యూనియన్ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఓటమి

26.04.18

 

 ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కు పరాభవం ఎదురైంది. విశాఖపట్నంలోని కోరమాండల్ ఎరువుల కర్మాగారం గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. నిన్న జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సీఐటీయూ నుంచి సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సీహెచ్ నరసింగరావు, బీఎంఎస్ నుంచి మాధవ్ లు పోటీపడ్డారు. మొత్తం 312 ఓట్లకు గాను 299 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లలో ఆరు ఓట్లు చెల్లలేదు. మిగిలిన వాటిలో నరసింగరావుకు 151 ఓట్లు రాగా, మాధవ్ కు 142 వచ్చాయి. దీంతో, నరసింగరావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.