'కు చెందిన మహిళ సీతమ్మ మహాజన పాదయాత్రకు వినతి పత్రం అందజేసింది. ఇదే సందర్భంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ తమ గోడు వెల్లబోసుకుంటూ 'ఆశా వర్కర్లు' మెమోరండం ఇచ్చారు. 
 •  
 • పాదయాత్ర బృంద సభ్యుడు ఎండీ అబ్బాస్ పెద్ద కొత్తపల్లిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ వర్గాలు అభివృద్ధి అయినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్లని అబ్బాస్ అన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం సాధించే వరకు తమ పోరాటం ఆగదని అబ్బాస్ ఉద్ఘాటించారు.
 •  
 • శుక్రవారం సాయంత్రం పెద్దకొత్తపల్లి మండలం దేదనిపల్లి లోకి ప్రవేశించిన పాదయాత్రకు సిపిఐ పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు కందాల రామక్రిష్ణ, జిల్లా నాయకులు ఏసయ్య, మండల కార్యదర్శి శ్రినివాస్ రెడ్డి, మండల కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, గ్రామస్తులు, ఆశ కార్యకర్తలు .... ఘనస్వాగతం స్వాగతం పలికారు. 
 •  
 • శుక్రవారం సాయంత్రం అంబటిపల్లి నుండి పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది.
 •  
 • లింగ మండలం అంబటిపల్లికి సీపీఎం మహాజన పాదయాత్ర చేరుకుంది. అక్కడ స్థానిక మహిళలు బతుకమ్మలతో పాదయాత్ర బృందానికి ఘనస్వాగతం పలికారు.
 •  
 • అక్కడ పాదయాత్ర బృందానికి ఓ రైతు తన గోడు వెళ్లబోసుకున్నాడు. అంబటిపల్లి గ్రామ చెరువు నిండ లేదని, రుణ మాఫీ చేయలేదని పేర్కొన్నాడు.
 •  
 • పాదయాత్రకు సీపీఐ నేత వీరన్నగౌడ్ స్వాగతం పలికారు. కాసేపటి క్రితం లింగాల మండలానికి పాదయాత్ర చేరుకుంది. అంతకంటే ముందు టిడిపి నేత భూగ్యనాయక్ మహాజన పాదయాత్రకు మద్దతు పలికారు. ​
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర  శుక్రవారం ఉదయం లింగాల మండలానికి చేరుకుంది.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర 19వ రోజుకు చేరుకుంది. నేడు శుక్రవారం లంబడిపల్లి, పెద్ద కార్పాముల, చిన్న కార్పాముల, పెద్ద కొత్తపల్లి, పసుపుల గ్రామాల్లో పాదయాత్ర బృందం పర్యటించనుంది.
 •  
 • కేసీఆర్ నెంబర్ 1 ఎలా అవుతారని ఎం.వి.రమణ ప్రశ్నించారు. కాసేపటి క్రితం సీపీఎం మహాజన పాదయాత్ర బల్మూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
 •  
 • టైగర్ జోన్ పేరిట పాలకులు అరాచకం సృష్టిస్తున్నారని సీపీఎం పాదయాత్ర బృంద సభ్యుడు ఐటెం రాజు పేర్కొన్నారు. అచ్చంపేట నుండి 18వ రోజు పాదయాత్ర కొనసాగుతోంది. చదువుపై టి.సర్కార్ పెద్ద కుట్ర చేస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర 18వ రోజు రామాజీపల్లెకు చేరుకుంది. ఈసందర్భంగా తమ్మినేని ప్రసంగించారు. తెలంగాణ బాగు పడడమంటే వెనుకబడిన కులాలు బాగు పడాలని పేర్కొన్నారు. 
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది. నేడు అచ్చంపేట నుండి పాదయాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో కొండనాగులకు చేరుకోనుంది. ఈ సందర్భంగా కులవృతుల పనులను తమ్మినేని పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
 •  
 • సీఎం కేసిఆర్ ఇంకా గారడీ మాటలు చెపుతున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. 17వ రోజు బుధవారం రాత్రి అచ్చంపేటలో జరిగిన బహిరంగసభలో తమ్మినేని ప్రసంగించారు. విద్య, వైద్యం ప్రభుత్వ కంట్రోల్‌ లో ఉండాలని, గిరిజనుల ప్రాంతంలో జ్వరం వస్తే సూది వేసే దక్కు లేదన్నారు. కేసీఆర్ కానీ ఆయన కొడుకు, కూతురు, అల్లుడు ఎవరైనా చర్చకు రావాలని తమ్మినేని సవాల్ విసిరారు.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర అచ్చంపేట గ్రామానికి చేరుకుంది.అచ్చంపేట లో మహాజన పాదయాత్ర కు అపూర్వమైన స్వాగతం డిజె,బతకమ్మలతో స్వాగతం పలికిన ప్రజలు.  మాజీ MLA వంశీ కృష్ణ  తదితరులు పాల్గొన్నారు . 
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. 17వ రోజు తెల్కంపల్లి - అచ్చంపేట మధ్యలో 400 కి.మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ లీడర్లు సంఘీభావాన్ని ప్రకటించారు.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర గట్టుతుమ్మెన్ గ్రామానికి చేరుకుంది. అక్కడ స్థానికులు పాదయాత్ర బృందానికి వినతిపత్రాలు సమర్పించారు.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్రలో కులవివక్షత రాకాసి వెలుగు చూసింది. తెల్కపల్లి మండలంలో పడగలు విప్పి నాట్యం ఆడుతోంది. 17వ రోజు బుధవారం తెల్కపల్లి, రాంకొండకు చేరుకున్న పాదయాత్ర బృందానికి స్థానిక యువకుడు బీరయ్య ఈ విషయాలు తెలియచేశాడు.
 •  
 • తెల్కపల్లిలో దూదేకుల కులస్తుల రెండెకరాల భూమి (సర్వే నెం 42)కబ్జా గురవుతోందని దీనిపై సీపీఎం పోరాటం చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ విషయంపై రెవిన్యూ మంత్రికి లెటర్ వ్రాస్తానని తెలిపారు. 17వ రోజు తెల్కపల్లిలో మహాజన పాదయాత్ర కొనసాగుతోంది.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర తెల్కపల్లికి చేరుకుంది. 17వ రోజు బుధవారం ఉదయం చిన్నమదునూర్ నుండి పాదయాత్ర కొనసాగింది. తెల్కపల్లి మండల కేంద్రంలో పాదయాత్రకు సిపిఐ మండల కార్యదర్శి శంకరయ్య గౌడ్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మల్లేష్ సంఘీభావం ప్రకటించారు.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం చిన్నమదునూర్ నుండి పాదయాత్ర కొనసాగుతోంది. రామ్ రెడ్డి పల్లి, తెలకపల్లి, రాకొండ, జినుకుంట, గట్టుతుమ్మెన్ గేట్, అచ్చంపేటలో పాదయాత్ర కొనసాగనుంది.
 •  
 • సీపీఎం జిల్లా కార్యదర్శులతో రాష్ట్ర కార్యదర్శివర్గం భేటీ జరిపింది. సీపీఎం పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్ పేర్కొన్నారు. మూడెకరాల భూమి..డబుల్ బెడ్ రూం ఇళ్లు..రేషన్ కార్డులు..స్మశాన వాటికల సమస్యలపై వినతులు వస్తున్నాయన్నారు. తక్షణమే ప్రభుత్వం వాటిని అమలు చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు.
 •  
 • హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడకుండా గ్రామాల్లోకి రావాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సూచించారు. 16వ రోజు మంగళవారం నాగర్ కర్నూలు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. మధ్యాహ్నం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తమ్మినేని మాట్లాడారు. కేసీఆర్ హామీలలో ఒక్క పర్సెంట్ కూడా అమలు జరగలేదని తెలిపారు.
 •  
 • 16వ రోజు మంగళవారం జిల్లాలోని పాలెంకు సీపీఎం మహాజన పాదయాత్ర చేరుకుంది. పరిపాలనా అందుబాటులో రావటం అంటే విద్య,వైద్యం, ఉపాధి అందుబాటులో కి రావాలని తమ్మినేని పేర్కొన్నారు.
 •  
 • ఇంకెన్నాళ్లు దోపిడికి గురవుదామని సీపీఎం మహాజన పాదయాత్ర బృంద సభ్యుడు జాన్ వెస్లీ ప్రశ్నించారు. 16వ రోజు మంగళవారం ఉదయం పాదయాత్ర బిజినెపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడారు. కుల అసమానతలు లేని సమాజాన్ని తీసుకు రావాలని, అగ్ర కుల ఆధిపత్యాన్ని కొనసాగించే పరిపాలనా వ్యవస్థ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యంగా పోరాడాలని, వీరందరూ ఐక్యంగా ఉంటేనే హక్కులు సాధించడానికి సాధ్యం అవుతుందన్నారు.
 •  
 • ​జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. 16వ రోజు మంగళవారం ఉదయం వట్టెం నుండి పాదయాత్ర కొనసాగుతోంది. కాసేపటి క్రితం బిజినెపల్లికి చేరుకుంది.
 •  
 • రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, కేంద్రం 90 శాతం..రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను ఉపాధి పథకానికి ఖర్చు చేయాలని కోరారు.
