Latest Updates

20.06.2018

వికలాంగుల హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అద్దె భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఎన్‌పీఆర్‌డీ ప్రతినిధులు ఎం జనార్ధన్‌రెడ్డి, గోరెంకల నర్సింహా, ఎం అడివయ్య మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల కోసం ప్రత్యేక వసతి గృహాలు ఏర్పాటు చేసినా వాటిలో కనీస సౌకర్యాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్‌ విద్యార్థులకు ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు, దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు, కాస్మొటిక్‌ చార్జీలు అందించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

20.06.2018

పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌ చేసింది. ఎరువుల ధరలను తగ్గించాలని కోరుతూ ఈ నెల 27న కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం పాస్పేట్‌ ఎరువుల ధరలను బాగా పెంచిందన్నారు. 50 కేజీల ధర రూ.1074 ఉండగా రూ.1290 కి పెంచిదని పేర్కొన్నారు. దీంతో పాటు కాంప్లెక్స్‌ ఎరువుల ధరలన్నీ అదే తరహాలో పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉపకరణాల ధరలను భరించలేని రైతులు పెరిగిన ఎరువుల ధరలతో ఈ ఖరీఫ్‌లో రూ.500 కోట్ల భారాన్ని భరించాల్సి వస్తుందన్నారు. ఖరీఫ్‌లో పడుతున్న వర్షాల వల్ల విత్తనాలు వేస్తున్నారని,...

20.06.2018

నూతన రేట్ల ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ ఈనెల 20 నుంచి జరగనున్న సివిల్‌ సప్లయీస్‌ మరియు జీసీసీ హమాలీల సమ్మెకు సీఐటీయూ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, ఎం సాయిబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంల్‌ఎస్‌ పాయింట్ల వద్ద పనిచేస్తున్న హమాలీలకు రెండేండ్ల కోసారి జరగాల్సిన ఎగుమతి, దిగుమతి రేట్లను ప్రభుత్వం పెంచకపోవడం సరికాదని పేర్కొన్నారు. 40 ఏండ్లుగా పేద ప్రజలకు నిత్యవసర సరుకులను ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చేరవేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా హమాలీ కార్మికులు సేవలందిస్తున్నారని చెప్పారు. 

20.06.2018

రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఉపాధి లేక, అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. చేనేత సంక్షేమానికి కేటాయించిన రూ.12 కోట్లు ఏమయ్యాయి?' అని బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు చెరుపల్లి సీతారాములు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ నియోజకవర్గ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌ మసీదు గల్లీలో చేనేత కార్మికులు మగ్గాలపై నేస్తున్న వస్త్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికులు తాము నేసిన వస్త్రాలు కొనుగోలు కాక ఆకలి చావులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత రంగానికి నిధుల కేటాయింపులో ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. కార్మికులకు నూలు...

20.06.2018

విద్య పేరుతో చేస్తున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల డీఈవో కార్యాలయాలను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మంగళవారం ముట్టడించారు. సమస్యలు పరిష్కరించనిదే కదిలేది లేదని డీఈఓ కార్యాలయాల ఎదుట బైటాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో కరీంనగర్‌ డీఈవో, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. సూళ్లలో పుస్తకాలు, యూనిఫాం అమ్మడం నిబంధనలకు విరుద్దమని, దీనిపై ఏం చర్యలు తీసుకున్నారని ఎస్‌ఎఫ్‌ఐ కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి రజనీకాంత్‌ ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల మేరకు పుస్తకాలు అమ్ముకునే హక్కు ఉందని డీఈవో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీఈవోకు...

20.06.2018

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాల అమలు కోసం ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు మహాధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్టు బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ ధర్నాల్లో రాష్ట్ర ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లోని బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆ ఫ్రంట్‌ చైర్మెన్‌ నల్లా సూర్యప్రకాశ్‌, రాష్ట్ర కన్వీనర్లు తమ్మినేని వీరభద్రం, మద్దికాయల అశోక్‌ తదితరులు విలేకరులతో మాట్లాడారు. నల్లా సూర్యప్రకాశ్‌ మాట్లాడుతూ...అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక వాగ్ధానాలు చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు దాటినా నేటికీ ఏ...

Pages