హైకోర్టు తీర్పుపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలి -  బీసీ సబ్‌ప్లాన్‌ సాధన కమిటీ డిమాండ్‌

11.07.2018

పంచాయతీ రాజ్‌ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి హైెకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి ఎంటో స్పష్టం చేయాలని బీసీ సబ్‌ప్లాన్‌ సాధన కమిటీ డిమాండ్‌ చేసింది. ఎన్నికల సమాయత్తానికి ముందే గతంలో కోర్టు తీర్పులను పరిగనలోకి తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు కమిటీ రాష్ట్ర చైర్మెన్‌ ప్రొఫెసర్‌ మురళీ మనోహర్‌, ప్రధాన కార్యదర్శి కిల్లె గోపాల్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2014 సర్వే నివేది కను ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం తమ వాదనలను వినిపిస్తే బాగుం డేదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 50 శాతం రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుంటే బీసీలు తీవ్రంగా నష్ట పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు విధిగా రిజర్వేషన్ల అమలు చేయాల్సి ఉందని, ఎస్సీల కు 20, ఎస్టీలకు 7 మొత్తంగా 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే బీసీలకు మిగిలేది 23 శాతం మాత్రమేనని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగు ణంగా రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్‌ వస్తుందని సూచించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏబీసీడీ వర్గీకరణ అమలు చేసి రిజర్వేషన్లు కల్పిం చాలన్న డిమాండ్‌ వస్తున్నది. ఈ డిమాండ్లకు అండగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పసలేని వాదనలు వినిపించిందని విమర్శించారు. రిజర్వేషన్ల సమస్య జటిలంగా మారడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని విమర్శించారు ఇకనైనా ప్రభుత్వం కడ్లు తెరవాలని సూచించారు.