 •  
 • మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. 15వ రోజు సోమవారం 11గంటలకు నాగసాలకు చేరుకుంది. పాదయాత్ర బృందానికి గ్రామస్తులు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర జయప్రదం కావాలని బీఎస్పీ నాయకుడు శ్రీనివాస్ బహద్దూర్ ఆకాంక్షించారు. జడ్చర్లలో సోమవారం ఉదయం పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఓట్లు వచ్చాయి కానీ రాజ్యధికారం రాలేదని, సామాజిక న్యాయం కోసం పాదయాత్ర జరుగుతోందన్నారు.
 •  
 • మహబూబ్ నగర్ జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగనుంది. జడ్చర్లలో కొనసాగే పాదయాత్ర నాగసాల, మరికల్, ఇంద్రానగర్ తండా, తిమ్మాజీపేట, వట్టెం ప్రాంతాల మీదుగా కొనసాగనుంది.
 •  
 • మహబూబ్ నగర్ జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. తిమ్మాజీపేటలో టి.టిడిపి నేతలు పాల్గొననున్నారు. ఎల్.రమణ్, రేవంత్ రెడ్డి, ఇతర నేతలు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించనున్నారు.
 •  
 • జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగనుంది. 15వ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పాదయాత్ర కొనసాగనుంది.
 •  
 • మహాజన పాదయాత్ర 300 కి.మీటర్లు పూర్తి చేసుకుంది. షాద్ నగర్ లో శనివారం ఉదయం పాదయాత్ర కొనసాగుతోంది.
 •  
 • మహాజన పాదయాత్ర 13వ రోజు ప్రారంభమైంది. షాద్ నగర్ లో శనివారం ఉదయం పాదయాత్ర కొనసాగుతోంది. కాసేపటి క్రితం టోల్ గేట్ వద్దకు చేరుకుంది. నేడు టోల్ ప్లాజా, బాలానగర్, రంగారెడ్డి గూడ, మాచారం, కౌరంపేటలో పాదయాత్ర జరగనుంది. 
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్రలో ఉన్న తమ్మినేని వీరభద్రంకు టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. మహాజన పాదయాత్రకు టిడిపి పూర్తి మద్దతు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. నవంబర్ 1వ తేదీన టిడిపి నేతలంతా యాత్రలో పాల్గొంటారని, మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాజీపేట వద్ద రమణతో పాటు టిడిపి కేడర్ అంతా పాదయాత్రలో పాల్గొంటుందని రేవంత్ పేర్కొన్నారు.
 •  
 • ప్రజలు బతుకు తెలంగాణ కోరుతున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు షాద్ నగర్ గ్రామానికి పాదయాత్ర చేరుకుంది. దున్నేవానికే భూమి ఎంత కీలకమో.. ప్రతి ఒక్కరికీ విద్య అందించాలనే డిమాండ్ అంతే కీలకమని వ్యాఖ్యానించారు.
 •  
 • 12 రోజుల్లో 10-12 సమస్యలపై ప్రభుత్వం స్పందించిందని, మాట తప్పితే ముక్కు నెలకు రాస్తా అన్న కేసీఆర్.. తను తప్పిన ఒక్కో మాటకు ఒక్కోసారి ముక్కు నెలకు రాస్తే అయన ముక్కు అరిగిపోతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. 11వ రోజు నందిగామలో శుక్రవారం మధ్యాహ్నం ప్రసంగించారు. అన్ని మాటలు తప్పాడని తమ్మినేని విమర్శించారు.
 •  
 • తమకు 12 రోజుల్లో వేల దరఖాస్తులు వచ్చాయని, అందులో ఒక్కరు కూడా బంగారం కోరలేదని తమ్మినేని పేర్కొన్నారు. తిమ్మాపూర్ లో ఉదయం పాదయాత్రలో ఆయన ప్రసంగించారు. ఇల్లు కావాలి..భూమి కావాలి..చదువు కావాలి..ఉద్యోగం కావాలి..కోరుకుంటున్నారని తెలిపారు. మొత్తంగా ప్రజలు బ్రతుకు కోరుకుంటున్నారుని తమ్మినేని తెలిపారు.
 •  
 • మహాజన పాదయాత్ర శుక్రవారం తిమ్మాపూర్ లో ఉదయం కొనసాగింది. ఈ పాదయాత్రలో సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజా సమస్యల అధ్యయనం..పరిష్కారం కోసం...సామజిక తరగతుల అభ్యన్నతి కోసం పాదయాత్ర జరుగుతోందన్నారు.
 •  
 • శుక్రవారం ఉదయం తిమ్మాపూర్ లో కొనసాగిన పాదయాత్రకు సీపీఐ నేత పర్వతాలు, నాట్కో ప్రధాన కార్యదర్శి మల్లేష్ సంఘీభావం ప్రకటించారు.
 •  
 • జిల్లాలో మహాజన పాదయాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. 12వ రోజు నందిగామ, చాంద్రాయణ గూడ, షాద్ నగర్ లలో పాదయాత్ర జరగనుంది.
 •  
 • జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. 11వ రోజు మొత్తం 24 కిలోమీటర్లు బృందం నడిచింది. పెద్దపులి నాగారం నుండి తిమ్మాపూర్ వరకు పాదయాత్ర కొనసాగింది. నేడు తిమ్మాపూర్ లో పాదయాత్ర ప్రారంభం కానుంది.
 •  
 • మదనపల్లి ప్రజల సమస్యలు పరిష్కారం కోసం ఎర్రజెండా అండగా నిలబడి కొట్లాడుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వెల్లడించారు.
 •  
 • సుట్టూ కంపెనీలు..అయినా ఉద్యోగాల్లేవ్' అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 11వ రోజు మదనపల్లికి చేరుకున్న మహాజన పాదయాత్ర బృందానికి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. 11వ రోజు పలు గ్రామాల్లో పర్యటిస్తోంది. కాసేపటి క్రితం మదనపల్లికి చేరుకుంది. తెలుగు యువత లీడర్ జంగయ్య సంఘీభావం ప్రకటించారు.
 •  
 • బీసీ లకు 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సీపీఎం మహాజన పాదయాత్ర 11వ రోజు కొనసాగుతోంది. పెద్ద షాపూర్ లో ఆయన మాట్లాడారు. గిరిజనులకు 12 శాతం ఎప్పుడు ఇస్తావని ప్రశ్నించారు. హామీలు అమలు జరపకుంటే ప్రజలు బుద్ది చెబుతారన్నారు.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. కాసేపటి క్రితం ఘాన్సిమియాగూడ లో పాదయాత్ర జరిపింది. పాదయాత్ర బృందానికి 'నవ తెలంగాణ' పత్రిక బృందం సంఘీభావం తెలిపింది.
 •  
 • శంషాబాద్ ను జిల్లా చేయాలనే డిమాండ్ కు సీపీఎం మద్దతినిస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఘంసిమియా గూడెంలో సీపీఎం మహాజన పాదయాత్ర 11వ రోజు కొనసాగుతోంది. సామజిక న్యాయం సాధనే మహాజన పాదయాత్ర లక్ష్యమని, ప్రైవేట్ స్కూల్స్ తెలంగాణ విద్యను నాశనం చేస్తోందన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ ను పటిష్ఠం చేయాలని, కేజీ టూ పీజీ స్కీం ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
 •  
 • జిల్లాలో పాదయాత్ర 11వరోజు కొనసాగుతోంది. పెద్దపులి నాగారం వద్ద యాత్ర ప్రారంభమైంది. పెద్ద గొల్కోండ వద్ద పలువురు పాదయాత్ర బృందానికి మద్దతు తెలిపారు. శంషాబాద్ ఇండిపెడెంట్ ఎంపీటీసీ అరవింద్ కుమార్, లంబాడీ హక్కుల పోరాట సమితి నేత రామ్ నాయిక్, ఎమ్మార్పీఎస్ జిల్లా రచమల్ల రమేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు యాదయ్య సంఘీభావం తెలిపారు.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర 10వ రోజు 28.1కి.మీలు యాత్ర సాగింది. నేదునూరులో పాదయాత్ర ప్రారంభమై మహజన పాదయాత్ర పెద్దపులి నాగారం గ్రామం వద్ద ముగిసింది
 •  
 • తెలంగాణ రాష్ట్రంలో విద్య చాలా ప్రధానమైందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. పదో రోజు మహేశ్వరం మండలంలోని కోళ్లపడ్కల్ గ్రామానికి సీపీఎం మహాజన పాదయాత్ర చేరుకుంది. ఈసందర్భంగా తమ్మినేని మాట్లాడారు. కేరళ రాష్ట్రంల్లోగా వంద శాతం అక్షరాస్యత సాధించాలంటే విద్యకు అధిక నిధులు కేటాయించాలని తమ్మినేని డిమాండ్ చేశారు.
 •  
 • మహేశ్వరం మండలంలోని కోళ్లపడ్కల్ గ్రామానికి సీపీఎం మహాజన పాదయాత్ర చేరుకుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం సాధించాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ పేర్కొన్నారు.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర 10వ రోజు చిప్పలపల్లికి చేరుకుంది. అక్కడి నుండి బయలుదేరిన పాదయాత్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బృందాన్ని టెన్ టివి ఎండీ వేణుగోపాల్, సీఈవో సజ్జప్రసాద్ లు కలిశారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృందానికి సంఘీభావం తెలిపారు.
 •  
 • జిల్లాలో పదో రోజు మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. కాసేపటి క్రితం దన్నారం నుండి బయలుదేరింది. దన్నారంలో పాదయాత్రకు కాంగ్రెస్ నాయకుడు మల్లగౌడ్ మద్దతు తెలిపారు.
 •  
 • కందుకూరు మండలంలోని పులిమామిడిలో సీపీఎం మహాజన పాదయాత్ర 10 వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు సమస్యల వినతిపత్రం సమర్పించారు. 150 మంది రేషన్ కార్డులు కట్ చేశారు. రైతులకు పట్టాలివ్వాలి. 200 ఫించన్ లు కట్ చేశారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది. 70 కుటుంబాలకు ఇందిరమ్మ పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది. 4 బెల్ట్ షాపులున్నాయి. అని వినతిపత్రంలో పేర్కొన్నారు.
 •  
 • కందుకూరు మండలంలోని పులిమామిడిలో సీపీఎం మహాజన పాదయాత్ర 10 వ రోజు కొనసాగింది. ఈసందర్భంగా గ్రామస్తులు సమస్యల వినతిపత్రం సమర్పించారు. 150 మంది రేషన్ కార్డులు కట్ చేశారు. రైతులకు పట్టాలివ్వాలి. 200 ఫించన్ లు కట్ చేశారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది. 70 కుటుంబాలకు ఇందిరమ్మ పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది. 4 బెల్ట్ షాపులున్నాయి. అని వినతిపత్రంలో పేర్కొన్నారు.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర పులిమామిడికి చేరుకుంది. 10వ రోజు పాదయాత్ర కొనసాగుతోంది. గ్రామ పంచాయతీ కార్మికులు తమ గోడును పాదయాత్ర బృందానికి వెళ్లబోసుకున్నారు.
 •  
 • మహాజన పాదయాత్ర 10వ రోజు కొనసాగుతోంది. నేదునూరులో పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర బృందానికి విద్యార్థులు సమస్యలు తెలియచేసుకున్నారు. 'నెదునూర్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని, కాస్మెటిక్ చార్జీలు పెంచాలి..బుక్స్ ఇంకా ఇవ్వలేదు...త్రాగునీటి ట్యాంకర్ ఎవ్వరికి సరిపోదు' అంటూ విద్యార్థులు ఆవేదన తెలియచేశారు.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర 9వ రోజు లేమూరులో ప్రారంభమైంది కాసేపటి క్రితం నెదునూర్ చేరుకుంది. కంచె ఐలయ్య గారు మహజన పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.సీపీఎం మహాజన పాదయాత్ర 9వ రోజు లేమూరులో ప్రారంభమైంది కాసేపటి క్రితం దెబ్బడగూడ కు చేరుకుంది. 
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర 9వ రోజుకు చేరుకుంది. పాదయాత్ర 200 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఇవాళ రంగారెడ్డి జిల్లాలోని బండగూడూరు, కందుకూరు, దెబ్బడగూడ గ్రామాల్లో పాదయాత్ర బృందం పర్యటించనుంది.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర 9వ రోజు లేమూరులో ప్రారంభమైంది కాసేపటి క్రితం కందుకూర్ క్రాస్ రోడ్డుకు చేరుకుంది. అక్కడ ఎస్ఎఫ్ఐ నేతలు ఘన స్వాగతం పలికారు. 
 •  
 • మహాజన పాదయాత్ర 9వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. గూడూరులో చేరుకున్న పాదయాత్ర బృందానికి గ్రామస్తులు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. అభయ హస్తం ఫించన్లు ఇస్తామని సంవత్సరానికి రూ. 485 కట్టించుకున్నారని, కానీ ఫించన్ రాలేదు..కట్టిన డబ్బులు కూడా ఇవ్వడం లేదు. దళితులకు బొందలగడ్డ స్థలం లేదు. రామస్వామి బావి దగ్గరున్న మూడెకరాల ప్రభుత్వ భూమి శ్మశాన వాటికకు కేటాయించాలి. బండమీది గూడూరులో ఆరెకరాల ప్రభుత్వ భూమి ఉందని, దళిత కుటుంబాలకు భూములివ్వాలి. గ్రామంలో పలువురికి రేషన్ కార్డ్స్ కట్ అయ్యాయి. కమ్యూని హాల్ నిర్మించాలి. ఉపాధి హామీ పనులు దొరక్క వలసలు వెళుతున్నారు. కరవు సహాయక చర్యలు చేపట్టాలి. బాపన్ కుంట కబ్జాకు గురైంది.
 •  
 • 9వ రోజు లేమూరు నుండి పాదయాత్ర ప్రారంభమైంది. ఎంబీసీల స్థితి గతుల పై బీసీ కమిషన్ అధ్యయనం చేయాలని..ఎంబీసీ కులాలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని ఆశయ్య డిమాండ్ చేశారు.
 •  
 • ​ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. 8వ రోజు పటేల్ గూడ నుండి లేమూరు వరకు జరిగింది. 9వ రోజు లేమూరు నుండి పాదయాత్ర ప్రారంభమైంది. 200 కిలోమీటర్ పూర్తి చేసుకొని ముందుకు సాగుతున్న పాదయాత్ర బృందానికి పలువురు అభినందనలు తెలియచేశారు.
 •  
 • జిల్లాలో మహాజన పాదయాత్ర 8వ రోజు కొనసాగుతోంది. కాసేపటి క్రితం మహేశ్వరం మండలంలోని లేముర్ కు చేరుకుంది.
 •  
 • కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే పనులపై శ్రద్ధ పెడుతున్న తెలంగాణ ప్రభుత్వం... ప్రజా సమస్యలపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టడం లేదని జస్టిస్‌ చంద్రకుమార్‌ విమర్శించారు. తక్కుగూడలో మహాజన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.
 •  
 • ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి ఎజెండాతో తెలంగాణలో మహాజన పాదయాత్ర చేపట్టామని తమ్మినేని మరోసారి స్పష్టం చేశారు.
 •  
 • తెలంగాణ రాష్ర్టంలో ప్రస్తుతం హిట్లర్‌ పాలన కనిపిస్తోందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సీపీఎం చేపట్టిన 'మహాపాదయాత్ర'కు సబితా సంపూర్ణ మద్దతు తెలిపారు.
 •  
 • జిల్లాలో మహాజన పాదయాత్ర 8వ రోజు కొనసాగుతోంది. కాసేపటి క్రితం మహేశ్వరం క్రాస్ రోడ్డుకు చేరుకుంది.
 •  
 • ప్రజలు కోరేది బంగారం కాదని, బ్రతుకు కోరుతున్నరని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. 8వ రోజు పాదయాత్ర రావిరాల గ్రామంలో జరుగుతోంది. దున్నే వాడిదే భూమి ఎప్పటి నుండో అంటున్నామని, ప్రతి ఒక్కడికి చదువుకావాలని మరో మాట అంటున్నామని తమ్మినేని తెలిపారు. 
 •  
 • 8వ రోజు కొంగర కలాన్ కు చేరుకున్న పాదయాత్ర బృందానికి స్థానిక పరిశ్రమలలో లోకల్ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని వీరస్వామి వినతిపత్రం ఇచ్చారు.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్రకు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ సబితా ఇంద్రారెడ్డి మద్దతు తెలిపారు. 8వ రోజు తక్కుగూడలో పాదయాత్ర జరుగుతోంది. తుక్కుగూడ పట్టణంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో సబితా ఇంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.
 •  
 • ప్రజలకు సీఎం కేసీఆర్ రావాలని అప్పుడే బాధలు తెలుస్తాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని తక్కుగూడలో 8వ రోజు పాదయాత్ర కొనసాగింది. యాత్ర చేసేది సీపీఎం కోసం కాదని, ప్రజా సమస్యలు తెలుసుకోవడం..ప్రజ సమస్యలు పరిష్కారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్రకులాల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, యాత్రకు మద్దతు తెలపాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు సీపీఎం చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతు తెలియచేస్తున్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
 •  
 • 8వ రోజు కొంగర కలాన్ కు చేరుకున్న పాదయాత్ర బృందానికి టీడీపీ ఇబ్రహీంపట్నం వైస్ ప్రెసిడెంట్ శిగా వీరస్వామి గౌడ్ సంఘీభావం ప్రకటించారు.
 •  
 • 8వ రోజు కొంగర కలాన్ కు చేరుకున్న పాదయాత్ర బృందానికి పేరుకపోయిన సమస్యలను కొంగరాకలాన్ హైస్కూల్ విద్యార్థులు పాదయాత్ర బృందానికి తెలియచేశారు.
 •  
 • జిల్లాలో మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. 8వ రోజు బొంగ్లూరు నుండి ప్రారంభమై ఆదిభట్ల మీదుగా కొంగరకలాన్ కు చేరుకుంది. 93 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలకు బడ్జెట్ లో అన్యాయం జరుతోందని రమణ పేర్కొన్నారు.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర 8వ రోజు ప్రారంభం కానుంది. అబ్దుల్లాపూర్ మెట్ నుండి ఎంపీ పటేల్ గూడ వరకు 7వ రోజు పాదయాత్ర కొనసాగింది. నేడు ఎంపీ పటేల్ గూడ నుండి పాదయాత్ర జరగనుంది.
 •  
 • సీపీఎం గొప్పతనం చెప్పడం కోసం పాదయాత్ర చేయడం లేదని, ఓటు వేసి గెలిపించినప్పుడు నిలదీసే అడిగే ధైర్యం ఉండాలని..అందుకోసమే పాదయాత్ర చేయడం జరుగుతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర ఏడో రోజు కొనసాగుతోంది. కాసేపటిక్రితం మంగల్ పల్లి గ్రామానికి చేరుకుంది. పాదయాత్ర బృందానికి సీపీఐ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో నేతలు మాట్లాడారు.
 •  
 • తెలంగాణ అభివృధి కావాలంటే ప్రతి పెదోడు చదువుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల మీద సవితి తల్లి ప్రేమ చూపుతోందని తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం పేర్కొన్నారు.
 •  
 • తోర్రురు నుండి బయలుదేరిన పాదయాత్ర తుర్కయంజల్ కు చేరుకుంది.
 •  
 • మహాజన పాదయాత్ర కొనసాగుతుంది అబ్దల్లా పూర్ మెట్ వద్ద ప్రారంభమై తోర్రురుకు చేరింది. పాదయాత్రకు గ్రామ ప్రజలు స్వాగతం పలికారు. 
 •  
 • కోహడకు చేరుకున్న మహజన పాదయాత్ర చిన్నారులు నృత్యలతో ఘనస్వాగతం పలికారు. మహాజన పాదయాత్ర ప్రారంభమై పెద్ద అంబర్ పేట్ కు చేరుకుంది
 •  
 • రంగారెడ్డి జిల్లాలో 7వ రోజు మహాజన పాదయాత్ర ప్రారంభమైంది. అబ్దుల్ల పూర్ మెట్ నుండి యాత్ర కొనసాగుతోంది.
 •  
 • సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ఆరో రోజు ముగిసింది.మంచాల మండలంలో మొదలైన పాదయాత్ర అబ్దుల్లాపూర్ మెట్ లో ముగిసింది. ఇవాళ 26.4 కిమీ మేర పాదయాత్ర సాగింది.
 •  
 • హయత్ నగర్ మండలంలోని లష్కర్ గూడ  మహాజన పాదయాత్ర చేరుకుంది
 •  
 • రంగారెడ్డి జిల్లాలో మహాజన పాదయాత్ర  హయత్ నగర్ మండలం అనాజ్ పూర్ లో పాదయాత్ర కొనసాగుతోంది. 
 •  
 • జిల్లాలో మహాజన పాదయాత్ర ఆరో రోజు కొనసాగుతోంది. పోల్కంపల్లిలో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. 
 •  
 • పోల్కంపల్లి గ్రామంలో వివిధ సంఘాలు..గ్రామ సర్పంచి దానయ్యలు..పాదయాత్ర బృందానికి సన్మానం చేశారు.
 •  
 • 93 శాతం ప్రజలకు సీపీఎం ఏమి ఉద్ధరించింది అన్న ఎంపీ కవితమ్మ.. మీ చేతిలో అధికారం ఉండి.. ఆడ బిడ్డవై ఉండి ఆశా కార్మికుల గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు' అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ప్రశ్నించారు. సీఐటీయూ వాళ్ళు చందాలు వసూలు చేసిచ్చిందని, మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడటం బాధాకరమన్నారు. దేశంలో దళిత బహుజనుల అభివృద్ధి కోసం నిత్యం కొట్లాడి లాఠీ దెబ్బలు తిన్నది..జైలు జీవితం అనుభవించింది కమ్యూనిస్టులేనని తెలిపారు.
 •  
 • విద్యారంగం నిర్వీర్యమవుతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఆరోరోజు పాదయాత్ర లింగంపల్లిలో కొనసాగింది. పేద విద్యార్థులు ఎలా చదుకోవాలని, ఇంటికో ఉద్యోగం ఏమైందని ఆయన ప్రశ్నించారు. మూతపడిన పరిశ్రమలు తెరిపించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
 •  
 • మహాజన పాదయాత్ర ఆరో రోజు (శనివారం) కొనసాగుతోంది. మంచాల నుండి పాదయాత్ర కొనసాగుతోంది. లింగంపల్లి గేట్ వద్ద పాదయాత్ర బృందానికి గ్రామస్తులు, స్థానికులు స్వాగతం పలికారు. ఈ యాత్రలో 70 ఏళ్ల వృద్ధుడు కదం కదిపాడు. కళాకారులు నృత్య ప్రదర్శనలిచ్చారు. దళితులపై దాడులు జరుగుతున్నాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మహాజన పాదయాత్ర ఐదో రోజు కొనసాగింది. ఆరుట్లలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నాయని, మతోన్మాదానికి వ్యతిరేకంగా విశాల సంఘీభావం కూడగట్టాలని పిలుపునిచ్చారు.
 •  
 • బతుకు తెలంగాణ కావాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. శుక్రవారం ఐదో రోజు మహాజన పాదయాత్ర విజయవంతంగా కొనసాగింది. రాత్రి మంచాల మండలానికి చేరుకున్న అనంతరం ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లాడారు. కేసీఆర్ ని భూమి మీదికి దించాలి అప్పుడే ప్రజా సమస్యలు తెలుస్తాయని, అప్పుడే మన బ్రతుకులు మారుతాయన్నారు. బంగారు తెలంగాణ వద్దు బతుకుల తెలంగాణ కావాలన్నారు.
 •  
 • సీపీఎం నిర్వహిస్తున్న పాదయాత్రకు సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి సంఘీభావం ప్రకటించారు. ఐదో రోజు పాదయాత్ర కొనసాగుతోంది. రంగాపూర్ లో 100 కిలో మీటర్ల మైలురాయిని చేరుకుంది. కాసేపటిక్రితం పాదయాత్రకు పాశం యాదగిరి సంఘీభావం ప్రకటించారు.
 •  
 • 'ఆడిన మాట ఎందుకు తప్పుతున్నావ్..3 ఎకరాల భూమి ఏది..కాంట్రాక్టు కార్మికులను ఎప్పుడు పర్మినెంట్' చేస్తవ్ అని సీఐటీయూ నేత చుక్కా రాములు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీపీఎం నిర్వహిస్తోన్న మహాజన పాదయాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. రంగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టులకు ప్రజలే దేవుళ్లని, ప్రజల కోసం 4000 కి.మీ లు నడిచి వెళ్తున్నారని తెలిపారు.
 •  
 • జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఐదో రోజు (శుక్రవారం) పలు గ్రామాల్లో పర్యటించింది. సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగింది. పాదయాత్రకు స్థానిక గ్రామస్తులు..యువకులు ఘనస్వాగతం పలికారు. డప్పులు, గంగిరెద్దులతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఎర్రచీరలు..రెడ్ షర్ట్ లతో  మంది కార్యకర్తలు స్వాగతం పలికారు. కిలో మీటర్ పొడవునా ర్యాలీ నిర్వహించారు. 
 •  
 • సీపీఎం మహాజ పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఐదో రోజు (శుక్రవారం) కోళ్లవంపు వద్ద ఈ మైలురాయిని చేరుకుంది. మంచాల (మం) రంగాపూర్ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. డప్పులు, గంగిరెద్దులతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఎర్రచీరలు..రెడ్ షర్ట్ లతో 1500 మంది కార్యకర్తలు స్వాగతం పలికారు. కిలో మీటర్ పొడవునా ర్యాలీ నిర్వహించారు.
 •  
 • తండాలను ఎప్పుడు పంచాయితీలు చేస్తవ్ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఐదో రోజు (శుక్రవారం) పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంచాల మండలంలో ఏర్పాటు చేసిన ఓ సభలో ఆయన ప్రసంగించారు.
 •  
 • బోడకొండ ఎరుపు మయంగా మారింది. జిల్లాలో మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. 100 కి.మీటర్ల మైలురాయి చేరుకున్న బృందం కొసేపటి క్రితం బోడకొండకు చేరుకుంది. అక్కడ మహిళలు ఎర్రచీరలు..యువత ఎర్రటీషర్ట్స్ ధరించి ఘన స్వాగతం పలికారు. ప్రజలందరూ ఒక్కటేనని గిరిజన భాషలో గిరిజన సంఘం నాయకులు శోభన్ నాయక్ పాటలు పాడారు.
 •  
 • రంగారెడ్డి జిల్లాలో మహాజన పాదయాత్ర కొనసాగుతోంది. ఐదో రోజు పలు గ్రామాల్లో పర్యటించింది. రంగాపూరంలో వంద కిలోమీటర్లు పూర్తి చేసుకున్న పాదయాత్ర బృందం కాసేపటి క్రితం బోడకొండ గ్రామానికి చేరుకుంది. అక్కడ అమరవీరుల స్థూపానికి తమ్మినేని నివాళలుర్పించారు. 
 •  
 • తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయనుకుంటే.. కేవలం 7 శాతం వారికే లాభం జరుగుతోందని సీపీఎం నేత ఆశయ్య పేర్కొన్నారు. 93 శాతం ప్రజలు మోసపోతూ దోపిడీకి గురవుతున్నారని, తామెంతో.. తమకంత వాటా కావాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం సాధించే వరకు కొట్లాడుతామని స్పష్టం చేశారు.
 •  
 • అక్టోబర్ 17 తేదీన ప్రారంభించిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) వంద కిలోమీటర్ కు చేరుకుంది. రంగాపురంలో ఈ మైలురాయిని పాదయాత్ర బృందం చేరుకుంది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. ఇప్పటికీ 24 గ్రామాల్లో పర్యటించామని, రంగాపూర్ 100కి.మీటర్లు గీత దాటామన్నారు. చాలా చిన్న భాగం పూర్తి చేయడం జరిగిందని, కానీ ఈ చిన్న భాగంలోనే అతి పెద్ద విషయాలు తెలుస్తున్నాయన్నారు.
 •  
 • పోరాటాల్లో కలిసి రావాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మహాజన పాదయాత్ర భాగంగా నేడు (శుక్రవారం) ఐదో రోజు మంచాల మండలం లోయపల్లి నుండి పాదయాత్ర ప్రారంభమైంది. లోయపల్లి నుండి ప్రారంభమైన పాదయాత్ర ఆంబోతు తండాకు చేరుకుంది. గిరిజనులనుద్ధేశించి తమ్మినేని ప్రసంగించారు. బాధలకు గురవుతున్న వాళ్ళు పోరాటాల్లో కలిసి రావాలన్నారు.
 •  
 • సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి పేరిట సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న మహాజన పాదయాత్ర గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. మంథన్‌గౌరెల్లిలో నిర్వహించిన సభలో తమ్మినేని మాట్లాడుతూ...ఆర్‌ఓఆర్‌ పట్టాల ద్వారా భూ హక్కులు పొందిన గిరిజన రైతుల నుంచి భూములను లాక్కుంటున్న పెత్తందార్లకు, భూస్వాములకు అధికారులు అండగా నిలవటం దుర్మార్గమన్నారు. గిరిజనులకు ఒకసారి ఆర్‌ఓఆర్‌ పట్టాలిచ్చిన తర్వాత...సదరు భూముల్ని తిరిగి ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలు సమస్యలు తెలుసుకొంటోంది. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, యాచారం మండలాల్లో ఉపాధి హామీ పనుల పథకం అమలు తీరుపై ఆయన లేఖలో పేర్కొన్నారు. వెంటనే కూలీలకు ఉపాధి కల్పించాలని, పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు.
 •  
 • యాచారం మండలంలో మహాజన పాదయాత్ర నాలుగో రోజు (గురువారం) కొనసాగుతోంది. నల్లవెల్లిలో ప్రారంభమైన పాదయాత్ర మంతన్‌గౌరెల్లి మీదుగా కొనసాగుతోంది. ఆయా ప్రాంతాల్లో సమస్యలు బృందం తెలుసుకొంటోంది. తాజాగా ఓ వ్యవసాయక్షేత్రంలో పాదయాత్ర బృందం పర్యటించింది.
 •  
 • ఆదివాసీలు, ఎస్టీలపై ఫారెస్ట్ అధికారులు వేధింపులు ఎక్కువయ్యాయని, ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఎస్టీ రైతుల భూములు లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు భూములివ్వకుంటే ఎర్రజెండాలు పాతి భూములు పంచిపెడుతామని హెచ్చరించారు. నాలుగో రోజు పాదయాత్రలో మంతన్ గౌరెల్లిలో తమ్మినేని మాట్లాడారు. 
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర నాలుగో రోజు (గురువారం) కొనసాగుతోంది. కాసేపటి క్రితం పాదయాత్ర బృందం నల్లవెళ్లి నుండి మంతన్ గౌరెల్లికి చేరుకుంది. మార్గమధ్యంలో పత్తి పంటను తమ్మినేని బృందం పరిశీలించింది.
 •  
 • సీపీఎం పాదయాత్ర నాలుగో రోజు (గురువారం) కొనసాగుతోంది. బృందానికి ఓ గిరిజనుడు తన కష్టాన్ని వెళ్లబోసుకుండు..'1987 నుండి 40 సంవత్సరాలుగా దున్నుకుంటున్నాం.. నర్సిరెడ్డి మా భూమి గుంజుకుంటందుకు సూస్తుండు.. కేసులు బెట్టిండు.. న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటాం' అని భానోతు కేశ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసిండ్రు. '2006 లో పైసలు కట్టి అర్.ఓ.ఆర్ లో పట్టా చేసుకున్నాం.. మాకు చట్టాలు తెల్వదు. ఏసీపీ సమక్షంలో కాంప్రమైజ్ చేసిండ్రు. మళ్ళీ కేసు పెట్టిండ్రు'..అని పేర్కొన్నారు.
 •  
 • సీపీఎం నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర నాలుగో రోజు (గురువారం) యాచారం మండలంలో కాసేపటి క్రితం ప్రారంభమైంది. మట్టి రోడ్డు..రాళ్లు రప్పలపై ఈ పాదయాత్ర సాగుతోంది. మంతన్‌గౌరెల్లి, నల్గొండ జిల్లాలోని ఖుదాబక్ష్‌పల్లి, మంచాల మండలంలోని లోయపల్లి, ఆంబోతుతండా, సత్తుతండా, కుర్రతండాలో పాదయాత్ర కొనసాగనుంది.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర బుధవారం మూడో రోజు మొత్తం 8 గ్రామాల్లో పర్యటించింది. యాచారం, మొండిగౌరెల్లి, చింతపట్ల, తక్కెళ్లపల్లి, కొత్తపల్లి, కిషన్‌పల్లి, మాల్‌, నల్లవెల్లి వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా బృంద సభ్యులు జాన్‌వెస్లీ, ఎమ్‌వీ రమణ, ఆశయ్య, రమ, అబ్బాస్‌, నైతం రాజు, శోభన్‌, కె.నగేష్‌ వివిధ సామాజికాంశాలపై ప్రసంగించారు.
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..దళితులకు 3ఎకరాల భూపంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీని పాదయాత్ర పూర్తయ్యేలోపు అమలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తమ్మినేని డిమాండ్ చేశారు. లేదంటే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని ఆయన హెచ్చరించారు. ప్రాజెక్టుల పేరుతో 5లక్షల ఎకరాలను కాజేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు.
 •  
 • మహాజన పాదయాత్ర మూడో రోజు యాచారం మండలంలో కొనసాగుతోంది. కాసేపటి క్రితం కొత్తపల్లికి చేరుకుంది. అక్కడ పాదయాత్ర బృందానికి గ్రామస్తులు వినతిపత్రం అందచేశారు. ఏ కులానికి స్మశాన వాటిక లేదు. బీసీ కాలనీలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. కృష్ణా వాటర్‌ పది రోజులకొకసారి వస్తోంది.ఉపాధి హామీ పెండింగ్‌ బిల్లులు 8 లక్షలున్నాయి.రేషన్‌ కార్డులు 50 రద్దు చేశారు. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంది. ఎస్సీ వాడ వరకు బస్సు రావాలి. వీధి లైట్స్‌ వేయాలి. పశువుల ఆసుపత్రి లేదు. పది కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. డిగ్రీ చేసిన వారు డ్రైవింగ్‌, సెంట్రింగ్‌ పనులకు వెళుతున్నారు అని వినతిపత్రంలో పేర్కొన్నారు..
 •  
 • సీపీఎం మహాజన పాదయాత్ర మూడో రోజు (బుధవారం) విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న తమ్మినేనికి గ్రామస్తులు, స్థానికులు సమస్యలు తెలియచేస్తూ వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. కాసేపటి క్రితం యాచారం మండలం చింతపట్లకు చేరుకున్న బృందానికి యువకులు ఎర్రకవాతు నిర్వహించారు.
 •  
 • జిల్లాలోని యాచారం మండలంలో సీపీఎం మహాజన పాదయాత్ర మూడో రోజు (బుధవారం) ప్రారంభమైంది. గౌరెల్లి, చింతపట్ల, తక్కెళ్ళపల్లి, కొత్తపల్లి, కిషన్‌పల్లి, మాల్‌, నల్లవెల్లి గ్రామంలో పాదయాత్ర కొనసాగనుంది.
 •  
 • రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలో మూడో రోజు సీపీఎం మహాజన పాదయాత్ర జరగనుంది. యాచారంలో ప్రారంభమై మొండిగౌరెల్లి, చింతపట్ల, తక్కెళ్ళపల్లి, కొత్తపల్లి, కిషన్‌పల్లి, మాల్‌, నల్లవెల్లి గ్రామంలో పాదయాత్ర జరుగుతుంది.
 •  
 • పెత్తుళ్ల గ్రామానికి చేరుకున్న సీపీఎం మహాజన పాదయాత్ర బృందానికి గ్రామస్తులు సమస్యల వినతిపత్రాన్ని సమర్పించారు. తాగునీరు వారానికి ఒకసారి వస్తోందని, ఎస్సీ, బీసీలకు స్మశాన స్థలం లేదని పేర్కొన్నారు. గ్రామంలో ముగ్గురి భూ స్వాముల చేతుల్లో 80 శాతం భూమి ఉందని, మిగిలిన రెడ్డి కులస్తులకు పది శాతం, ఎస్సీ, బీసీలకు పది శాతం ఉందని, బినామీ పేర్లతో సీలింగ్ భూములను వారి కబ్జా కింద ఉంచుకున్నారని తెలిపారు. పశువైద్య శాల లేదు..ఎస్సీ, బీసీ కార్పొరేషన్ రుణాలు ఎవ్వరికీ దక్కడం లేదు. ఉపాధి పెండింగ్ బిల్లులు మూడు లక్షల రూపాయలివ్వాలి.. దళితులకు మూడెకరాల భూమి..డబుల్ బెడ్ రూం ఇళ్లు ఒక్కటి రాలేదు. సాంకేతికత పేరిట రేషన్ కార్డులను కట్ చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు.
 •  
 • 40 రేషన్ కార్డులు తొలగించారని...డబుల్ బెడ్ ఇళ్లు ఇవ్వలేదని..12, 13 రైస్ మిల్లుల్లో స్థానికులకు ఉపాధి ఇవ్వలేదని..కప్పాడు గ్రామస్తులు వాపోయారు. రెండు లక్షల వరకు ఉపాధి హామీ బిల్లులు చెల్లించలేదని తెలిపారు. వెంటనే సంబంధిత అధికారితో తమ్మినేని మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తానని హామీనిచ్చారు.
 •  
 • పెన్షన్ తీసివేశారని ఎలిమినేడు సఫాయి కార్మికులు పాదయాత్ర బృందానికి తెలియచేశారు. ఎలిమినేడులో సమస్యలు అధికంగా ఉన్నాయని విద్యార్థులు తమ్మినేనికి తెలియచేశారు.
 •  
 • మహాజన పాదయాత్ర రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఉత్సాహంగా సాగుతోంది. పాదయాత్ర బృందానికి ప్రజలు సమస్యలు తెలియచేస్తున్నారు. వీరి సమస్యలను పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పాదయాత్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న తమ్మినేని వింటున్నారు.
 •  
 • ఇబ్రహీంపట్నంలో సీపీఎం నిర్వహిస్తున్న మహాపాదయాత్ర కొనసాగుతోంది. మహాయాత్ర బృందానికి గ్రామస్తులు పలు సమస్యలు తెలియచేస్తున్నారు.
 •  
 • ఇబ్రహీంపట్నం మండలం మేటీల నుండి సీపీఎం మహాజన పాదయాత్ర ప్రారంభమైంది. రేషన్ కార్డులు తొలగించారని, ఫించన్లు రావడం లేదని సమస్యలను పాదయాత్ర బృందానికి గ్రామస్తులు తెలియచేస్తున్నారు.
 •  
 • ఇబ్రహీంపట్నంలో జరిగిన భారీ బహిరంగ సభకు వేలాది మందిగా సీపీఐ(ఎం) శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వ్యవసాయ కార్మికులు, ఇతర రంగాలకు చెందిన ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు.
 •  
 • వందల సంఖ్యలో కార్లు, ఇతర వాహనాలతో ఇబ్రహీంపట్నం పట్టణం కిక్కిరిసిపోయింది. యువత భారీగా కనిపించడం గమనార్హం. మహిళలు సైతం చురుగ్గా కదిలొచ్చారు. ఎటుచూసినా ఎర్రజెండా రెపరెపలే కనిపించాయి.
 •  
 • ప్రజానాట్యమండలి కళాకారుల కళారూపాలు, ఏపూరి సోమన్న పాటలు, ఆటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రిపై సోమన్న పాడిన పాటకు ఈలలు వేశారు..
 •  
 • ప్రకాశ్‌ అంబేద్కర్‌, రాఘవులు, తమ్మినేని, చాడ, మల్లు స్వరాజ్యం ప్రసంగాలకు ప్రజలు చప్పట్ల ద్వారా తమ స్పందనను తెలియ జేశారు. ప్రజలు ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా, చివరిదాకా ఉన్నారు.
 •  
 • తమ్మినేని తన ప్రసంగంలో పాదయాత్రను సర్కారు అడ్డుకుంటే ఊరుకోబోం, చావడానికైనా సిద్ధమే, నేను చస్తే నాబృందం పాదయాత్ర కొనసాగిస్తుందని చెప్పినప్పుడు ప్రజలు హర్షధ్వానాలు చేశారు.
 •  
 • అరెస్ట్ చేస్తే విడుదలైన మరుక్షణం పాదయాత్ర చేపడతా, అక్కడ నుంచే రూట్‌మ్యాప్‌ తయారుచేస్తా అన్నప్పుడు యువత కేరింతలు వేసింది.
 •  
 • తొలిరోజు తమ్మినేని బృందం ఇబ్రహీంపట్నం చెరువును సందర్శించారు. అక్కడి సమస్యలను స్థానికుల నుంచి తెలుసు కున్నారు. చెరువుల చరిత్ర పట్ల తమ్మినేని ఆసక్తి కనపరిచారు.
 •  
 • దళిత నాయకులు ప్రకాశ్‌ అంబేద్కర్‌తో కరచాలనం చేయడానికి పోటీపడ్డారు.
 •  
 • మల్లు స్వరాజ్యం కేసిఆర్‌పైన, టీఆర్‌ఎస్‌ సర్కారుపైనా, వేసిన చెణకులకు విపరీత స్పందన వచ్చింది.
 •  
 • తమ్మినేనికి ఆయా వృత్తుల వాళ్లు తమ తమ వృత్తులకు సంబంధించి పరికరాలను బహూకరించారు. ఒకరు చిలుకలను అందజేశారు. మత్స్యకారులు వలను అందించారు. మైనార్టీలు నెత్తికి టోపీ పెట్టారు.
 •  
 • సామాజిక న్యాయం కోసమే సీపీఎం మహాజన పాదయాత్ర అని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగానో.. కేసీఆర్‌కు వ్యతిరేకంగానో చేపడుతున్న పాదయాత్ర కాదని ఆయన స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని తాము కోరుకుంటున్నామన్నారు. ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన మహాజన పాదయాత్ర బహిరంగసభలో మాట్లాడిన ఆయన తాము చేపట్టింది రాజకీయ యాత్ర కాదన్నారు. 31 జిల్లాల్లో తాము పర్యటిస్తామని తమ్మినేని చెప్పారు. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన ప్రకాష్‌ అంబేద్కర్‌ బడుగు వర్గాల అభివృద్ధి కోసమే ఈ మహాజన పాదయాత్ర అన్నారు.
 •  
 • ​ తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యయనానికి శ్రీకారం చుడుతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మహాజన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ప్రభుత్వం చెబుతున్నది ఏంటీ ? చేస్తున్నది ఏంటీ ? సీపీఎం అనుసరిస్తున్న వైఖరిని ప్రజల ముందుంచారు. పాదయాత్రను అడ్డుకున్నా చేసి తీరుతామని కుండబద్ధలు కొట్టారు. ప్రజల్లో చైతన్యం రగిలించడానికి..ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పాదయాత్ర చేయడం జరుగుతోందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా..కేసీఆర్ కు వ్యతిరేకంగా ఈ పాదయాత్ర కాదని మరోమారు స్పష్టం చేశారు.
 •  
 • బంగారు తెలంగాణ ఎవరికీ అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మహాజన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పలు ప్రశ్నలు సంధించారు. బంగారు తెలంగాణ బడుగు, బలహీన వర్గాలకా ? సంపన్న వర్గాలకా ? తెలంగాణలో అక్షరాస్యత పెరగాల్సినవసరం లేదా ? మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయి ? అక్షరాస్యతలో అగ్రగామిగా నిలబడితేనే బంగారు తెలంగాణ సాధ్యమని, దేశంలో 31 శాతంలో ఉన్న తెలంగాణ ఎలా పైకి వస్తుంది ? దళితులు..మైనార్టీలు..గిరిజనులు బాగు పడకుంటే ఎలా ? తాము చేస్తున్నది అన్యాయమా ? అని ప్రశ్నించారు.
 •  
 • ​వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని బీఆర్‌ అంబేడ్కర్‌ మనవడు డాక్టర్‌ ప్రకాష్‌ అంబేడ్కర్‌ పేర్కొన్నారు. సీపీఎం నిర్వహించతలపెట్టిన మహాజన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. సామాన్య మానవుడి ముఖంలో చిరునవ్వు..శాంతి..ఉల్లాసం..చూడాలని అనుకుంటున్నామన్నారు.
 •  
 • జిల్లాల్లో అభివృద్ధి అనేది ఆయా జిల్లాల్లో వికేంద్రీకరించబడాలన్నారు.
 •  
 • 'దోర ఏందిరో..వారి పీకుడేందిరో'.... అంటూ మహాజన పాదయాత్రలో కళాకారుడు కదం తొక్కాడు. మహాజన పాదయాత్ర సందర్భంగా సభ ప్రారంభమైంది. ​
 •  
 • ఇబ్రహీంపట్నం ఎరుపెక్కింది..ఎర్ర జెండాలతో అరుణామయమైంది. సీపీఎం నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర సందర్భంగా ఇబ్రహీంపట్నంలో ఆ పార్టీ భారీ బహిరంగసభ నిర్వహించింది. వేదికపై పార్టీకి సంబంధించిన నేతలు, ప్రజా సంఘ నేతలు, మేధావులు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు.
 •  
 • సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయనతో పాటు సీపీఐ నేత చాడ, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఉన్నారు.
 •  
 • జనహితం కోసమే సీపీఎం మహాజన పాదయాత్ర నిర్వహిస్తోందని సీపీఎం నేతలు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాసేపట్లో యాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు..నేతలు ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.
 •  
 • ​మహాజన పాదయాత్ర ప్రారంభ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజా సంఘాల నేతలు..వివిధ రంగాల కార్యకర్తలు ఇబ్రహీంపట్నంకు తరలివచ్చారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 
 •  
 • సీపీఎం నిర్వహించతలపెట్టిన మహాజన పాదయాత్రను అడ్డుకుంటే వారి అడ్రస్ ఉండదని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు. కాసేపట్లో ప్రారంభం కానున్న మహాజన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పెద్దమనిషి పాదయాత్రను అడ్డుకోవాలని పేర్కొనడం సరికాదన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతొక్కరికీ హక్కు ఉందని తెలిపారు.
 •  
 • ​ఇబ్రహీంపట్నంలో కామ్రెడ్లు కదం తొక్కారు. సీపీఎం నిర్వహించతలపెట్టిన మహాజనపాదయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. పాదయాత్ర కంటే ముందు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు..పేదలు పడుతున్న బాధలు కళ్లకు కట్టినట్లుగా పాటలు..ఆటల రూపంలో ప్రదర్శించారు.
 •  
 • ఇబ్రహీంపట్నంలో కళాకారుల ప్రదర్శనలు..భారీగా కామ్రెడ్లు చేరుకుంటున్నారు. మిగతా విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.
 •  
 • పాదయాత్రను ప్రజలు హర్షిస్తున్నారని మహాజన పాదయాత్ర నిర్వాహక కమిటీ బాధ్యులు వెంకట్, సీపీఎం నేత భూపాల్ లు పేర్కొన్నారు. మహాజన పాదయాత్ర ఏర్పాట్లను వారు పర్యవేక్షించారు. పాదయాత్రకు భారీగా ప్రజలు, నేతలు తరలివస్తున్నారని తెలిపారు.
 •  
 • పాదయాత్రకు భారీగా చేరుకుంటున్న కామ్రెడ్లు... అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు..ఇతరత్రా గురించి వీడియో క్లిక్ చేయండి.
 •  
 • మధ్యాహ్నం 12.00గంటలకు మహాజన పాదయాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్రకంటే ముందు బహిరంగ సభ జరగనుంది.  అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో వీడియో క్లిక్ చేయండి..
 •  
 • ​కాసేపట్లో మహాజన పాదయాత్ర ప్రారంభం... అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు చూడండి...
 •  
 • ఇబ్రహీంపట్నం వద్ద పాదయాత్ర ప్రారంభానికి ముందు.. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇందులో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఎం ఏపీ కార్యదర్శి మధు, సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సామాజిక, అభ్యుదయ, ప్రజా సంఘాల నేతలు పాల్గొంటారు. సభలో పాదయాత్ర పాటల సీడిని ప్రజా గాయకుడు గద్దర్‌, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ విడుదల చేస్తారు.
 •  
 • ​రాష్ట్ర సామాజిక సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీపీఎం తెలంగాణ శాఖ సోమవారం నుంచి మహాజన పాదయాత్రను చేపట్టనుంది. ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్‌ మనుమడు, మాజీ ఎంపీ ప్రకాశ్‌ అంబేడ్కర్‌.. మహాజన పాదయాత్రను ప్రారంభిస్తారు. తమ్మినేని వీరభద్రం నేతృత్వంలోని ఎనిమిదిమంది సభ్యుల బృందం.. ఐదు నెలల పాటు నాలుగు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించనుంది.
 •  
 • జమ్మికుంట : సామాజిక న్యాయం,తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం ఈ నెల 17 న ప్రారంభమయ్యే మహాజనపాదయాత్రను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మిల్కూరి వాసుదేవారెడ్డి పిలుపునిచ్చారు.
 •  
 • హుజూరాబాద్‌ రూరల్‌ : నూతన తెలంగాణ రాష్ట్రం సామాజిక న్యాయంతో సమగ్రాభివృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతో అఖిల పక్షాల అధ్వర్యంలో నిర్వహించబోతున్న మహాజన పాద యాత్రను జయప్రదం చేయాలని సీపీఐఎం నాయకులు మర్రి వెంకటస్వామి కోరారు.
 •  
 • మహాజన పాదయాత్ర కొనసాగకుండా ప్రభుత్వం అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఎన్ని అడ్డంకులు కలిగించినా పాదయాత్ర కొనసాగిస్తామని తెలిపారు. పాదయాత్ర ముగిసే సమయానికి దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వ భూముల్లో దళితులతో కలిసి ఎర్రజెండాలు పాతి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల పోరాటం మహత్తరమైందని, మల్లన్న సాగర్ కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని పాదయాత్రలో గ్రామ గ్రామాన తెలియచేస్తామన్నారు.
 •  
 • తెలంగాణలో సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధి కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఐదు నెలలు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుందని ఆ పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు మామిడి సర్వయ్య పేర్కొన్నారు. పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
 •  
 • ​ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయడానికే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మహాజన పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లంక రాఘవులు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కొమురం భీం చౌరస్తాలో భీం విగ్రహానికి పూలమాలలు వేసి 2కే రన్‌ ప్రారంభించారు.
 •  
 • ​ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహాపాదయాత్ర పూర్తి చేస్తామని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. పాదయాత్ర నేపథ్యంలో మేధావులు, విద్యావేత్తల సలహాలు, సూచనల కోసం శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి మాట్లాడాలనుకుంటే సమస్యలపై చర్చకు సిద్ధమని చెప్పారు. మాటలతో రెండున్నరేండ్లు వెల్లదీశారని, ఇకపైనా ఏమీ చేయరనే నమ్మకమూ ప్రజల్లో ఏర్పడిం దన్నారు. మహాపాదయాత్ర 17న ప్రారంభమై నవంబర్‌ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4వేల కిలో మీటర్లు సుదీర్ఘంగా సాగుతుందన్నారు.
 •  
 • ​ 'మహాజన పాదయాత్ర' ప్రభుత్వ వ్యతిరేక యాత్ర కాదని, ప్రజా చైతన్య యాత్ర అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 'మహాజన పాదయాత్ర'కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టెన్ టివి ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ప్రజా సమస్యలపై సాధికారిక పరిశీలన యాత్ర అని, సర్కారును స్పందింపచేయడమే తమ లక్ష్యమన్నారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
 •  
 • పాదయాత్రను ప్రజలు ఆదరించాలి - తమ్మినేని...
 •  
 • 93 శాతం ఉన్న అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈనెల 17 నుంచి చేపట్టనున్న మహాజన పాదయాత్ర గురించి సంగారెడ్డిలో జరుగుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శుల సమావేశంలో చర్చించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 90 శాతం హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.
 •  
 • ​ సీఎం కేసీఆర్ మాటలకు తమ్మినేని కౌంటర్ 
 •  
 • మహాజన పాదయాత్రకు మద్ధతుగా ఓయు ఎన్.సీ.సీ గేట్ నుంచి 2కే రన్‌ నిర్వహించారు. ఈ రన్‌ను ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సాయిబాబా, సీపీఎం నాయకులు వెంకట్‌, రాములు, ఎస్ఎఫ్ఐ,యూటీఎఫ్, ఐద్వా, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
 •  
 • మహాజన పాదయాత్రకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా 2కె రన్ నిర్వహించారు. 
 •  
 • అక్టోబర్ 6న సూర్యాపేట్ లో జరిగిన రాష్ట్రకమిటీ మీటింగ్ లో 'మహాజన పాదయాత్ర'లోగో, వెబ్ సైట్, మరియు యాప్ లను సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని విడుదల చేశారు. 
 •  
 • గతంలో పాలించిన పాలకుల విధానాలే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలింబిస్తోందని, విధానాలు మార్చుకోవాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. జిల్లాలో సూర్యాపేటలో రెండు రోజులుగా జరుగుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర సమావేశాలు ముగిశాయి. ఏ రకమైన విధానం..ఎలా ఉండాలనే దానిపై డాక్యుమెంట్ రూపొందించడం జరిగిందని తమ్మినేని తెలిపారు. 
 •  
 • కాంగ్రెస్..టిడిపి పరిపాలించిన సమయంలో ఎలాంటి విధానాలు అవలింబించాయో..సామాజిక తరగతులను మరిచిపోయారో అవే విధానాలు ప్రస్తుత ప్రభుత్వం అవలింబిస్తోందని విమర్శించారు. తమకు టీఆర్ఎస్ అంటే కోపం లేదని, ప్రస్తుతం అవలింబిస్తున్న విధానం మార్చాలి..మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఏ నమూనా కావాలనే దానిపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. 
 •  
 • మహాజన పాదయాత్ర మీద టీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు. ప్రజల్లో ఉండే వారికి గెలుపోటములతో సంబంధం లేదని, కమ్యూనిస్టులు నిత్యం ప్రజల్లోనే ఉంటారని పేర్కొన్నారు. సీఎం పీఠం ఎక్కేముందు సీపీఎం నిజాయితీ పార్టీ అన్న కేసీఆర్ తమ విధానాలపై ఎదురు దాడులు చేస్తున్నారని విమర్శించారు. ​
 •  
 • తెలంగాణ సమగ్రాభివృద్ధిపై ప్రత్యామ్నాయ అభివృద్ధి డాక్యుమెంట్ రూపొందించడం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం పేర్కొన్నారు. 17న ప్రారంభమయ్యే 'మహాజన పాదయాత్ర' ద్వారా ఆ డాక్యుమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చిస్తామన్నారు. తమ అభివృద్ధి నమూనా ఒక పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు.
 •  
 • నల్గొండలో సీపీఎం మహాజన పాదయాత్ర లోగో, వెబ్ సైట్ ను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు.
 •  
 • ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని అడిగే పార్టీగా సీపీఐ (ఎం) ఉండదని..ఇక నుంచి నిలదీసే దిశగా జనాన్ని సిద్ధం చేస్తుందని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ శక్తుల్ని ఏకం చేసేందుకు మహాజన పాదయాత్రకు శ్రీకారం చుట్టామన్నారు. సామాజిక, వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల్ని ఒక్కటి చేసేందుకు ఈనెల 17 నుంచి మార్చి 12వ తేదీ వరకూ 4 వేల కిలో మీటర్ల మేర మహాజన పాదయాత్ర నిర్వహించేందుకు సీపీఐ(ఎం) సన్నద్ధమైందన్నారు.
 •  
 • తెలంగాణ రాష్ట్ర పటం అభివృద్ధి చెందడం కాదని..రాష్ట్రంలోని ప్రజలు అభివృద్ధి చెందాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మహాజన పాదయాత్ర 'అక్టోబర్ 17 2016 నుండి మార్చి 5 2017' వరకు నిర్విరామంగా 6 నెలలపాటు కొనసాగనుంది.
 •  
 • వైద్యం..విద్య..అందుబాటులోకి రావాలని..జీడీపీ లెక్కలు..ద్రవ్యోల్బణం లెక్కలు అంటూ కాకి లెక్కలు చెప్పడం కాదని తమ్మినేని సూచించారు.
 •  
 • ప్రత్యామ్నాయమార్గం ఉండాలని..దీని కోసం చర్చించడం జరుగుతుందన్నారు. చర్చా రూపంలో ఓ పత్రరూపంలో ప్రజల ముందు ఉంచుతున్నట్లు తమ్మినేని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాలైన ప్రాంతాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తేనే అది అభివృద్ధి అంటారన్నారు.
 •  
 • మహాజన పాదయాత్రకు బీసీల మద్ధతు ఉంటుందని వివిద బీసీ సంఘాల లీడర్లు ప్రకటించారు. 
 •  
 • బీసీలు రాజ్యాధికారం సాధించాలని ఈ సందర్భంగా పలువురు బీసీ లీడర్లు ఆకాంక్షించారు. 
 •  
 • తెలంగాణలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై క్షేత్ర స్థాయి అధ్యయణం నిర్వహించాలని, తదుపరి సమస్యలు తీరేవరకూ రాజీలేని పోరాటాలు చేయాలని తెలిపారు. 
 •  
 • ఈ చర్చలో రాష్ట్ర స్థాయి బీసీ లీడర్లు పాల్గొని తెలంగాణలోని బీసీల సమస్యలపై చర్చించారు. 
 •  
 • సెప్టెంబర్ 22వ తేదీన మహాజన పాదయాత్రకు సంఘీభావంగా 'బీసీ సమస్యల'పై చర్చా వేధిక ఏర్పాటు చేయడం జరిగింది.
 •  
 • మహాజన పాదయాత్రకు దళిత సంఘాల మద్ధతు ఉంటుందని దళిత సంఘాల లీడర్లు ప్రకటించారు. 
 •  
 • తెలంగాణలో దళిత సమస్యలపై 'మహా జన పాదయాత్ర' సందర్భంగా సమగ్ర విశ్లేషణ చేసి ఎక్కడి సమస్యలపై అక్కడ పోరాటాలు నిర్వహించాలని వక్తలు ఉద్ఘాటించారు. 
 •  
 • లాల్ సలాం - నీల్ సలాం నినాదాన్ని మరింత ముందుకు తీసుకోవాలని కోరారు. 
 •  
 • లెఫ్ట్ పార్టీలు, దళితుల ఐకమత్యం దేశానికి అత్యవసరమని పలువురు వక్తలు పేర్కొన్నారు. 
 •  
 • దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 
 •  
 • తెలంగాణలో దళిత సమస్యలపై చర్చ నిర్వహించారు. 
 •  
 • సెప్టెంబర్ 21వ తేదీన 'మహాజన పాదయాత్రకు' సంఘీభావంగా 'దళిత సమస్యల'పై చర్చా వేధిక ఏర్పాటు చేశారు. 
 •  
 • మహాజన పాదయాత్రకు మైనారిటీ పూర్తి మద్ధతు ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు సంఘీభావం తెలిపారు. 
 •  
 • మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలని పలువురు డిమాండ్ చేశారు. 
 •  
 • రాష్ట్ర స్థాయి మైనారిటీ నాయకులు ఈ చర్చా వేధికలో పాల్గొని మైనార్టీల సమస్యలపై చర్చించారు. 
 •  
 • సెప్టెంబర్ 20వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాజన పాదయాత్రకు సంఘీభావంగా 'మైనారిటీ సమస్యలపై' చర్చా వేధిక ఏర్పాటు చేయడం జరిగింది. 
 •  
 • మహాజన పాదయాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వాల్ రైటింగ్స్ రాస్తున్నారు.
 •  
 • తెలంగాణ అభివృధ్ది ప్రత్యామ్నాయ నమూనా తయారీ కోసం ప్రజలందరి సలహాలు బహిరంగంగా కోరడం జరిగింది. 
 •  
 • సామాజికన్యాయం, తెలంగాణసమగ్రాభివృద్ధికై చేసే "మహాజనపాదయాత్ర" కు సలహాలు, సూచనల కోసం మేధావులు ,ప్రజాసంఘాల నాయకులలు, సామాజికవేత్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది.
 •  
 • దళితులపై దాడులు జరిపితే తిప్పికొడతామని కేవీపీఎస్ నాయకులు హెచ్చరించారు. 
 •  
 • మహాజన పాదయాత్ర లోగో విడుదల చేయడం జరిగింది. 
 •  
 • ఆత్మగౌరవ ఉద్యమయాత్ర ముగింపు సభకు దళిత్‌ సోషల్‌ ముక్తి మంచ్‌ (డీఎస్‌ఎంఎం) జాతీయ నేత వి.శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 •  
 • ఆత్మ గౌరవ ఉద్యమ యాత్ర ముగింపు సభ హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. 
 •  
 • ఆత్మగౌరవ ఉద్యమ యాత్రపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్ చేశారు. 
 •  
 • రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నంలో 'ఆత్మగౌరవ ఉద్యమ యాత్ర'పై బీజేపీ, ఆరెసెస్ గుండాలు దాడికి పాల్పడ్డారు. 
 •  
 • మహాజన పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ కెవిపిఎస్ (కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం) ఆధ్వర్యంలో 'ఆత్మ గౌరవ ఉద్యమ యాత్ర' ప్రారంభమైనది. 
 •  
 • ఈ మహాజన పాదయాత్ర సందర్భంగా 'తెలంగాణ అభివృద్ధికి ఆల్టర్నేటీవ్ మోడల్ (ప్రత్యామ్నాయ నమూనాను)' సీపీఎం విడుదల చేయనుంది. 
 •  
 • తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి 'దళిత వాడ'కు వెళ్లడం.. దళిత, బహుజన సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారంకై పోరాడుతూ  'ప్రజా తెలంగాణ' సాధించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర జరుగుతుంది. 
 •  
 • రంగారెడ్డి జిల్లా ఇబ్రాహింపట్నంలో మొదలయ్యే ఈ 'మహాజన పాదయాత్ర' 2017 మార్చిలో హైదరాబాద్ లోని 'నిజాం కాలేజీ'లో బహిరంగ సభతో ముగుస్తుంది. 
 •  
 • మహాజన పాదయాత్ర 'అక్టోబర్ 17 2016 నుండి మార్చి 5 2017' వరకు  నిర్విరామంగా 6 నెలలపాటు కొనసాగుతుంది. 
 •  
 • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ యాత్రకు సారథ్యం వహిస్తుండగా.. మరో 9 మంది 'పాదయాత్ర' బృందం 'మహాజన పాదయాత్ర'లో పాల్గొంటారు. 
 • సీపీఐఎం ఆధ్వర్యంలో ఆరు నెలల పాటు తెలంగాణ వ్యాప్తంగా 4000కి.మీల 'పాదయాత్ర' నిర్వహించనున్నారు. దీనికి 'మహాజన పాదయాత్ర' అనే పేరు ఖరారు చేశారు. 
 • నిర్ణయం. దీనికి పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. 

 • వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని బీఆర్‌ అంబేడ్కర్‌ మనవడు డాక్టర్‌ ప్రకాష్‌ అంబేడ్కర్‌ పేర్కొన్నారు. సీపీఎం నిర్వహించతలపెట్టిన మహాజన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. సామాన్య మానవుడి ముఖంలో చిరునవ్వు..శాంతి..ఉల్లాసం..చూడాలని అనుకుంటున్నామన్నారు.